»Ap Vijayawada Software Employee Lost Rs 19 Lakh Loss In Cyber Crime
Cyber crime: లైక్ కొట్టింది రూ.19 లక్షలు స్వాహా..పైసలు ఊరికే రావు జాగ్రత్త!
ఈ మధ్య కాలంలో వాట్సాప్, టెలిగ్రామ్ యాప్ లలో ఓ కొత్తరకం ట్రెండ్ కొనసాగుతుంది. లైక్ లేదా సబ్ స్క్రైబ్ చేస్తూ పార్ట్ టైం జాబ్(part time job) చేయాలని ఫోన్లకు మేసేజులు వస్తున్నాయి. అవి చూసి అశా పడ్డారనుకో ఇక అంతే. మొదట లైక్ లేదా సబ్ స్క్రైబ్ చేస్తే రూ.100 లేదా రూ.150 పంపిస్తారు. ఇక తర్వాత అసలు దందా మొదలవుతుంది. ఈ స్కాం ద్వారా తాజాగా ఏపీకి చెందిన ఓ యువతి ఏకంగా 19 లక్షల రూపాయలు పొగొట్టుకుంది.
ప్రస్తుత కాలంలో బయట జరుగుతున్న ఆర్థిక నేరాల గురించి మనందరికీ అవగాహన ఉంది. ఈ విషయంలో చాలా వరకు చాలా మంది అప్ డేట్ అయ్యారు. తొందరగా మోసపోకుండా జాగ్రత్తపడుతున్నారు. అయితే, ఎంత జాగ్రత్తపడినా కొన్నిసార్లు మాత్రం తెలీకుండానే మోసపోతున్నవారు ఉన్నారు. తాజాగా ఓ సాప్ట్ వేర్ ఉద్యోగిని కేవలం ఒక్క లైక్ కొట్టి.. ఏకంగా రూ.19 లక్షలు పోగొట్టుకుంది. ఈ సంఘటన విజయవాడ(vijayawada)లో చోటుచేసుకోగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
విజయవాడకు చెందిన ఓ యువతి సాఫ్ట్వేర్ ఇంజినీర్(software employee)ఓ ట్రాప్ లో పడి రూ.19 లక్షలు పోగట్టుకుంది. కొంత కాలం క్రితం ఆమె మొబైల్‌కు ఓ మెసేజ్ వచ్చింది. పార్ట్‌టైమ్ ఉద్యోగం చేస్తూ డబ్బులు సంపాదించ్చు అనేది ఆ మెసేజ్ సారాంశం. సరే, ఏంటో చూద్దాం అని ఆమె ఓపెన్ చేసింది. యూట్యూబ్ వీడియోకి లైకులు కొడితే డబ్బులు వస్తాయని ఆమెను వారు నమ్మించారు. అంతే కదా, అది చేస్తే డబ్బులు వస్తాయి కదా అని ఆమె ఆశ పడింది.
మొదట ఆమె మూడు వీడియోలు లైక్ చేయగా.. ఆమెకు వెంటనే అకౌంట్లో రూ.150 జమ చేశారు. మరో ఆరు వీడియోలను లైక్ చేస్తే.. రూ.300 ఖాతాలో పడ్డాయి. ఆమెకు నమ్మకం కుదిరేలా డ్రామా ఆడారు. ప్రీపెయిడ్ టాస్కులు(tasks) చేస్తే ఉద్యోగం పర్మినెంట్ చేస్తామని చెప్పడంతో నిజమని నమ్మింది.
డబ్బులు పెట్టుబడిగా పెడితే లాభం వస్తుందని నమ్మించారు. ఆమె వెయ్యి రూపాయలు చెల్లిస్తే తిరిగి రూ.1,600 అకౌంట్లో జమ చేశారు. ఇలా ఆమె విడతల వారీగా రూ.19 లక్షలు కేటుగాళ్ల బ్యాంకు ఖాతాలకు(bank) బదిలీ చేసింది.
యువతి ఇచ్చిన డబ్బులకు లాభం వస్తుందని చూపుతున్నా..ఆ డబ్బుల్ని డ్రా చేసే అవకాశం లేకుండా పోయింది. ఆమెకు అనుమానం వచ్చి వారిని నిలదీగా అసలు ట్విస్ట్ బయటపడింది. ఇక రూ.19 లక్షలు తిరిగి ఇవ్వాలంటే.. రూ.12,95,000 కట్టాలని ఆమెతో చెప్పారు. దీంతో మోసపోయానని(Cyber crime) అర్థమైన యువతి పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.