Waste Coming: చిన్నారి కంటి నుంచి వ్యర్థాలు.. బియ్యం గింజలు, కవర్లు
మహబాబూబాద్ జిల్లాకు చెందిన ఓ చిన్నారికి వింత ఆరోగ్య సమస్య వచ్చింది. కంటి నుంచి వ్యర్థాలు వస్తున్నాయి. ఆస్పత్రిలో చేర్చిన ఫలితం లేదు. వైద్యులు పరీక్షలు చేశారు. ఇప్పటి వరకు ఇలాంటి సమస్య చూడలేదని చెబుతున్నారు.
Girl Child:కంటిలో నలుసు పడితేనే ఇబ్బంది.. చేస్తోన్న పనులు ఆపి వేసి.. కంటికి బట్టతో రుద్దుకోవడమో.. లేదంటే నీళ్లలో పెట్టడమో జరుగుతుంది. చివరి ప్రయత్నంగా ఐ డ్రాప్స్ కూడా వేసుకుంటాం. మరీ కంటి నుంచి చిన్న చిన్న ప్లాస్టిక్ కవర్లు, బియ్యపు గింజలు వస్తే పరిస్థితి ఎలా ఉంటది.. వర్ణణాతీతం. అదీ కూడా ఓ ఆరేళ్ల పాప కంటి నుంచి వస్తున్నాయి.. దీంతో ఆ చిన్నారి నరకం అనుభవిస్తోంది.
మహబూబాబాద్ (Mahabubabad) జిల్లా కిష్టాపురానికి (kistapuram) చెందిన సౌజన్య (sowjanya) గురించి మనం ఇప్పటివరకు చర్చించింది. ఏం జరిగిందో తెలియదు.. గత 2, 3 నెలల నుంచి సౌజన్య కంటి నుంచి బియ్యపు గింజలు (Rice), ప్లాస్టిక్ కవర్లు (Plastic Covers), పేపర్లు (papers) వస్తున్నాయి. అవీ వచ్చి.. తీసే సమయంలో భరించలేని నొప్పి ఉంటుందట. అసలు ఎందుకు వస్తున్నాయో మాత్రం తెలియడం లేదు.
చికిత్స కోసం ఖమ్మం (kammam) మమత ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఇక్కడ వైద్యులు టెస్టులు చేస్తున్నారు. తర్వాత నిపుణుల అభిప్రాయం తీసుకుంటామని చెబుతున్నారు. ఎందుకు ఇలా జరుగుతుందో తెలియడం లేదని.. గతంలో ఇలాంటి కేసులు చూడలేదని తెలిపారు.
ఆ వ్యర్థాలు వచ్చే సమయంలో చిన్నారి తల్లడిల్లుతోంది. ఆమె తల్లిదండ్రులు కంటి నుంచి వస్తోన్న దు:ఖాన్ని ఆపుకొని ఉంటున్నారు. మరికొందరు చిన్నారిని చూసేందుకు వస్తున్నారు. ఎందుకిలా జరుగుతుందో మాత్రం తెలియడం లేదు. అంతుపట్టని వ్యాధి చిన్నారి సౌజన్యను పట్టి పీడిస్తోంది.