Chandana: దీప్తి హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. 3 రోజుల క్రితం కోరుట్లలో దీప్తి చనిపోయిన సంగతి తెలిసిందే. పేరంట్స్ ఇద్దరూ ఫంక్షన్ ఉందని హైదరాబాద్ వెళ్లగా.. ఇంట్లో దీప్తి, ఆమె సోదరి చందన (Chandana) మాత్రమే ఉన్నారు. దీప్తి, చందనకు ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నట్టు ఆడియో కాల్ ద్వారా తెలిసింది. అలాగే ఇద్దరూ లిక్కర్ తాగామని.. అక్కను లేపితే లేవలేదని.. తాను అక్కను చంపలేదని తమ్ముడు సాయికి వాయిస్ మేసెజ్ చేసింది.
అక్క అచేతనంగా ఉంటే.. పేరంట్స్కు సమాచారం ఇవ్వకుండా చందన పారిపోయింది. దీంతో ఆమెపై సందేహాలు వ్యక్తం అయ్యాయి. చందన పేరు మీద లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. దీంతో పోలీసులు ఆమె ఆచూకీ కోసం వెతకగా ఒంగోలులు దీప్తి, ఆమె స్నేహితుడు దొరికారు. అతనిది హైదరాబాద్ అని పోలీసులు చెబుతున్నారు. దీప్తి మృతి కేసులో పోస్టుమార్టం రిపోర్ట్ కీలకంగా మారనుంది. ఆ రిపోర్ట్ ఆధారంగా దీప్తి మరణానికి గల కారణం తెలిసే అవకాశం ఉంది. పోలీసుల అదుపులో ఉన్న చందనను తమదైన శైలిలో విచారిస్తే నిజ నిజాలు తెలిసే అవకాశం ఉంది. దీప్తి చనిపోయినప్పటీ నుంచి చందనపై అనుమానం వస్తోంది. ఆమె స్నేహితుడు అయినా ఆమెను హత్య చేస్తారని సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.