• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

సమస్యను పరిష్కరించిన కౌన్సిలర్

SRPT: సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డు వస్త్రం తండాలో పేరుకుపోయిన పారిశుధ్య సమస్యలను స్థానిక కౌన్సిలర్ విజయ పరిష్కరించారు. వార్డులో చెత్తాచెదారం, మురికి కాలువల్లో పూడిక కారణంగా దోమల బెడద ఎక్కువగా ఉందని ప్రజలు ఆమె దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన కౌన్సిలర్, ఇవ్వాళ సఫాయి సిబ్బందితో కలిసి దగ్గరుండి కాలువలను సాఫ్ చేయించారు.

February 26, 2026 / 01:30 PM IST

ఛైర్‌పర్సన్‌గా సమీండ్ల వాణి బాధ్యతల స్వీకారం

జగిత్యాల మున్సిపాలిటీ నూతన ఛైర్‌పర్సన్‌గా సమీండ్ల వాణి శ్రీనివాస్ మున్సిపల్ కార్యాలయంలో పదవి బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్‌ఛైర్మన్ జీనత్ పర్వీన్ మున్నా, మాజీ ఛైర్మన్ గిరి నాగభూషణం, కౌన్సిలర్లు, అధికారులు, పట్టణ నాయకులు పాల్గొన్నారు.

February 26, 2026 / 01:29 PM IST

రేపు దిశ కమిటీ సమావేశం

KMM: కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై సమీక్షించే జిల్లా అభివృద్ధి, సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశం శుక్రవారం ఖమ్మం కలెక్టరేట్లో ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకు జరగనుంది. ఈ సమావేశానికి అధికారులు పూర్తి సమాచారంతో హాజరుకావాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు.

February 26, 2026 / 01:29 PM IST

7 పాలిటెక్నిక్ కళాశాలల్లో 1,980 సీట్లు, కొత్త కోర్సు

BHPL: ఉమ్మడి జిల్లాలోని 7 పాలిటెక్నిక్ కళాశాలల్లో మొత్తం 1,980 సీట్లు అందుబాటులో ఉన్నాయి. కాటారం పాలిటెక్నిక్‌లో ఈ ఏడాది నుంచి ‘డిప్లమా ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్’ కొత్త కోర్సు ప్రారంభమవుతుందని ప్రిన్సిపల్ రాజ్ కుమార్ తెలిపారు. పాలిసెట్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది, ఏప్రిల్ 20 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. మే 13న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.

February 26, 2026 / 01:28 PM IST

కామారెడ్డి జిల్లాలో 145 మంది గైర్హాజరు

KMR: జిల్లావ్యాప్తంగా నేడు ఇంటర్ ద్వితీయ సంవత్సర వార్షిక పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మొత్తం 7,878 మంది విద్యార్థులకు గాను 7,733 మంది హాజరయ్యారని జిల్లా ఇంటర్ నోడల్ ఆఫీసర్ షేక్ సలాం తెలిపారు. జిల్లాలో 98.16% హాజరు నమోదైనట్లు వెల్లడించారు. పరీక్షా కేంద్రాల వద్ద అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేయడంతో విద్యార్థులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా రాశారు.

February 26, 2026 / 01:28 PM IST

కళ్యాణ లక్ష్మీ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

ADB: నెరడిగొండ మండల కేంద్రంలోని రైతు వేధికలో ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి, షాదిముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరై మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన 30 మంది లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దేశంలోనే ఎక్కడ లేని విధంగా పేదింటి బిడ్డకు ఆసరాగా నిలుస్తుందన్నారు.

February 26, 2026 / 01:27 PM IST

వీర సావర్కర్ వర్థంతి కార్యక్రమం

NRPT: వీర సావర్కర్ వర్థంతి సందర్భంగా గురువారం మక్తల్ మున్సిపాలిటీ కేంద్రంలోని వీర సావర్కర్ చౌరస్తా వద్ద విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ కమిటీ ఆధ్వర్యంలో సావర్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కమిటీ సభ్యులు హిందుత్వం, దేశం, సమాజం కోసం ఆయన చేసిన కృషిని కొనియాడారు.

February 26, 2026 / 01:27 PM IST

బ్రిడ్జి నిర్మించాలని ఎమ్మెల్యే కుంభంకు వినతిపత్రం

BHNG: ధర్మారెడ్డిపల్లి గ్రామస్థులు తమ సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. గ్రామంలోని కాలువలపై బ్రిడ్జి లేకపోవడం వల్ల ప్రయాణికులు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు వివరించారు. వెంటనే బ్రిడ్జి నిర్మించి తమ ప్రయాణ కష్టాలను తీర్చాలని కోరారు.

February 26, 2026 / 01:25 PM IST

తాగునీటి సమస్యకు ముందస్తు చర్యలు

GDWL: పట్టణంలోని 28వ వార్డు ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యను దృష్టిలో ఉంచుకుని వార్డు కౌన్సిలర్ చంద్రశేఖర్ ముందడుగు వేశారు. వేసవిలో నీటి కొరత పెరుగుతుందన్న అంచనాతో పాత బోర్వేర్లను మరమ్మతులు చేసి తిరిగి వినియోగంలోకి తీసుకురావడానికి చర్యలు చేపట్టారు. పనిచేయకుండా ఉన్న బోర్లను పరిశీలించి అవసరమైన మరమ్మతులు చేపడుతున్నారు.

February 26, 2026 / 01:22 PM IST

పరీక్షా కేంద్రాల బందోబస్తును పరిశీలించిన జిల్లా ఎస్పీ

MBNR: మహబూబ్‌నగర్‌లో జరుగుతున్న ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం పరీక్షల సందర్భంగా ప్రభుత్వ బాలుర కళాశాల పరీక్ష కేంద్రాన్ని ఎస్పీ డి. జానకి సందర్శించారు. పోలీసు బందోబస్తు, భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ చర్యలను పరిశీలించి పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కేంద్రం పరిసరాల్లో 144 సెక్షన్ అమలులో ఉందన్నారు.

February 26, 2026 / 01:21 PM IST

తాగునీటి ఎద్దడికి ముందస్తు చర్యలు చేపట్టాలి: కలెక్టర్

NGKL: రాబోయే వేసవి కాలంలో నాగర్‌కర్నూల్ జిల్లాలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ముందస్తు చర్యలు చేపట్టాలని గురువారం జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆదేశించారు. గ్రామ, పట్టణ స్థాయిలలో నీటి పంపులు, పైపులైన్ల మరమ్మతులు, పారిశుధ్య పనులు సకాలంలో పూర్తి చేసి, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆయన అధికారులకు సూచించారు.

February 26, 2026 / 01:20 PM IST

మణిగిళ్ల పాఠశాలలో అభివృద్ధి కార్యక్రమాలు

WNP: మణిగిళ్ల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించడానికి సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. విద్యార్థుల కార్యక్రమాల నిర్వహణ కోసం వేదిక (స్టేజ్) నిర్మాణం, బాలికల ఆరోగ్యం, భద్రతను దృష్టిలో ఉంచుకుని టాయిలెట్ నిర్మాణం వంటి పనులు చేపట్టారు.

February 26, 2026 / 01:18 PM IST

పరీక్షలో ముగ్గురు విద్యార్థులు డిబార్

WGL: పర్వతగిరి మండల కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో గురువారం నిర్వహించిన ఇంటర్ సెకండియర్ తెలుగు పరీక్షలో ముగ్గురు విద్యార్థులు డిబార్ అయ్యారు అని డిఐఈఓ శ్రీధర్ సుమన్ తెలిపారు. మోడల్ స్కూల్ సెంటర్లో 177 మంది విద్యార్థుల్లో 174 మంది హాజరు అయ్యారు. ఒక్కో సెంటర్లో ముగ్గురు విద్యార్థులు డిబార్ అయ్యారు.

February 26, 2026 / 01:18 PM IST

‘పాలిటెక్నిక్ కళాశాల నిర్మాణానికి సహకరించండి’

SRD: పటాన్‌చెరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, హాస్టల్ భవనాల నిర్మాణాలకు సీఎస్ఆర్ నిధులు కేటాయించి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని తోషిబా యాజమాన్యాన్ని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. గురువారం ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రుద్రారంలోని తోషిబా పరిశ్రమ ప్రతినిధులతో ఎమ్మెల్యే సమావేశమయ్యారు. నియోజకవర్గ అభివృద్ధి పనులకు పరిశ్రమ సహకారం కోరారు.

February 26, 2026 / 01:16 PM IST

ఆర్మూర్​ బల్దియా పాలకవర్గం బాధ్యతల స్వీకరణ

NZB: ఆర్మూర్​ మున్సిపల్ పాలకవర్గం గురువారం కొలువుదీరింది. మున్సిపల్ ఛైర్​పర్సన్‌గా గోనె లహరి, వైస్ ఛైర్మన్​గా కాటిపల్లి వెంకటరెడ్డితో పాటు కౌన్సిలర్లు బాధ్యతలు స్వీకరించారు. మున్సిపల్ కమిషనర్ ఉమామహేశ్వరరావు ఛైర్​పర్సన్​, వైస్ ఛైర్మన్​లతో సంతకాలు చేయించారు. ఈ కార్యక్రమంలో మినరల్స్ రాష్ట్ర ఛైర్మన్ ఈరవత్రి అనిల్, పాల్గొన్నారు.

February 26, 2026 / 01:16 PM IST