ఆసిఫాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు తగ్గాయి. ఇటీవల కురిసిన వర్షాలకు ఉష్ణోగ్రతలో వ్యత్యాసం ఏర్పడింది. గడిచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. ఆసిఫాబాద్ 30.8°C, వాంకిడి 30.7, కాగజ్ నగర్ 30.6, జైనూర్ 30.6, కెరమెరి 30.4, రెబ్బెన 30.2, సిర్పూర్(యూ) 30.2, సిర్పూర్ (టి) 29.6, తిర్యాణిలో 28.2, ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
KMR: ఈ నెల 20వ తేదీ నుంచి 22వ తేదీ వరకు సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట్టలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న రైతు మహోత్సవానికి రైతులు పెద్ద సంఖ్యలో హాజరై కావాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ కోరారు. వ్యవసాయ, ఉద్యానవన రంగాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నట్లు చెప్పారు.
NLG: వేసవి ఎండలు ముదురుతుండడంతో హాలియా పరిసర ప్రాంతాల్లో కొబ్బరి బోండాలకు విపరీతమైన గిరాకీ పెరిగింది. రోడ్ల పక్కన విక్రయాలు జోరుగా సాగుతుండగా, ఒక్కో బోండా ధర రూ.30 నుంచి 50 పలుకుతోంది. లీటర్ బాటిల్ కొబ్బరి నీరు రూ.100 వరకు విక్రయిస్తున్నారు. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని వైద్యులు సూచించడంతో ప్రజలు వీటిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.
BDK: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిను భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానం తరపున అర్చకులు ఇవాళ ఆహ్వానం అందజేశారు. శ్రీరామనవమి తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఈ.వో దామోదర్ రావు, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పాల్గొన్నారు.
MNCL: జన్నారం మండలంలోని వివిధ గ్రామాలలో ఉగాది పండుగను నిర్వహించుకున్నారు. ఉగాది సందర్భంగా గురువారం జన్నారంతో పాటు వివిధ గ్రామాలలో ఉన్న దేవాలయాలను భక్తులు, ప్రజలు సందర్శించి స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జన్నారంలోని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దేవాలయంలో ఉగాది ఉత్సవాలు ఘనంగా జరిగాయి. నిర్వాహకులు ప్రజలకు ఉగాది పచ్చడిని అందజేశారు.
MULG: ఏటూరునాగారం మండలం కోయగూడ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ పోరిక సరిత గురువారం చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేసి ఉగాది పచ్చడిని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గాంధీ, వార్డ్ సభ్యులు గద్దె జయకృష్ణ, నాగవత్ శ్రీకాంత్, ఫీల్డ్ అసిస్టెంట్ ముకుందరావు తదితరులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
SDPT: శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా రాష్ట్ర ప్రజలకు మంత్రి పొన్నం ప్రభాకర్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలని, కొత్త ఏడు ఆశయాల సాకారం, సుఖసంతోషాలను ఇవ్వాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి, పంటలు పండి ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆయన ప్రార్థించారు.
NLG: హాలియాకు చెందిన చింతలచెరువు తేజు జాతీయ స్థాయి ఫుట్‌బాల్లో ప్రతిభ చాటుతున్నాడు. చిన్న వయసులోనే క్రమశిక్షణతో సాధన చేస్తూ ముందుకు సాగుతున్నాడు. హరియాణాలో జరిగిన అండర్-17 జాతీయ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. అద్భుతమైన ఆటతీరు ప్రదర్శించి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఈ సందర్భంగా స్థానికులు తేజును అభినందిస్తున్నారు.
NZB: నర్సింగ్ పల్లిలోని ఇందూరు తిరుమల గోవింద వనమాల క్షేత్రం ఆలయంలో గురువారం సాయంత్రం 6 గంటలకు పంచాంగ శ్రవణ కార్యక్రమం ఉంటుందని ఆలయ ప్రధాన ధర్మకర్త శ్రీమాన్ నరసింహారెడ్డి తెలిపారు. ఆలయ ప్రధాన అర్చకుడు రోహిత్ కుమార్ ఆచార్య పంచాంగ శ్రవణం చేయనున్నారు. మన శాస్త్రాల ప్రకారం ఉగాది పర్వదినాన సాయంత్రం ఆలయాల్లో ఉత్తరాభిముఖంగా కూర్చొని పంచాంగ శ్రవణం చేయడం ఆనవాయతీ.
RR: ఉగాది పర్వదినాన షాద్‌నగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్‌కు భారీ షాక్ తగిలింది. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సమక్షంలో రంగాపూర్ గ్రామ సర్పంచ్ అంజమ్మ, ఉప సర్పంచ్ బసవయ్యల ఆధ్వర్యంలో పలువురు వార్డు సభ్యులు కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి పార్టీ కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పని అయిపోయిందన్నారు.
MDCL: ఉప్పల్, హబ్సిగూడ ప్రాంతాల్లో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో అధికారులు ఎక్కడికక్కడ ఫీడర్ సర్వీస్ సేవలు కొనసాగిస్తున్నారు. హనుమాన్ టెంపుల్, నాచారంలోని వివిధ ప్రాంతాల్లో ట్రాన్స్ ఫార్మర్ మరమ్మతుల సమస్యల సైతం కొనసాగిస్తున్నట్లు వివరించారు. వేసవికాలంలో విద్యుత్ డిమాండ్ తగ్గట్లుగా, ఎలాంటి అంతరాయం ఏర్పడకుండా చర్యలు చేపడుతున్నారు.
KMM: జిల్లాలో ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ నెల 31 వరకు 20 స్పెషలిస్ట్ వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే 9 శిబిరాలు పూర్తికాగా, మిగిలిన చోట్ల స్త్రీ, శిశు, కంటి వైద్య నిపుణులు ఉచిత పరీక్షలు చేసి మందులు అందజేస్తారు. జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ డి. రామారావు కోరారు.
MBNR: మ్యారేజి రిజిస్ట్రేషన్లలో మహబూబ్ నగర్ మొదటి స్థానంలో నిలిచింది. మహబూబ్ నగర్ రిజిస్ట్రేషన్ కార్యాలయ పరిధిలో 2025 వ సంవత్సరంలో 1330 హిందువులు 35 మంది ఇతరులు మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇక ప్రస్తుతం 2026వ సంవత్సరంలో 123 మంది హిందువులు ఒకరు ఇతరులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అట్టడుగు స్థానంలో ఉమ్మడి జిల్లాలోని ఆత్మకూరు నిలిచింది.
NRML: నర్సాపూర్ జీ మండలంలోని టెంబుర్ని గ్రామంలో రాబోయే హనుమాన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయ శుభ్రపరిచే పనులు, సంప్రదాయ అలంకరణలు ఘనంగా ప్రారంభమయ్యాయి. గ్రామస్తులు భక్తి శ్రద్ధలతో దేవాలయాన్ని తీర్చిదిద్దుతూ ప్రత్యేక పూజల ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. పండుగను వైభవంగా నిర్వహించేందుకు సన్నాహాలు కొనసాగుతుండగా, గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
BDK: భద్రాద్రి శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఇవాళ నుంచి శ్రీరామనవమి తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 2 వరకు సాగే ఈ వేడుకల్లో భాగంగా 27న మహోన్నతమైన తిరుకళ్యాణ, 28న శ్రీరామ పట్టాభిషేకం నిర్వహించనున్నారు. ఉగాది పురస్కరించుకుని ప్రత్యేక పూజలు, రక్షాబంధనం నిర్వహించనున్నారు. సాయంత్రం అంకురార్పణతో ఉత్సవాలకు శ్రీకారం చుడతారు.