»Huge Amount Of Drugs And Weapons Seized In Punjab Pakistan Border
Punjab-Pakistan: పాక్ సరిహద్దులో భారీగా డ్రగ్స్, తూటాలు స్వాధీనం
పంజాబ్‌లోని పాక్ సరిహద్దులో భద్రతా దళాలకు భారీగా డ్రగ్స్ అండ్ బులెట్స్ దొరికినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బీఎస్ఎఫ్ దళాలు తనిఖీలు చేస్తున్నారు.
Huge amount of drugs and weapons seized in Punjab-Pakistan border
Punjab-Pakistan: ప్రతిరోజూ భారత్(India)లో చొరబడటానికి పాకిస్తాన్(Pakistan) టెర్రరిస్టులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. వారిని భారత దళాలు నిత్యం అడ్డుకుంటూనే ఉన్నాయి. తాజాగా పంజాబ్(Panjab)లోని పాక్ సరిహద్దులో భద్రతా దళాలు భారీగా డ్రగ్స్(Drugs), తూటాలు(Bullets) స్వాధీనం చేసుకున్నాయి. తార్న్ తరన్ జిల్లాలో అంతర్జాతీయ సరిహద్దు సమీపంలోని పొలంలో దాదాపు మూడు కిలోల హెరాయిన్‌తోపాటు నాలుగు కాట్రిడ్జ్‌లను స్వాధీనం చేసుకున్నట్టు సరిహద్దు భద్రతా దళ అధికారి సోమవారం పేర్కొన్నారు. కలాష్ హవేలియన్ గ్రామ శివార్లలో ఆదివారం సాయంత్రం పంజాబ్ పోలీసులతో కలిసి బీఎస్ ఎఫ్ దళాలు తనిఖీలు నిర్వహించాయని అధికారి వెల్లడించారు. ఈ సరిహద్దుల్లో గాలింపు చర్యలు చేపడుతుండగా సగం కాలిన స్థితిలో దాదాపు 3 కిలోల మూడు చిన్న ప్యాకెట్లను గుర్తించారు. వాటిని పరిశీలించగా నిషేధిత హెరాయిన్ ప్యాకెట్లతో పాటు 30 ఎంఎం ఆయుధానికి చెందిన నాలుగు కాట్రిడ్జ్‌లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం దీనిపై దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. సరిహద్దు ప్రజలు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని, భద్రతా బలగాలకు సహరించాలని కోరారు.