»New Criminal Case Implementation Of New Laws Registration Of First Fir
New Criminal Case: కొత్త న్యాయచట్టాలు అమలు.. తొలి ఎఫ్ఐఆర్ నమోదు!
దేశవ్యాప్తంగా కొత్త నేర న్యాయ చట్టాలు అమల్లోకి వచ్చాయి. ఇండియన్ పీనల్ కోడ్, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్‌ల స్థానంలో భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య అధినియం చట్టాలను తీసుకొచ్చారు. ఈ చట్టాల కింద తొలి కేసు నమోదయ్యింది.
New Criminal Case: దేశవ్యాప్తంగా కొత్త నేర న్యాయ చట్టాలు అమల్లోకి వచ్చాయి. ఇండియన్ పీనల్ కోడ్, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్‌ల స్థానంలో భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య అధినియం చట్టాలను తీసుకొచ్చారు. ఈ చట్టాల కింద తొలి కేసు నమోదయ్యింది. దేశరాజధాని ఢిల్లీలో ఓ చిరు వ్యాపారిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆ వ్యాపారి రోడ్డుపై వాటర్ బాటిళ్లు, గుట్కా, బీడీ, సిగరెట్లు అమ్మడాన్ని పెట్రోలింగ్ పోలీసులు గుర్తించారు. దుకాణం రోడ్డుకి అడ్డంగా ఉందని, దాన్ని తీసేయాలని ఆ వ్యాపారికి చెప్పారు. ఎన్నిసార్లు చెప్పిన అతను వినకపోయేసరికి భారతీయ న్యాయ సంహిత క్రిమినల్ కోడ్‌లోని సెక్షన్ 285 ప్రకారం అతనిపై కేసు నమోదు చేశారు.
ఈ సెక్షన్ ప్రకారం రోడ్లను ఆక్రమించడం, ప్రమాదాలకు కారణం లాంటి చర్యలు నేరంగా పరిగణించి జరిమానా విధిస్తారు. దాదాపు రూ.5 వేల వరకు జరిమానా ఉంటుంది. ఈ కొత్త చట్టాల ప్రకారం క్రిమినల్ కేసుల్లో విచారణ పూర్తయిన 45 రోజుల్లోగా కచ్చితంగా తీర్పు వెలువడాలి. తొలి విచారణ జరిగిన 60 రోజుల్లోపు అభియోగాలు నమోదు చేయాలి. మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల కోసం కోత్త అధ్యాయాన్ని చేర్చారు. చిన్నారులపై సామూహిక అత్యాచారానికి పాల్పడితే మరణశిక్ష లేదా యావజ్జీవశిక్ష పడనుంది. పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేయడం, చిన్నారులపై సామూహిక అత్యాచారం, మూకదాడి తదితర నేరాలకు ఇంతకుముందు ఐపీసీలో ప్రత్యేకంగా సెక్షన్లు లేవు. దీంతో గందరగోళం ఏర్పడేది. భారతీయ న్యాయ సంహితలో ఆ లోటును పూడ్చారు.