VKB: పరిగి పట్టణంలోని సుగుణ స్టీల్ ఫ్యాక్టరీ సమీపంలో గంజాయి విక్రయాలకు ప్రయత్నిస్తున్న ఇద్దరు యువకులను ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నితీశ్ రఝాక్(22), సూరజ్ కుమార్(22) వద్ద నుంచి సుమారు 1.50 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. బీహార్ నుంచి తెచ్చి కార్మికులకు విక్రయిస్తున్నారనే సమాచారంతో దాడి నిర్వహించి కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
SRPT: TG పోలీసులు చేపట్టిన ‘ఆపరేషన్ క్రాక్‌డౌన్’లో భాగంగా సూర్యాపేట జిల్లాలోని 4 బ్యాంక్ బ్రాంచ్‌లలో 298 అనుమానాస్పద మ్యూల్ ఖాతాలను గుర్తించారు. రాష్ట్రవ్యాప్తంగా 16 జిల్లాల్లో 137 బ్రాంచ్‌లపై సైబర్ సెక్యూరిటీ బ్యూరో దాడులు నిర్వహించింది. సరైన వెరిఫికేషన్ లేకపోవడంతో నేరగాళ్లు ఈ ఖాతాల ద్వారా సైబర్ దందాలకు పాల్పడుతున్నారని అధికారులు తెలిపారు.
ADB: గుడిహత్నూర్ మండలం కొల్హారిలో బంజారా సమాజ్ నిర్వహించిన భోగ్ బండార్ కార్యక్రమానికి బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జగదాంబ దేవి, సంత్ సేవాలాల్ మహరాజ్ చిత్రపటాలకు పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. బంజారా సంస్కృతిని కాపాడుకోవాలని, యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని ఆయన సూచించారు.
రంగారెడ్డి జిల్లా శంకరపల్లిలో హృదయవిదారక సంఘటన చోటు చేసుకుంది. అనారోగ్యంతో తల్లి కల్పన(35) మంగళవారం రాత్రి మరణించింది. తెల్లారి బుధవారం ఇంటర్ పరీక్షలు ప్రారంభం కావడంతో, తన భవిష్యత్తు కోసం మనో ధైర్యంతో కుమారుడు రవితేజ పరీక్షను రాసి అందరిని కలిచివేశాడు. తల్లి మృతదేహం ఇంట్లోనే ఉండగా పరీక్షకు వెళ్లి, అనంతరం తల్లి అంతక్రియలకు హాజరయ్యాడు.
HNK: కాజీపేట పట్టణ కేంద్రంలోని విష్ణుపురి కాలనీలో బుధవారం రాత్రి టాస్క్ ఫోర్స్, ఫుడ్ సేఫ్టీ అధికారులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో కల్తీ ఐస్‌క్రీమ్‌తో పాటు గడువు తీరిన 12 రకాల రూ. 60,400 విలువ గల ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలు పాటించని షాపు యజమానిని అదుపులోకి తీసుకున్నట్లు టాస్క్ ఫోర్స్ ACP మధుసూదన్ తెలిపారు.
BDK: శ్రీరామ నవమి సందర్భంగా జరిగే కళ్యాణ తలంబ్రాల కోసం భక్తులు రూ.4 లక్షల విరాళాన్ని అందించారు. హైదరాబాద్ వాస్తవ్యులు ముప్పాల భవాని ప్రసాద్, యుగంధర్ రూ.4 లక్షలను విరాళంగా భద్రాచలం దేవస్థాన ప్రాంగణంలో అందజేశారు. ఈ విరాళాన్ని భక్తిశ్రద్ధలతో భద్రాచలం దేవస్థానం ఈవో దామోదర్‌కి అందజేశారు. అనంతరం రామయ్యను దర్శించుకున్నారు.
KMM: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా పౌరసరఫరాల శాఖ నిఘా పెంచింది. నెలకు రెండుసార్లు గోదాములు, దుకాణాల్లో తనిఖీలు చేయనున్నారు. బియ్యం దళారులకు విక్రయించే డీలర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు డీలర్ షిప్ రద్దు చేస్తామని అధికారులు హెచ్చరించారు.
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ బుధవారం రాత్రి ఒక వ్యక్తి మద్యం తాగి చల్ సృష్టించాడు. వివరాల్లోకి వెళితే గుర్తు తెలియని వ్యక్తి తన ద్విచక్ర వాహనంపై వేగంగా వెళుతూ కిందపడ్డాడు. అతన్ని లేపి సపర్యలు చేస్తున్న స్థానిక ప్రజలు విచక్షణ కోల్పోయి ఇష్టానుసారంగా దుర్భాషలాడుతుండడంతో స్థానికులు ట్రాఫిక్ పోలీసులను పిలిపించి అప్పగించారు.
HYD: GHMC, CMC, MMC ప్రాంతాల్లో నూతన ఓటర్ల ప్రక్రియ జోరుగా సాగుతుంది. ఒక్కో నియోజకవర్గంలో కేవలం 3 నెలల్లోనే సుమారు 2500 పైగా నూతన ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. మీరు మీ చేతిలోని ఫోన్ ద్వారా సైతం ఓటరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. Voter help line యాప్ డౌన్‌లోడ్ చేసుకుని, ఫామ్ నెంబర్-6 ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని రిటర్నింగ్ ఆఫీసర్లు తెలిపారు.
SRCL: వేములవాడ అర్బన్ మండలం కొడుముంజ గ్రామంలో జరుగుతున్న శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి సిద్ధోగంలో బుధవారం రాత్రి ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, సమృద్ధిగా వర్షాలు కురిసి పాడి పంటలు బాగుండాలని, ఎల్లమ్మ తల్లిని వేడుకున్నట్టు తెలిపారు.
KMR: జిల్లా IDOC సమావేశ మందిరంలో బుధవారం సాయంత్రం కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆధ్వర్యంలో మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్, PMAY-U, అమృత్ పనుల పురోగతి, ఆస్తి పన్ను వసూళ్లు, విపత్తు నిర్వహణ చర్యలపై చర్చించారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని తాగునీటి కార్యాచరణ ప్రణాళిక, శానిటేషన్, ప్లాంటేషన్, తొలగింపుపై నిర్లక్ష్యం వద్దని హెచ్చరించారు.
PDPL: మీ ప్రవచనం వినడం ఎంతో ఆనందం కలిగించిందని, ఎందుకు తాను ఎంతో సంతోషిస్తున్నానని మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు అన్నారు. బుధవారం స్థానిక శ్రీ అయ్యప్ప స్వామి ఆలయం శ్రీ మణికంఠ ప్రాంగణంలో నిర్వహించిన గరికపాటి నరసింహారావు ప్రవచనం కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ముక్కు సూటిగా మాట్లాడే తత్వం కలిగిన గరికపాటి ప్రవచనం చెప్పేవారు ఈ దేశంలో మరి ఎవరు లేరని అన్నారు.
SDPT: చౌదర్‌పల్లి గ్రామంలోని ప్రసిద్ధ శ్రీ పార్వతీ దుబ్బరాజేశ్వర స్వామి ఆలయ ప్రధానార్చకులు, వంశపారంపర్య ధర్మకర్త, ఆధ్యాత్మిక సేవకుడు దుబ్బరాజం పంతులు బుధవారం రాత్రి మృతి చెందారు. ఆయన మరణవార్తతో గ్రామంలో విషాదం నెలకొంది. ఎన్నో దశాబ్దాలుగా ఆలయ సేవలో నిమగ్నమై భక్తులకు ఆధ్యాత్మిక మార్గదర్శకుడిగా నిలిచిన దుబ్బరాజాం పంతులు భక్తి,సేవాభావానికి ప్రతీకగా నిలిచారు.
WNP: జిల్లాలోని కీర్యా తండాకు చెందిన గణేశ్ నాయక్(21) అన్నారం తండాకు చెందిన వసంత(18) కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. HYDలో గణేష్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. వసంత బాసర ట్రిపుల్ ఐటీలో చదువుతుంది. ఇటీవల వసంతను వివాహం చేసుకోవాలని కోరగా ఆమె నిరాకరించింది. దీంతో మనస్తాపం చెందిన గణేష్ ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీంతో భయాందోళనతో ఆమె సూసైడ్ చేసుకుంది.
NRML: ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ జానకి షర్మిల గ్రీవెన్స్ నిర్వహించారు. ఇందులో షీ టీం కీలక పాత్ర పోషించింది. కుటుంబ వివాదాలతో వచ్చిన వారికి షీ టీం సిబ్బంది ప్రత్యేక కౌన్సిలింగ్ ఇచ్చి విడిపోయిన వారిని తిరిగి కలిపారు. కౌన్సిలింగ్ కోసం నిర్మల్ వరకు వెళ్లే భారం తప్పించి భైంసాలోనే ఈ సదుపాయం కల్పించడం పట్ల బాధితులు ఎస్పీకి కృతజ్ఞతలు తెలిపారు.