ముంబైలోని విలేపార్లే రైల్వే స్టేషన్ లో విషాద ఘటన జరిగింది. ఓ రైల్వే ఉద్యోగి ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. అందరు చూస్తుండగానే పట్టాలపైకి దూకేశాడు. రైల్వే ఉద్యోగి ఆత్మహత్యకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆయన పేరు రాకేష్ గౌడ్. పశ్చిమ రైల్వేలో చీఫ్ లోకో ఇన్ స్పెక్టర్ గా పని చేస్తున్నారు. రైల్వే స్టేషన్ లో ఆయన ప్లాట్ ఫామ్ పై నిల్చుని ఉన్నారు. కాసేపు అటు ఇటు తిరిగారు. ఇంతలో రైలు రావడం గమనించాడు. అంతే.. అకస్మాత్తుగా ప్లాట్ ఫామ్ నుంచి ట్రాక్ పైకి దిగాడు. ఆ వెంటనే ట్రాక్ పై పడుకున్నాడు. ఇంతలో రైలు వచ్చేసింది. రైలు అతడి పైనుంచి వెళ్లడంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే చనిపోయాడు.
రైల్వే ఉద్యోగి సూసైడ్ కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ సమయంలో ప్లాట్ ఫామ్ పై కొందరు ప్రయాణికులు ఉన్నారు. ఆ వ్యక్తి అలా సూసైడ్ చేసుకోవడాన్ని కళ్లారా చూసి షాక్ అయ్యారు. ఆయన ఎందుకలా పట్టాలపైకి దిగాడో అర్థమయ్యేలోపే ఆయన ప్రాణం పోయింది. కళ్ల ముందే సూసైడ్ ఘటన చూసి ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. కాగా, రైల్వే ఉద్యోగి ఆత్మహత్యకు కారణం తెలియాల్సి ఉంది.