Gayatri Joshi's billionaire husband being probed for fatal Italy car crash, could face 'double road homicide' charges
Double road homicide: బాలీవుడ్ నటి గాయత్రీ జోషి(Gayatri Joshi)..భర్త వికాస్ ఒబెరాయ్(Vikas Oberoi)తో కలిసి ఇటలీలో ప్రయాణిస్తున్న కారు ఘోర ప్రమాదానికి గురయిన విషయం తెలిసిందే. యాక్సిడెంట్లో గాయత్రీ జోషి, భర్త వికాస్ ఒబెరాయ్ ప్రాణాలతో బయటపడ్డారు. రోడ్డు ప్రమాదంలో స్విట్జర్లాండ్‌కు చెందిన మెలిస్సా క్రౌట్లీ(63), మార్కస్ క్రౌట్లీ(67) ఇద్దరు మరణించారు. వికాస్ ఇబెరాయ్పై డబుల్ రోడ్ మర్డర్ ఆరోపణలతో విచారణ జరుగుతుంది. ఇందులో దోషిగా తేలితే ఏడు సంవత్సరాల శిక్ష పడే అవకాశం ఉంది.
వికాస్ నీలం లంబోర్ఘిని హురాకాన్ను నడుపుతున్నాడు. ఫెరారీ కారు దూసుకు రావడంతో ప్రమాదం జరిగింది. గాయత్రి జోషి ప్రయాణిస్తున్న లంబోర్ఘిని పైకప్పు మొత్తం పాడైపోయింది. ఈ ప్రమాదంలో వారు క్షేమంగా ఉండడం వారి అదృష్టంగా భావించాలి. వికాస్ ఒబెరాయ్ ప్రాపర్టీ మాగ్నెట్ ముంబై-లిస్టెడ్ ఒబెరాయ్ రియాల్టీని నడిపిస్తున్నారు. ముంబై సబర్బన్‌లో వెస్టిన్ హోటల్స్ కూడా వీరివే. గాయత్రీ జోషి(Gayatri Joshi) 2004లో విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రం ‘స్వదేస్’తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. షారూఖ్ సరసన కథానాయికగా నటించింది. ‘స్వదేస్’ తర్వాత, గాయత్రి నటనకు దూరంగా ఉండి తన వ్యక్తిగత జీవితంపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకుంది. ఆ క్రమంలో దేశంలోని ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ అయిన ఒబెరాయ్ కన్స్ట్రక్షన్స్ మేనేజింగ్ డైరెక్టర్ వికాస్ ఒబెరాయ్‌ను పెళ్లి చేసుకుంది. అప్పటి నుంచి సినిమాలకు దూరంగా ఉంది.