భారతీయ నౌకదళం, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరీ భారీ డ్రగ్స్‌ను సీజ్ చేసింది. సుమారుగా 3,300 కేజీల మాదకద్రవ్యాల్ని పట్టుకుంది. గుజరాత్‌లోని పోరుబందర్ తీరంలో ఆ డ్రగ్స్‌ను సీజ్ చేసింది.
Drugs: భారతీయ నౌకదళం, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరీ భారీ డ్రగ్స్‌ను సీజ్ చేసింది. సుమారుగా 3,300 కేజీల మాదకద్రవ్యాల్ని పట్టుకుంది. గుజరాత్‌లోని పోరుబందర్ తీరంలో ఆ డ్రగ్స్‌ను సీజ్ చేసింది. ఇటీవల కాలంలో అతిపెద్ద డ్రగ్స్ పట్టివేత ఇదే అని నేవీ తెలిపింది. సుమారుగా 3089 కేజీల ఛారస్, 158 కేజీల మెటాఫెటమైన్, 25 కేజీల మార్ఫైన్‌ను స్మగ్లింగ్ చేస్తున్న చిన్న షిప్‌ను నేవీ పట్టుకుంది. అయితే ఈ షిప్లో ఉన్న వాళ్లంతా పాకిస్థాన్‌కి చెందిన వాళ్లు. వీళ్లను అదుపులోకి తీసుకున్నారు. పీ8ఐ ఎల్ఆర్ఎంఆర్ నిఘా ఎయిర్‌క్రాఫ్ట్ ద్వారా పోరుబందర్ తీరం వద్ద తిరుగుతున్న అనుమానిత షిప్‌ను గుర్తించారు. ఆ షిప్లో డ్రగ్ స్మగ్లింగ్ జరుగుతున్నట్లు నేవీ అధికారులు భావించారు. కొన్ని రోజుల క్రితం పుణెలో సుమారు 2500 కోట్లు ఖరీదు చేసే 1100 కేజీల మెఫిడ్రోన్ అనే డ్రగ్‌ను పట్టుకున్న విషయం తెలిసిందే.
Pursuing PM @narendramodi Ji's vision of a drug-free Bharat our agencies today achieved the grand success of making the biggest offshore seizure of drugs in the nation. In a joint operation carried out by the NCB, the Navy, and the Gujarat Police, a gigantic consignment of 3132…