జగిత్యాల మున్సిపాలిటీ నూతన ఛైర్‌పర్సన్‌గా సమీండ్ల వాణి శ్రీనివాస్ మున్సిపల్ కార్యాలయంలో పదవి బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్‌ఛైర్మన్ జీనత్ పర్వీన్ మున్నా, మాజీ ఛైర్మన్ గిరి నాగభూషణం, కౌన్సిలర్లు, అధికారులు, పట్టణ నాయకులు పాల్గొన్నారు.