• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రైమ్

Fake Baba పుట్టు మచ్చల పేరిట న్యూడ్ ఫొటోలు.. దొంగ బాబా ఆగడాలు

మీ జాతకాలు చూస్తాం.. హస్తరేఖలు (Palmology), పుట్టుమచ్చలు (Moles), ఇతర మరకల ఆధారంగా ఉన్నది ఉన్నట్లు చెబుతామని చెప్పి వ్యక్తిగత ఫొటోలు తీసుకుంటున్న ముఠా ఆగడాల గుట్టు రట్టయ్యింది. వారు చేస్తున్న బాగోతాలు అన్నీ బహిర్గతమయ్యాయి.

February 25, 2023 / 01:30 PM IST

Nandyal పెళ్లయినా ప్రియుడితో సంబంధం.. కూతురిని అటవీ ప్రాంతంలో తీస్కెళ్లి

ఫోన్ కూడా చేయడం లేదని ప్రశ్నించడంతో ఆవేశంలో దేవేంద్ర రెడ్డి చేసిన దారుణాన్ని వివరించాడు. ఇది విన్న తాత శివారెడ్డి హతాశయుడయ్యాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు దేవేంద్ర రెడ్డిని తీసుకుని వెళ్లి అటవీ ప్రాంతంలో మృతదేహం కోసం పరిశీలించారు. మొదటి రోజు ఆనవాళ్లు లభించకపోవడంతో రెండో రోజు ఆమె శరీర అవయవాలు లభించాయి.

February 25, 2023 / 09:22 AM IST

Gujarat: పెళ్లవుతున్న ఆనందంలో వధువుకి గుండెపోటు.. చెల్లితో వరుడికి వివాహం

భారీ శబ్ధాలు భరించలేక హేతల్ గుండెపోటుకు గురై ఉంటుందని తెలుస్తున్నది. భారీ శబ్ధాలను తట్టుకోలేక గుండెపోటు వచ్చి ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. అందుకే శుభకార్యాల్లో డీజేను నిషేధిస్తున్నారు. సున్నితమైన వారు ఈ భారీ శబ్దాలను తట్టుకోలేక ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి.

February 25, 2023 / 11:38 AM IST

Medico Preeti: నెలలుగా టార్గెట్ చేసి వేధిస్తున్న సైఫ్: ఏసీపీ

వరంగల్ మెడికల్ విద్యార్థిని ప్రీతి నాయక్ ను లక్ష్యంగా చేసుకొని, నిందితుడు సీనియర్ సైఫ్ వేధించాడని వరంగల్ ఏసీపీ రంగనాథ్ శుక్రవారం వెల్లడించారు.

February 25, 2023 / 08:01 AM IST

Chennai College students fighting: వెళ్తున్న రైలును ఆపి కొట్టుకున్న విద్యార్థులు

తమిళనాడులోని చెన్నై శివార్లలో రెండు కాలేజీలకు చెందిన విద్యార్థుల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. ఎవరి కాలేజీ గొప్ప అనే విషయమై ఇరువర్గాలు గొడవకు దిగి, ఏకంగా ప్రయాణిస్తున్న రైలును ఆపి, కొట్టుకున్న సంఘటన వెలుగు చూసింది. ఈ సంఘటన శుక్రవారం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు విద్యార్థులు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు... చెన్నై నుండి సూళ్లూరుకు వెళ్తోంది లోకల్ రైలు. ఇందులో రెండు కాలేజీలకు చెందిన వ...

February 24, 2023 / 12:44 PM IST

Medico Preethi బిగ్ ట్విస్ట్.. ప్రీతిని వేధించిన నిందితుడు సైఫ్ అరెస్ట్

బాధితురాలు ఆరోపణల నేపథ్యంలో సైఫ్ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు మరికొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. విచారణ చేపట్టిన వరంగల్ జిల్లా పోలీసులు తాజాగా సైఫ్ ను అదుపులోకి తీసుకున్నారు. మట్టెవాడ పోలీసులు సైఫ్ అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వివరాలు మరిన్ని తెలియాల్సి ఉంది.

February 24, 2023 / 11:41 AM IST

Kondagattu Temple: కొండగట్టు అంజన్న ఆలయంలో దొంగతనం

కొండగట్టు అంజన్న ఆలయం(Kondagattu Temple)లో దొంగలు(Thieves) పడిన ఘటన చోటుచేసుకుంది. ఆలయంలోని 15 కిలోల వెండి, బంగారు నగలను దొంగలు దోచుకెళ్లారు.

February 24, 2023 / 11:20 AM IST

cyber fraud: కస్టమర్ కేర్ నెంబర్ కోసం వెతుకుతుంటే… రూ.8.24 లక్షలు చోరీ

నోయిడా (Noida)కు చెందిన సీనియర్ సిటిజన్ కపుల్ (senior citizen couple) ఇంటర్నెట్ లో ఓ డిష్ వాషర్ కంపెనీ కస్టమర్ కేర్ నెంబర్ (customer care number) కోసం వెతుకుతుండగా సైబర్ నేరగాళ్లు (Cyber crime) 8 లక్షల రూపాయలకు పైగా కొట్టేశారు.

February 24, 2023 / 10:08 AM IST

Accident: చత్తీస్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..11 మంది దుర్మరణం

చత్తీస్‌గఢ్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 11 మంది దుర్మరణం(11 Died) చెందారు. ఘటనలో పలువురు గాయాలపాలయ్యారు.

February 24, 2023 / 10:05 AM IST

Heart Stroke: 24 ఏళ్లకే గుండెపోటు.. జిమ్ లో కుప్పకూలిన కానిస్టేబుల్

చదువు పూర్తయిన వెంటనే విశాల్ కానిస్టేబుల్ గా ఉద్యోగం సాధించాడు. ఇప్పుడిప్పుడే జీవితంలో స్థిరపడుతున్న సమయంలోనే ఈ ఘటన జరగడం కలచివేస్తోంది. పాతికేళ్లు కూడా నిండని విశాల్ చనిపోవడం అతడి స్నేహితులను విషాదంలో ముంచింది. తమతో ఎప్పుడూ కలిసి సరదాగా ఉండే విశాల్ ఇలా ఆకస్మిక మరణం చెందడం తట్టుకోలేకపోతున్నారు.

February 24, 2023 / 09:48 AM IST

Gunmen Kills 7 : షాకింగ్..నవ్వారని ఏడుగురిని కాల్చి చంపేశాడు!

ఓ వ్యక్తి తనను చూసి నవ్వారని ఏడుగురిని కాల్చి చంపాడు(Gunmen Kills 7). ఆటలో ఓడిపోవడం చూసి నవ్వారని ఇద్దరు వ్యక్తులు ఏడుగురిని కాల్చి(Gunmen Kills 7) చంపేశారు. ఈ షాకింగ్ ఘటన బ్రెజిల్(Brazil) లోని సినాప్ నగరంలో చోటుచేసుకుంది.

February 23, 2023 / 07:09 PM IST

Sukhesh Chandrasekhar: జైల్లో ఏడ్చేశాడు…విలువైన వస్తువులు స్వాధీనం

200 కోట్ల రూపాయల మనీలాండరింగ్ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న నిందితుడు సుకేష్ చంద్రశేఖర్ తన జైల్లో ఏడ్చిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. అంతేకాదు తనతోపాటు విలావంతమైన వస్తువులు కూడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

February 23, 2023 / 02:09 PM IST

Shamshabad Airport:లో రూ.7 కోట్ల గోల్డ్ పట్టివేత

హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా అక్రమంగా తరలిస్తున్న బంగారంను 23 మంది నుంచి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 14.906 కేజీల ఆ గోల్డ్ విలువ 7 కోట్ల రూపాయలకుపైగా ఉంటుందని కస్టమ్స్ అధికారులు వెల్లడించారు.

February 23, 2023 / 09:57 AM IST

jharkhand elephant attack: 12 రోజుల్లో 16 మందిని చంపేసిన ఏనుగు, కర్ఫ్యూ

జార్ఖండ్ రాష్ట్రంలోని ఓ ఏనుగు (jharkhand elephant attack) అయిదు జిల్లాల్లో గ్రామస్థులను భయాందోళనకు గురి చేస్తోన్న విషయం తెలిసిందే. ఏనుగు కేవలం 12 రోజుల్లో 16 మందిని పొట్టన పెడ్డుకున్నది. ఇందులో ఒక రాంచీ జిల్లాలోనే నలుగురిని చంపేసింది.

February 22, 2023 / 10:12 AM IST

Elephant attacks: ఏనుగుల దాడిలో 3 రోజుల్లో 10 మంది మృతి

జార్ఖండ్‌ రాంచీ జిల్లాలోని పలు గ్రామాల్లో ఏనుగుల దాడులతో మూడు రోజుల్లో 10 మంది మరణించారు. ఈ క్రమంలో ప్రజలు ఇళ్లలోనే ఉండాలని అక్కడి అధికారులు సూచించారు.

February 21, 2023 / 08:43 PM IST