Anakapalle: అనకాపల్లిలో పెను విషాదం చోటు చేసుకుంది. అప్పుల బాధ తాళ్లలేక ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. గుంటూరు జిల్లా తెనాలికి చెందని శివరామకృష్ణ (40) కొంతకాలంగా కుటుంబంతో కలిసి అనకాపల్లిలో నివసిస్తున్నాడు. అతనికి భార్య మాధవి (38), ముగ్గురు పిల్లలు వైష్ణవి (16), లక్ష్మి (13), కుసుమప్రియ (9) ఉన్నారు. అప్పులు ఎక్కవ కావడంతో శివరామకృష్ణ ఇంట్లోనే భార్య పిల్లలో కలిసి ఆత్మహత్య చేసుకున్నాడు.
నిన్న రాత్రి అందరూ సైనేడ్ తాగి ఆత్మహత్య చేసుకున్నారు. అందులో శివరామకృష్ణ, మాధవి, వైష్ణవి, లక్ష్మి చనిపోగా.. కుసుమప్రియ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆ చిన్నారి ఆరోగ్యం కూడా విషమం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న పట్టణ సీఐ దాడి మోహన్ రావు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అన్నంలో పురుగులు మందు కలుపుకొని మృతి చెంది ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.