• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

నగరంలో రంజాన్ శోభ ప్రారంభం

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా రంజాన్ శోభ సంతరించింది. పవిత్ర రంజాన్ మాసం ప్రారంభంతో ముస్లింలు ఉపవాస దీక్షలు ప్రారంభించారు. మసీదులను విద్యుదీపాలతో అలంకరించి, నెల రోజులపాటు తరావీ నమాజ్లు నిర్వహించనున్నారు. ముస్లిం ఉద్యోగులకు పనివేళల్లో వెసులుబాటు కల్పించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

February 19, 2026 / 09:07 AM IST

ఉమ్మడి జిల్లాలో ఎస్సీలకు ఉచిత శిక్షణ

MBNR: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎస్సీ స్టడీ సర్కిల్ నిరుద్యోగులకు ఉచిత శిక్షణ ఇస్తోంది అని డైరెక్టర్ కే.శ్రీ తెలిపారు. గ్రూప్-1, 2, 3, 4, SSC, RRB, Banking, SI & PC అభ్యర్థులు ఈ నెల 22లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వచ్చే నెల 1న MBNR NTR డిగ్రీ కళాశాలలో ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. 89773 40006 లేదా www.tsstudycircle.co.inను సంప్రదించవచ్చని పేర్కొన్నారు.

February 19, 2026 / 08:58 AM IST

‘కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అండగా నిలవాలి’

BDK: నాయి బ్రహ్మణ సంఘం నాయకులు, చిరకాల మిత్రుడు గుడివాడ నాగేశ్వరరావు మృతి పట్ల ఎమ్మెల్యే కోరం కనకయ్య దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం వారి కుటుంబ సభ్యులను ఎంఎల్ఏ పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కష్ట సమయంలో ఉన్న వారి కుటుంబానికి కాంగ్రెస్ శ్రేణులు అండగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు.

February 19, 2026 / 08:57 AM IST

గుండెపోటుతో యువకుడు మృతి

MDK: వెల్దుర్తి మండల పరిధిలోని ఆరెగూడెంలో బుధవారం రాత్రి గుండెపోటుతో తిరుపతి (23) అనే యువకుడు మృతి చెందాడు. రాత్రి 11:30 గంటల సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో మరణించినట్లు స్థానికులు తెలిపారు. అందరితో కలుపుగోలుగా ఉండే తిరుపతి మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. చిన్న వయసులోనే గుండెపోటు రావడం గ్రామస్థులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

February 19, 2026 / 08:51 AM IST

జిల్లాలో సెకండ్ ఫేజ్ యూరియా బుకింగ్ షురూ

MDCL: జిల్లాలో సెకండ్ ఫేజ్ యూరియా బుకింగ్ ప్రారంభమైంది. రైతులు ఫెర్టిలైజర్ యాప్ ద్వారా సులభంగా ముందస్తు బుకింగ్ చేసుకోవచ్చు. పాస్ బుక్ చేసిన మొబైల్ నంబర్‌తో లాగిన్ అయి అవసరమైన పరిమాణాన్ని ఎంపిక చేసి సమీప ఎరువుల దుకాణాన్ని సెలెక్ట్ చేయాలి. బుకింగ్ నిర్ధారణ తర్వాత మెసేజ్ వస్తుందని పేర్కొన్నారు.

February 19, 2026 / 08:25 AM IST

దోమల బెడదతో నరకం.. పట్టించుకోరా..?

MDCL: ఉప్పల్ పరిధిలోని గణేష్ నగర్, సెవెన్ హిల్స్, కావేరి నగర్, శ్రీనగర్ ప్రాంతాల్లో దోమల బెడద తీవ్రంగా మారింది. కాలువల్లో నిల్వ నీరు, చెత్త పేరుకుపోవడం, గుర్రపు డెక్క వల్ల దోమలు విపరీతంగా పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సాయంత్రం తర్వాత బయటకు రావడం కష్టంగా మారింది. డెంగ్యూ, మలేరియా భయం నెలకొంది.

February 19, 2026 / 08:14 AM IST

‘ఎన్నికల్లో గెలవాలంటే ప్రజాస్వామికంగా గెలవాలి’

BDK: ఎన్నికల్లో గెలవాలనుకుంటే ప్రజాస్వామికంగా గెలవాలని, కానీ పోలీసులను వాడుకోవడం దేనికని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రశ్నించారు. కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లో నామినేషన్ విత్ డ్రా చేసుకోవాలని సీపీఐ అభ్యర్థిని ఒక సీఐ తుపాకీ పెట్టి బెదిరించాడని ఆరోపించారు. తమ అభ్యర్థులను పోలీసులతో అణచివేయాలని చూసిన ఎన్నికల్లో గెలిచి చూపించామన్నారు.

February 19, 2026 / 08:08 AM IST

ఏడుపాయల వన జాతర ఆదాయం ఎంతంటే..?

MDK: ఏడుపాయల మహాశివరాత్రి జాతర హుండీ లెక్కింపును బుధవారం గోకుల్ ఫంక్షన్ హాల్‌లో చేపట్టారు. 29 రోజుల హుండీ ఆదాయం రూ.39,87,178తో పాటు ఒడిబియ్యం, తలనీలాలు, ప్రత్యేక దర్శన టికెట్లు, లడ్డూ, పులిహోర విక్రయ సేవాల ద్వారా మొత్తం దేవస్థానానికి రూ.87,56,265 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో వీరేశం తెలిపారు. 2025 కంటే 2026లో ఆదాయం రూ.26,06,031 ఎక్కువగా వచ్చిందన్నారు.

February 19, 2026 / 08:06 AM IST

పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్

HNK: జిల్లాలో ఇంటర్మీడియట్, పదో తరగతి వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారు. బుధవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 52 కేంద్రాల్లో ఇంటర్, 64 కేంద్రాల్లో పదో తరగతి పరీక్షలు జరుగుతాయని వెల్లడించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు.

February 19, 2026 / 08:05 AM IST

మనస్పర్థలతో యువకుడు ఆత్మహత్య

MDK: మనస్పర్థలతో యువకుడు ఆత్మహత్య చేసుకన్న చిలిపిచెడ్ మండలం చిట్కుల్‌లో జరిగింది. గ్రామానికి చెందిన అశోక్ (30) సంగారెడ్డి జిల్లా చౌటకూర్‌కు ఇల్లరికం వెళ్లాడు. కుటుంబంలో తలెత్తిన చిన్నపాటి మనస్పర్థల కారణంగా మనస్తాపం చెంది పొలానికి వెళ్లి ఉరివేసుకుని ప్రాణాలు విడిచాడు. చేతికందిన కొడుకు మృతితో చిట్కుల్‌లోని తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు.

February 19, 2026 / 08:04 AM IST

రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన: మంత్రి

WGL: ఉమ్మడి జిల్లా ముస్లిం సోదర, సోదరీమణులకు పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా రాష్ట్ర మంత్రి కొండా సురేఖ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ముస్లింలకు రంజాన్ నెల అత్యంత పవిత్రమైనదని మంత్రి పేర్కొన్నారు. ఈ మాసంలో ముస్లిం ప్రజలందరూ ఉపవాసాలు, ప్రార్థనలు, దానధర్మాలతో, ఆరోగ్యంగా, సంతోషంగా గడపాలని మంత్రి సురేఖ కోరారు.

February 19, 2026 / 08:02 AM IST