KMR:ఆర్టీసీ సిబ్బంది మరోసారి తమ నిజాయితీని చాటుకున్నారు.ఆదివారం NZB రెండో డిపోకు చెందిన ఎలక్ట్రికల్ బస్సులో ప్రయాణించిన ఓ మహిళ తన స్మార్ట్ ఫోన్‌ను సీట్లోనే మర్చిపోయింది. బస్సు కామారెడ్డి చేరుకున్నాక ఫోన్‌ను గమనించిన కండక్టర్ నమ్రత, వెంటనే బస్టాండ్ పాయింట్ కంట్రోలర్ సమక్షంలో సదరు ప్రయాణికురాలికి దానిని అందజేశారు.
NLG: చిట్యాల మండలం ఉరుమడ్లలో పాత ముత్యాలమ్మ, మారమ్మ దేవాలయాల స్థలంలో నూతన నిర్మాణానికి తెలంగాణ డైరీ కార్పోరేషన్ ఛైర్మెన్ గుత్తా అమిత్ రెడ్డి ఇవాళ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు గుత్తా దేవేందర్ రెడ్డి, సర్పంచ్ సాగర్ల భానుశ్రీ, ఉపసర్పంచ్ నరేష్, కోనేటి యాదగిరి, పల్లపు బుద్ధుడు, జనపాల శీను, దినేష్, హరి ప్రసాద్, పూలమ్మ పాల్గొన్నారు.
VKB: పరిగి-షాద్నగర్ వరకు నాలుగు లైన్‌ల రహదారి నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. రహదారి ఇరువైపులా యంత్రాలతో విస్తృతంగా పనులు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ప్రత్యేకించి రాత్రి సమయంలో వెలుతురు తక్కువగా ఉండే ప్రదేశాల్లో జాగ్రత్తగా వాహనాలు నడపాలని కోరారు. సూచిక బోర్డులను వాహనదారులు గమనించాలని తెలిపారు.
SRPT: కోదాడ పట్టణంలోని 13వ వార్డులో ఆదివారం దోమల మందు పిచికారి కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్ చైర్‌పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు ఆదేశాల మేరకు, వార్డు కౌన్సిలర్ గురవమ్మ సైదిబాబు యాదవ్ పర్యవేక్షణలో సిబ్బంది ఫాగింగ్ చేశారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఈ సందర్భంగా వారు కోరారు.
RR: కేశంపేట(మం) ఇప్పలపల్లి గ్రామానికి చెందిన అంజయ్య అనే వ్యక్తి అనారోగ్యంతో ఆదివారం మృతి చెందాడు. విషయం తెలుసుకున్న గ్రామానికి చెందిన యువనాయకుడు శ్రీనివాసులు స్పందించి అంజయ్య అంత్యక్రియలకు రూ.10,000 మృతుడి కుటుంబ సభ్యులకు అందజేశారు. అంజయ్య మృతి పట్ల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
WNP: ఆర్థిక స్తోమత సరిగా లేక, సొంత ఇల్లు నిర్మించుకోలేక నానా అవస్థలు పడుతున్న నిరుపేదల సొంత ఇంటి కల నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో సకారం అవుతుందని వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి తెలిపారు. ప్రతి ఇంటికి పెద్దన్నగా భరోసా కల్పిస్తూ నేనున్నానంటూ గృహప్రవేశానికి హాజరై నూతన వస్త్రాలు అందించారు. అందుకు ఎమ్మెల్యే మేఘారెడ్డికి వారు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
ADB: కామారెడ్డిలో ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి క్యాంప్ కార్యాలయంపై కాంగ్రెస్ నాయకుల దాడిని ఖండిస్తూ బీజేపీ చలో కామారెడ్డికి పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఆదివారం ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ క్యాంప్ కార్యాలయం వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేకే రక్షణ లేకపోతే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని పాయల్ శంకర్ ఆందోళన వ్యక్తం చేశారు.
SRD: నారాయణఖేడ్ MLA సంజీవరెడ్డి కుమారుడి ఖేడ్ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత విజయపాల్ రెడ్డి హాజరయ్యారు. హైదరాబాద్ శివారులోని వట్టినాగులపల్లిలో గల వన్ కన్వెన్షన్ వేదికగా జరిగిన వివాహ వేడుకలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు. దాంపత్య జీవితం ఆనందంతో ఉండాలి ఆకాంక్షించారు.
JGL: రాయికల్ మండలంలోని మైతాపూర్ గ్రామంలో ఆదివారం గ్రామపంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యుడు శ్రీకాంత్ రెడ్డి రోగులను పరీక్షించారు. అనంతరం బీపీ, షుగర్ పరీక్షలు చేశారు. దాదాపు 200 మంది శిబిరంలో పాల్గొన్నట్లు పేర్కొన్నారు. సర్పంచ్ తలారి నాగమణి, ఉపసర్పంచ్ ప్రణయ్ రెడ్డి, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
BDK: ఇల్లందు కరెంట్ ఆఫీస్ ఏరియాలో ఐ ఎన్ టీ వీ సీ ట్రాలీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే కోరం కనకయ్య పాల్గొని నూతన ట్రాలీ యూనియన్ అధ్యక్ష కార్యదర్శుల ఎన్నుకోబడిన వారిని శుభాకాంక్షలు తెలియజేశారు. వారు మాట్లాడుతూ.. యూనియన్ ద్వారా ప్రమాద బీమా ఇన్సూరెన్స్ కల్పిస్తామని హామీ ఇచ్చారు.
NZB: వేల్పూర్ మండలం పచ్చల నడుకుడలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు టక్కరి గంగాధర్, గ్రామ శాఖ అధ్యక్షుడు గుడాల మోహన్ కిషన్ చేతుల మీదుగా లబ్ధిదారులు ఆలీ నరహరికి ₹ 26,000, ముసుకు నవీన్‌కు ₹ 9,000 విలువైన చెక్కులను అందజేశారు. పేదలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.
NRPT: దామరగిద్ద మండలంలోని అంబా భవానీ ఆలయంలో భవానీ మాత విగ్రహ 25వ వార్షికోత్సవ వేడుక ఘనంగా నిర్వహించబడింది. అమ్మవారికి మంగళహారతులు, బండారు, చందనం, అభిషేక పూజలు చేశారు. ప్రభురాజ్, రఘునాథ్ రావు ఆధ్వర్యంలో భక్తులకు తీర్థప్రసాదాలు, అన్నదానం అందజేశారు. ప్రజలు, నాయకులు పాల్గొన్నారు.
PDPL: మంథని మున్సిపాలిటీ పరిధిలోని శ్రీరామ్ నగర్, కూచిరాజుపల్లి, గంగాపురి స్టేజీల వద్ద రాత్రి సమయంలో ఎక్స్‌ప్రెస్ బస్సులు నిలిపివేయాలని డిపో మేనేజర్ శ్రావణ్‌కుమార్‌కు బీజేపీ నాయకుడు బోయిని నారాయణ వినతి పత్రం అందజేశారు. హైదరాబాద్, కరీంనగర్ ప్రాంతాలకు వెళ్లి తిరిగివచ్చే ప్రయాణికులు బస్సులు ఆగక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
మంచిర్యాల మేయర్ ధరణి మధుకర్‌ను కాంగ్రెస్ పార్టీ లక్షేట్టిపేట మండల నాయకులు కలిశారు. మంచిర్యాల మేయర్‌గా ధరణి మధుకర్, డిప్యూటీ మేయర్‌గా సల్ల రమ్య ఆదివారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా లక్షెట్టిపేట మండల, పట్టణ నాయకులు ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. అనంతరం ఛైర్మన్, వైస్ ఛైర్మన్లను కలిసి అభినందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
BHPL: మున్సిపాలిటీ నూతన ఛైర్మన్‌గా బుర్ర కొమురయ్య గౌడ్, వైస్ ఛైర్మన్‌గా అంబాల శ్రీనివాస్ ఆదివారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ముఖ్యఅతిథిగా MLA గండ్ర సత్యనారాయణ రావు హాజరై, మాట్లాడారు. మున్సిపాలిటీ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారని, ఈ విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని పేర్కొన్నారు. అనంతరం నూతన ఛైర్మన్ సంతకం చేసి బాధ్యతలు స్వీకరించారు.