• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

‘కుల దురహంకారం నశించాలి.. న్యాయం జరగాలి’

RR: కుమ్మెర జాతరలో అగ్రవర్ణాల దాడికి బలైపోయిన చిన్నారి మృతికి నిరసనగా BC సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ధర్నా కార్యక్రమంలో SDNR పట్టణానికి చెందిన జాతీయ BC జనసేన అధ్యక్షులు చంద్రశేఖరప్ప, నియోజకవర్గ అధ్యక్షురాలు జలజ, తదితరులు పాల్గొని నిరసన తెలిపారు. వారు మాట్లాడుతూ.. ఈ కుల దురహంకారం నశించాలని, చిన్నారి తల్లిదండ్రులకు న్యాయం జరగాలని కోరారు.

February 24, 2026 / 06:42 PM IST

‘బాధితులకు తక్షణమే డబ్బులు చెల్లించి ఆదుకోవాలి’

HNK: ప్రైవేట్ చిట్ ఫండ్లో డబ్బులు పెట్టి ఇబ్బంది పడుతున్న బాధితులకు తక్షణమే డబ్బులు చెల్లించి వారిని ఆదుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి గాదె ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని నేడు రిజిస్టార్‌కు ప్రభాకర్ రెడ్డి అందించారు. ప్రైవేట్ చిట్టీల ద్వారా సేకరించిన ప్రజాధనాన్ని కాజేసిన వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు.

February 24, 2026 / 06:41 PM IST

‘ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలి’

MHBD: తొర్రూరు మండలంలోని గోపాలగిరి గ్రామంలో ఉపాధి హామీ కూలీలకు కల్పిస్తున్న వసతులను ఇవాళ తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఎండీ. యాకూబ్ అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీరాంజీ చట్టాన్ని రద్దు చేసి, ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని అన్నారు. కూలీలకు రోజు వేతనం రూ. 600 ఇవ్వాలని డిమాండ్ చేశారు.

February 24, 2026 / 06:38 PM IST

నగర పారిశుద్ధ్యంపై మున్సిపల్ కమిషనర్ ప్రత్యేక దృష్టి

KMM: ఖమ్మం నగరపాలక సంస్థ కమిషనర్ అభిషేక్ ఆగస్త్య ఆదేశాల మేరకు నగరంలో పారిశుద్ధ్యం పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ముఖ్యంగా రాపర్తి నగర్ నుంచి ఎన్టీఆర్ సర్కిల్, ఇల్లందు రోడ్డు నుంచి ఆపిల్ సర్కిల్ వరకు జటాయు వాహనాల ద్వారా వ్యర్థాలను తొలగిస్తున్నారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచి ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించడమే లక్షమని కమిషనర్ తెలిపారు.

February 24, 2026 / 06:38 PM IST

‘రైతులు నూతన సాంకేతికతను అందిపుచ్చుకోవాలి’

NLG: రైతులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని సాగులో నైపుణ్యాన్ని పెంచుకోవాలని శాసన మండలి ఛైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. నూతన యాంత్రిక పరికరాలను ఉపయోగించి వ్యవసాయాన్ని సరళీకృతం చేసుకోవాలని సూచించారు. చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామ శివారులోని తన వ్యవసాయ క్షేత్రంలో మంగళవారం ఎలక్ట్రిక్ ట్రాక్టర్, ఇతర వ్యవసాయ పరికరాలను ప్రారంభించారు.

February 24, 2026 / 06:38 PM IST

ఆసుపత్రి పనులను పరిశీలించిన మాజీ మంత్రి

WGL: నగరంలో నిర్మాణంలో ఉన్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని మాజీ మంత్రి హరీష్ రావు ఇవాళ పరిశీలించారు. ఆసుపత్రి నిర్మాణ ప్రాంతాన్ని సందర్శించి పనుల పురోగతిని అధికారులు వద్ద నుంచి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం నిర్మాణ పనులు చేపట్టడంలో విఫలమైందని విమర్శించారు. ప్రభుత్వం స్పందించి ఆసుపత్రి త్వరగా ప్రారంభించి ప్రజలకు న్యాయం చేయాలని కోరారు.

February 24, 2026 / 06:38 PM IST

డ్రంక్ అండ్ డ్రైవ్.. ఐదు రోజులు జైలు శిక్ష

NZB: బోధన్‌లోని గాంధీనగర్ కాలనీకి చెందిన షేక్ షబ్బీర్ మద్యం తాగి వాహనం నడుపుతుండగా పోలీసులు పట్టుకున్నారు. అనంతరం అతన్ని స్పెషల్ జ్యూడిషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ శేష తల్ప సాయి ఎదుట హాజరు పరిచారు. ఆయనకు ఐదు రోజుల జైలు శిక్ష విధించినట్లు పట్టణ సీఐ వెంకటనారాయణ తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

February 24, 2026 / 06:37 PM IST

ఘన్‌పూర్లో ఘనంగా సేవాలాల్ జయంతి

JN: స్టేషన్ ఘన్‌పూర్లో శ్రీ సంత్ సేవాలాల్ 287వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎంపీ కడియం కావ్య వేడుకలకు హాజరయ్యారు. బంజారా సమాజానికి మార్గదర్శిగా నిలిచిన శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జీవితం త్యాగం, సేవ, సమానత్వానికి ప్రతీక అని, బంజారా గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించేందుకు కృషి చేద్దామన్నారు.

February 24, 2026 / 06:36 PM IST

అన్ని విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే

BDK:మణుగూరు మండలంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో ఈరోజు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో అన్ని విభాగాల ఇంజనీరింగ్ అధికారులతో సమగ్ర రివ్యూ సమావేశం నిర్వహించారు.ఏడు మండలాలకు చెందిన అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి, ప్రతి శాఖలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని ఎమ్మెల్యే సమీక్షించారు.ప్రతి శాఖ అధికారి తమ పనులను త్వరగా పూర్తి చేసుకోవాలన్నారు.

February 24, 2026 / 06:36 PM IST

‘ఇంటర్ పరీక్షలకు 16 సెంటర్లు ఏర్పాటు’

JN: జిల్లాలో రేపటి నుంచి జరిగే ఇంటర్ వార్షిక పరీక్షలకు 16 సెంటర్లు ఏర్పాటు చేశామని కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ తెలిపారు. రేపటి నుంచి మార్చి 16వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయని, జిల్లాలో 8,605 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థుల కోసం కంట్రోల్ రూమ్ నంబర్ 9550371371 ఏర్పాటు చేశామన్నారు.

February 24, 2026 / 06:36 PM IST

‘తమ ఆస్తులను పిల్లల పేరిట చేయకూడదు’

SRCL: సీనియర్ సిటిజన్లు ఎవరు కూడా తమ ఆస్తులను, పిల్లల పేరిట చేయకూడదని, వేములవాడ ఆర్డీవో రాధా సూచించారు. వేములవాడ ఆర్డీవో కార్యాలయంలో మంగళవారం సీనియర్ సిటిజన్ గొంతుక పిలుపు పత్రికను ఆమె ఆవిష్కరించారు. సీనియర్ సిటిజన్లు ఆస్తులను పిల్లలకు చేసిన, ఒకవేళ వారికి సరిపోను ఉంచుకుని చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజన్‌లు పాల్గొన్నారు.

February 24, 2026 / 06:34 PM IST

యూరియా నిల్వలను పరీశీలించిన డీఏవో

KNR: రామడుగు మండల కేంద్రంలోని ఫర్టిలైజర్ షాపులలో ఉన్నటువంటి యూరియా నిల్వలను మంగళవారం జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతులు ఫర్టిలైజర్ యాప్ ద్వారా యూరియా బుక్ చేసుకోవాలని సూచించారు. యూరియా కోసం రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. యాసంగి పంటలకు సరిపడా యూరియా ఉందని సూచించారు.

February 24, 2026 / 06:33 PM IST

’43వ డివిజన్లో రీ పోలింగ్ నిర్వహించాలి’

PDPL: రామగుండం కార్పొరేషన్ 43వ డివిజన్లో రీ పోలింగ్ నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షను మంగళవారం కలెక్టరేట్‌లో కలిసి ఫిర్యాదు చేసినట్లు రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తెలిపారు. ఎన్నికలలో జరిగిన అవకతవకలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. 43వ డివిజన్లో కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ నాయకులను బెదిరింపులకు గురిచేశారని అన్నారు.

February 24, 2026 / 06:33 PM IST

ఈనెల 26న వాహనాల వేలం

ఆదిలాబాద్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో వివిధ కేసుల్లో పట్టుబడిన వాహనాలను ఈనెల 26న వేలం వేయనున్నట్లు ఎక్సైజ్ సీఐ విజేందర్ తెలిపారు. ఈ వేలంలో 15 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటోతో పాటు ఇతర వాహనాలు ఉండనున్నాయి. ఆసక్తి గలవారు ప్రభుత్వ నిర్దేశిత ధరావతు సొమ్మును చెల్లించి బహిరంగ వేలం పాటలో పాల్గొనవచ్చని ఆయన వెల్లడించారు.

February 24, 2026 / 06:33 PM IST

ప్లాస్టిక్ రహిత మున్సిపాలిటీకి సహకరించండి: MP

SRD: నూతన కౌన్సిలర్లు ప్లాస్టిక్ నిషేధం అమలుకు కృషి చేయాలని మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు సూచించారు. మంగళవారం ఇంద్రేశం మున్సిపాలిటీలో తొలి మున్సిపల్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెదక్ ఎంపీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్లాస్టిక్ రహిత మున్సిపాలిటీ లక్ష్యంగా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.

February 24, 2026 / 06:31 PM IST