Ginger Garlic: ఈ రోజుల్లో ప్రతీది కల్తీ అయిపోయింది. పాల నుంచి నీళ్ల వరకు అన్ని కల్తీనే. తాజాగా అల్లం వెల్లుల్లి పేస్ట్(Ginger paste) చేసి అమ్ముతున్న ముఠాను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. డక్కన్ ట్రేడర్స్ పేరుతో ఉప్పరపల్లిలో తయారు చేస్తున్న నలుగురు నిందితులను పట్టుకున్నారు. బేగంపేట(Begumpet) కేంద్రంగా కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను విక్రయిస్తున్నారు. అక్కడి నుంచి చిన్న అవుట్ లేట్లకు పంపిస్తారు. కేవలం హైదరాబాద్‌లో కాకుండా ఇతర ప్రాంతాలకు పంపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ ఆపరేషన్‌లో మొత్తం నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 700 కిలోల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్టును సీజ్ చేశారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.