• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

సాదా బైనామా వెంటనే అమలు చేయాలి: బీజేపీ వినతి

WGL: నర్సంపేట డివిజన్ పరిధిలో రైతులు దరఖాస్తు చేసుకున్న సాదా బైనామా దరఖాస్తులను పరిశీలించి వెంటనే అమలు చేయాలని కోరుతూ ఇవాళ ఆర్డీవో ఉషారాణికి BJP పార్టీ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా BJP జిల్లా కార్యదర్శి డా. రానా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ.. సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న సాదా బైనమా దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలని కోరారు.

February 24, 2026 / 07:20 PM IST

అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ పట్టివేత

NZB: కమ్మర్పల్లి మండలం కోనాపూర్ అటవీ ప్రాంతం నుంచి చౌట్పల్లి గ్రామానికి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్‌ను అధికారులు పట్టుకున్నారు. వాసంగట్టు తండాకు చెందిన లకావత్ రాజేందర్‌ను మంగళవారం డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస్, బీట్ ఆఫీసర్లు ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకున్నారు. అధికారులు అతనిపై కేసు నమోదు చేశారు.

February 24, 2026 / 07:20 PM IST

‘పిప్రి లిఫ్ట్ ఇరిగేషన్‌కు రూ. 77 కోట్ల నిధుల మంజూరు’

NRML: లోకేశ్వరం మండలం పిప్రి గ్రామం లిఫ్ట్ ఇరిగేషన్‌కు రూ. 77 కోట్ల నిధులు మంజూరైనట్లు ముధోల్ MLA రామారావు తెలిపారు. ఈ లిఫ్ట్ ద్వారా పిప్రీ, నగర్, రాయపూర్ కాండ్లీతో పాటు పలు గ్రామాల రైతులకు సాగునీరు అందుతుందన్నారు. గత పాలకుల నిర్లక్ష వైఖరి మూలంగా రైతులకు అన్యాయం జరిగిందన్నారు. వచ్చే జూన్ వరకు ఈ లిప్ ద్వారా 5 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు.

February 24, 2026 / 07:19 PM IST

‘మొక్కజొన్న రైతులకు ఎకరాకు రూ.40 వేలు చెల్లించాలి’

KMM: అకాల వర్షాలు, ఈదురుగాలుల వల్ల దెబ్బతిన్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని తిర్లాపురం సర్పంచ్ వీరబాబు డిమాండ్ చేశారు. సోమవారం కురిసిన వర్షానికి మండలంలోని మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయని తెలిపారు. ప్రభుత్వం స్పందించి క్షేత్రస్థాయిలో నష్టాన్ని అంచనా వేయాలని, బాధిత రైతులకు ఎకరాకు రూ. 40వేల చొప్పున పరిహారం అందించి ఆదుకోవాలని ఆయన కోరారు.

February 24, 2026 / 07:17 PM IST

‘MLA కోవ లక్ష్మీపై అక్రమ కేసును ఎత్తి వేయాలి’

ఆసిఫాబాద్ MLA కోవ లక్ష్మీపై పెట్టిన అక్రమ కేసును ఎత్తివేయాలని BRS జిల్లా నాయకులు సరస్వతీ డిమాండ్ చేశారు. మంగళవారం వారు మాట్లాడుతూ.. క్యాతన్ పల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక జరగకుండా మంత్రి వివేక్ BRS నాయకులు సుమన్, MLA కోవ లక్ష్మీలపై తప్పుడు కేసులు పెట్టీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారన్నారు. ప్రజలు తీర్పును ప్రభుత్వం శిరసావహించి ఎన్నిక నిర్వహించాలన్నారు.

February 24, 2026 / 07:16 PM IST

కీసర చుట్టూర ప్రాంతాల్లో పెరిగిన ఉక్కపోత..!

MDCL: కీసర చుట్టూర ప్రాంతాల్లో ఉక్కపోత తీవ్రంగా పెరిగింది. రెండు రోజులుగా ఉదయం నుంచే ఎండ తీవ్రత అధికమవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గాలిలో తేమ శాతం తగ్గడంతో వేడి మరింత పెరిగినట్టుగా అనిపిస్తోంది. బయటకు వెళ్లే వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఎక్కువగా నీరు తాగడం, తేలికపాటి దుస్తులు ధరించడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

February 24, 2026 / 07:07 PM IST

క్రీడా మహోత్సవ పోస్టర్ ఆవిష్కరణ

SDPT: నరేంద్ర మోడీ ప్రేరణతో నిర్వహిస్తున్న 2025-26 సంసద్ క్రీడా మహోత్సవం సందర్భంగా హుస్నాబాద్‌లో పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. కోహెడ మండల బీజేపీ అధ్యక్షుడు జాలిగం రమేష్ మాట్లాడుతూ.. మార్చి 1-3 వరకు అసెంబ్లీ, 5-7 వరకు పార్లమెంట్ స్థాయి పోటీలు జరుగుతాయని తెలిపారు. కబడ్డీ, వాలీబాల్, హాకీ, ఖోఖో, అథ్లెటిక్స్ పోటీల్లో విజేతలకు ఎంపీ బండి సంజయ్ బహుమతులు అందజేస్తారన్నారు.

February 24, 2026 / 07:05 PM IST

100 రోజుల యాక్షన్ ప్లాన్ అమలు చేయాలి: వీసీ

MBNR: పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యార్థుల నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి రూపొందించిన 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను ప్రతి కళాశాలలో తప్పనిసరిగా అమలు చేయాలని PU వీసీ ఆచార్య జి.ఎన్. శ్రీనివాస్ ఆదేశించారు. విద్యా ప్రమాణాల పెంపు, ఉపాధి అవకాశాల విస్తరణ దిశగా కళాశాలలు కృషి చేయాలని ఆయన సూచించారు.

February 24, 2026 / 07:05 PM IST

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన సీపీఐ నేతలు

కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం కొండపల్కల గ్రామానికి చెందిన సీపీఐ సీనియర్ నేత శ్రీరాముల రామచంద్రం ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ గ్రామానికి వెళ్లి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొన్నారు.

February 24, 2026 / 07:04 PM IST

పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్

ADB: ఇంటర్మీడియట్, పదవ తరగతి పరీక్షలను ఎటువంటి లోటుపాట్లు లేకుండా నిర్వహించాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. పదవ తరగతి పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో కలిసి, అన్ని జిల్లాల కలెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు శ్యామలాదేవి, రాజేశ్వర్, ఆర్డీవో రత్నకళ్యాణి, తదితరులు ఉన్నారు.

February 24, 2026 / 07:04 PM IST

పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్

VKB: ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో కొన్ని ఆదేశాలు అమల్లో ఉంటాయని కుల్కచర్ల ఎస్సై రమేశ్ కుమార్ తెలిపారు. పరీక్షల కాలంలో పరీక్షా కేంద్రాల వద్ద Cr PC సెక్షన్ 144 అమల్లో ఉంటుందని చెప్పారు. గుంపులుగా చేరడం, శాంతి భద్రతలకు భంగం కలిగించే చర్యలు పూర్తిగా నిషేధమని పేర్కొన్నారు.

February 24, 2026 / 07:02 PM IST

యూనియన్ అధ్యక్షునిగా మాణిక్యం

SRD: కంది సమీపంలోని ఐఐటీ హైదరాబాద్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షునిగా మాణిక్యం మంగళవారం ఎన్నికయ్యారు. ఆయన మాట్లాడుతూ.. ఐఐటీ వర్కర్లకు కనీస వేతనం నెలకు రూ. 26,000 అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. భూములు కోల్పోయిన రైతులకు పర్మినెంట్ ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన ఇప్పటివరకు అమలు చేయలేదని విమర్శించారు.

February 24, 2026 / 07:01 PM IST

పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. విద్యుత్తు డిమాండ్..!

HYDలో ఉష్ణోగ్రతల 33 డిగ్రీలకుపైగా నమోదు అవుతున్న వేళ విద్యుత్ డిమాండ్ రోజురోజుకు పెరుగుతుంది. ఈ నేపథ్యంలో రంగారెడ్డి పరిధిలో 965, మేడ్చల్ 626, హైదరాబాద్ మెట్రో జోన్ ప్రాంతాల్లో 297 DTRలు ఏర్పాటు చేస్తున్నట్లుగా డిస్కం అధికారులు తెలిపారు. HYDలో 3500 మెగావాట్లకు పైగా విద్యుత్ డిమాండ్ రికార్డు అవుతుంది.

February 24, 2026 / 07:01 PM IST

‘కుటుంబానికి కొండంత అండ రైతు బీమా’

GDWL: గుండెపోటుతో ఇంటి యజమానిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న రైతు కుటుంబానికి ఈ ఐదు లక్షల ఆర్థిక సాయం భవిష్యత్తుపై భరోసానిస్తుంది అని గట్టు మాజీ ఎంపీపీ జె. విజయ్ కుమార్ అన్నారు. గట్టు మండలం ముచ్చోనిపల్లి గ్రామానికి శారదమ్మకు మంగళవారం ఎంపీడీవో కార్యాలయంలో రైతు బీమా చెక్కును అందజేశారు. ఈ సొమ్మును వృథా చేయకుండా పిల్లల చదువులకు వాడాలన్నారు.

February 24, 2026 / 07:01 PM IST

స్కాలర్ షిప్‌కు ఆరుగురు విద్యార్థుల ఎంపిక

MDK: తూప్రాన్ పట్టణ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలకు చెందిన ఆరుగురు విద్యార్థులు నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ (NMMS)కు ఎంపికైనట్లు ఇంఛార్జ్ ప్రధానోపాధ్యాయులు ప్రభాకర్ తెలిపారు. ఇది పాఠశాలలో అమలు చేస్తున్న సమర్థవంతమైన బోధన విధానాలకు నిదర్శనమని మండల విద్యాధికారి డాక్టర్ పర్వతి సత్యనారాయణ పేర్కొన్నారు. అనంతరం విద్యార్థులను అభినందించారు.

February 24, 2026 / 07:01 PM IST