• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

‘మానవత్వం లేని రెడ్డిలపై చర్యలు తీసుకోవాలి’

SRD: మానవత్వం లేని రెడ్డి లపై చర్యలు తీసుకోవాలని KVPS జిల్లా సహాయ కార్యదర్శి గణపతి డిమాండ్ చేశారు. నేడు ఖేడ్‌లో ఆయన మాట్లాడుతూ.. నాగర్ కర్నూల్ జిల్లా కమ్మేర మల్లన్న గుడిలోకి చాకలి చంద్రకళను స్థానిక రెడ్డిలు రానివ్వక పోవడంతో, ఆమె తమ్ముడు నిలదీయగా, ఆయనను చితకబాదారన్నారు. దీంతో ఇరువర్గాల మధ్య నెలకొన్న ఘర్షణలో 2నెలల పసికందును కాలితో నలిపి వేయడం దారుణమన్నారు.

February 22, 2026 / 09:13 PM IST

విజేతలకు బహుమతులు అందజేసిన మున్సిపల్ చైర్మన్

WNP: గత మూడు రోజులుగా జిల్లా యువజన క్రీడా శాఖ అధికారి సుధీర్ కుమార్ రెడ్డి అధ్యక్షతన సీఎం కప్ సెకండ్ ఎడిషన్ క్రీడా పోటీలో నిర్వహించారు. వనపర్తి పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహిస్తున్న సేపక్ తక్రా రాష్ట్ర స్థాయి క్రీడ పోటీలలో పురుషుల విభాగంలో హైదరాబాద్ ప్రధమ స్థానంలో నిలిచాయి. విజేతలకు మున్సిపల్ చైర్మన్ మాధవి రమేష్ చేతుల మీదిగా బహుమతులు అందజేశారు.

February 22, 2026 / 09:11 PM IST

అనుమానాస్పదంగా యువతి మృతి

MDCL: అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధి సూర్య నగర్‌లోని వీవీ స్విమ్మింగ్ పూల్‌లో ఈత నేర్చుకోవడానికి వచ్చిన ఇంటర్ చదివే అమ్మాయి అనుమానాస్పదంగా మృతి చెందింది. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని అల్వాల్ పోలీసులు వెల్లడించారు.

February 22, 2026 / 09:05 PM IST

ముగిసిన రాష్ట్ర స్థాయి సైక్లింగ్ పోటీలు

SDPT: చిన్నకోడూర్ మండలం చంద్లపూర్ రంగనాయక సాగర్ ప్రాజెక్టుపై రెండు రోజుల పాటు సాగిన ‘సీఎం కప్’ రాష్ట్ర స్థాయి సైక్లింగ్ పోటీలు ఆదివారం ముగిశాయి. జిల్లా యువజన క్రీడల అధికారి వెంకటనర్సయ్య పాల్గొని విజేతలకు మెడల్స్, సర్టిఫికెట్లు అందజేశారు. నైపుణ్యం గల క్రీడాకారులను గుర్తించి ప్రోత్సహించేందుకు ఇలాంటి పోటీలు ఎంతగానో దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు.

February 22, 2026 / 09:00 PM IST

‘గ్రామస్థాయిలో సేవాలాల్ జయంతి నిర్వహించాలి’

BDK: ఇల్లందు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం బంజారా సర్పంచ్లతో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించాలని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు. ఈనెల 28న నియోజకవర్గంలో సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకను అధికారికంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. గ్రామ స్థాయిలో కూడా జయంతిని నిర్వహించాలని కోరారు.

February 22, 2026 / 08:58 PM IST

వెంటనే ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి: అధికారులు

BHPL: రేగొండ మండలంలోని అన్ని గ్రామాల్లో ఇప్పటి వరకు ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకుని రైతులు వెంటనే ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచించారు. రిజిస్ట్రేషన్ చేసుకుంటే మాత్రమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు, సబ్సిడీలకు అర్హత పొందుతారని పేర్కొన్నారు. ఆలస్యం చేయకుండా సంబంధిత AEO వద్దకు వెళ్లి రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలన్నారు.

February 22, 2026 / 08:55 PM IST

ప్రశాంతంగా గురుకులాల కామన్ ఎంట్రన్స్ టెస్ట్

ADB: ఇంద్రవెల్లి మండలం పాటగూడలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో ఆదివారం నిర్వహించిన తెలంగాణ గురుకులాల కామన్ ఎంట్రన్స్ టెస్టు ప్రశాంతంగా జరిగింది. ఈ సందర్భంగా పరీక్ష కేంద్రం వద్ద విద్యార్థుల కోసం అన్ని ఏర్పాట్లు చేపట్టారు. ఈ పరీక్షకు విద్యార్థులు 219 మంది విద్యార్థులు హాజరైనట్లు.. 21 మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరైనట్లు అధికారులు తెలిపారు.

February 22, 2026 / 08:55 PM IST

‘దళిత జాతి శ్రేయస్సు కోసం కృషి’

కరీంనగర్ పట్టణ కేంద్రంలోని ఆల్ ఇండియా అంబేడ్కర్ యువజన సంఘం జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు మహేందర్ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం గ్రామ స్థాయిలో బలోపేతం,నిర్మాణం, నిమ్నవర్గాల అభివృద్ధి కోసం పలు అంశాల గురించి చర్చించారు. రాబోయే రోజుల్లో దళితజాతి శ్రేయస్సు కోసం కార్యక్రమాలు చేయడానికి నిర్ణయాలు తీసుకున్నామన్నారు.

February 22, 2026 / 08:51 PM IST

‘రోడ్డు భద్రతే లక్ష్యం.. నేటి నుంచే ‘అరైవ్ అలైవ్’

NRML: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణే ధ్యేయంగా ‘అరైవ్ అలైవ్’ రెండో దశ కార్య క్రమాన్ని ప్రారంభించినట్లు ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. నేటి నుంచి వారం రోజుల పాటు అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో డ్రైవ్ కొనసాగుతుందన్నారు. ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించడం, సురక్షిత ప్రయాణాన్ని ప్రోత్సహించడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని వివరించారు.

February 22, 2026 / 08:46 PM IST

భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఉత్సవాల్లో మాజీ ఎమ్మెల్యే

SRD: మునిపల్లి మండలం కంకోల్, ముగ్ధంపల్లి గ్రామ శివారులో గుట్టపై వెలిసిన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో ఆదివారం ప్రతిష్టాత్మక మహోత్సవాలు ఘనంగా జరిగాయి. అందోల్ మాజీ MLA చంటి క్రాంతి కిరణ్, BRS రాష్ట్ర నాయకులు పైతర సాయికుమార్, మాజీ ZPTCపైతర మీనాక్షి, మాజీ MPP శైలజ శివశంకర్ తదితరులు సందర్శించి స్వామివారికి పూజలు చేసి దర్శించుకున్నారు.

February 22, 2026 / 08:45 PM IST

చిన్నారిని హత్య చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి: SFI

WGL: కుమ్మెర జాతరలో కులం పేరుతో ఆరు నెలల చిన్నారిని కాళ్లతో తన్ని హత్య చేసిన అగ్రకుల పెత్తందార్ల పై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని SFI HNK జిల్లా కార్యదర్శి మంద శ్రీకాంత్ డిమాండ్ చేశారు. ఆదివారం రాత్రి WGLలోని కాకతీయ యూనివర్సిటీ మొదటి గేటు వద్ద SFI నేతల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కొవ్వొత్తులతో మౌనం పాటించి, దోషులను అరెస్ట్ చేయాలని కోరారు.

February 22, 2026 / 08:44 PM IST

అన్ని వర్గాల ప్రజలు ఉన్నత పదవులు చేపట్టాలి: ఎమ్మెల్యే

BDK: అశ్వరావుపేట మున్సిపాలిటీ లో గెలుపొందిన కౌన్సిలర్ల కు మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో సన్మాన సభ ఆదివారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ పసుపులేటి వీరబాబు పాల్గొని నూతన కౌన్సిలర్ల కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రానున్న కాలంలో అన్ని వర్గాల ప్రజలు ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు.

February 22, 2026 / 08:43 PM IST

ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యాటక స్వర్గం

ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యాటక ప్రియులకు ఆకర్షణీయమైన ప్రాంతంగా గుర్తింపు పొందింది. WGL జిల్లాలో వేయి స్తంభాల గుడి, ఓరుగల్లు కోట, భద్రకాళి దేవాలయం; MLG జిల్లాలో రామప్ప దేవాలయం, లక్నవరం, బోగోత జలపాతం; BHPL జిల్లాలో కోటగుళ్ళు, పాండవుల గుట్ట, కాలేశ్వరం ఆలయం వంటి చారిత్రక, ఆధ్యాత్మిక ప్రదేశాలకు పర్యాటకులు తరలివస్తున్నారు. మరి మీరు ఎప్పుడైనా వెళ్లారా?. కామెంట్ చేయండి.

February 22, 2026 / 08:43 PM IST

‘మహిళ సాధికారిక కొరకు కాంగ్రెస్ పెద్దపీట వేస్తుంది’

BDK: అంగన్వాడీ, డ్వాక్రా సంఘాల కార్యకలాపాల కోసం రూ. 50 లక్షలతో నూతనంగా కమ్యూనిటీ హాల్ భవనాన్ని నిర్మిస్తామని కార్పొరేటర్ హరిహరన్ హామీ ఇచ్చారు. మహిళా సాధికారతకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని 55వ డివిజన్ కార్పొరేటర్ హరిహరన్ పేర్కొన్నారు. ఆదివారం డివిజన్ పరిధిలోని డ్వాక్రా మహిళలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

February 22, 2026 / 08:43 PM IST

ఆ గ్రామంలో పెళ్లి కట్నకానుకలు నిషేధం

ADB: నార్నూర్ మండలంలోని ఖైర్డాట్వ గ్రామంలో ఆదివారం గ్రామస్థులు కలిసి పెళ్లి కట్నకానుకను నిషేధిస్తూ తీర్మానించారు. ఈ నేపథ్యంలో అదే గ్రామానికి చెందిన వధువు మడావి పూర్ణబాయి పెళ్లి కోసం 100 కుటుంబాలు కలిసి రూ. 26,551 నగదు పొదుపు చేసి అందజేయడంతో వారు ఆదర్శంగా నిలిచారు. ఈ కార్యక్రమంలో గ్రామ పటేల్ మడావి నరాంజి రావు, జంగు, మోతిరాం, గోవిందరావు ఉన్నారు.

February 22, 2026 / 08:40 PM IST