• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

ఓల్డ్ సిటీలో వేడుకగా కామ దహనం

నల్గొండ పాతబస్తీలోని షేర్ బంగ్లా ప్రాంతంలో కాముని దహన కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. స్థానిక సంతోషి మాత ఆలయం వద్ద ఏర్పాటు చేసిన ఈ వేడుకకు భక్తులు భారీగా తరలివచ్చారు. సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించిన అనంతరం అగ్నిని వెలిగించి కామదహనం చేశారు. రంగుల పండుగకు ముందు నిర్వహించే ఈ వేడుకలో యువత, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని సందడి చేశారు.

March 3, 2026 / 08:01 AM IST

రేపు సంగారెడ్డిలో సదరం శిబిరం

సంగారెడ్డి జిల్లా ఆసుపత్రిలో మార్చి నెలకు సంబంధించిన సదరం శిబిరాల షెడ్యూల్ను ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మురళీకృష్ణ విడుదల చేశారు. మార్చి 4, 11, 18, 25 తేదీల్లో ఈ శిబిరాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. దివ్యాంగులు ముందుగానే స్లాట్ బుక్ చేసుకోవాలని సూచించారు. శిబిరానికి వచ్చే వారు స్లాట్ బుకింగ్ మెసేజ్, ఆధార్ కార్డు తీసుకుని రావాలి అన్నారు.

March 3, 2026 / 08:01 AM IST

అంగరంగ వైభవంగా లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మహోత్సవం

SRPT: మునగాల మండలం రేపాల గ్రామంలోని లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు భాగంగా మంగళవారం తెల్లవారుజామున లక్ష్మీనరసింహస్వామి కళ్యాణాన్ని పూజారులు శాస్త్ర పాయంగా నిర్వహించారు. భక్తులు స్వామివారి కల్యాణాన్ని కన్నుల పండగ వీక్షించారు. అనంత భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కళ్యాణ మహోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

March 3, 2026 / 08:01 AM IST

హోలీ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

WGL: నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మంగళవారం తన నివాసంలో కార్యకర్తల సమక్షంలో హోలీ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కార్యకర్తలకు, ప్రజలకు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. రంగుల పండుగ ఆనందాన్ని పంచుకుంటూ అందరూ సోదరభావంతో, ఐక్యతతో జీవించాలని జీవించాలని ప్రజలు కోరారు. ఈ కార్యక్రమంలో అశోక్, హరి, సురేష్, తదితరులు పాల్గొన్నారు.

March 3, 2026 / 07:43 AM IST

ఇక HYD నుంచి అమరావతికి గంటన్నర ప్రయాణమే!

HYD: ‘ఫ్యూచర్ సిటీ’ నుంచి ఏపీ రాజధాని అమరావతి మధ్య ప్రతిపాదిత గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వేకు సమాంతరంగా సెమీ బుల్లెట్ ట్రైన్ రానుంది. గంటకు 250 కి.మీ. వేగంతో ప్రయాణించే ఈ రైలు ద్వారా HYD నుంచి అమరావతికి కేవలం గంటన్నరలోనే చేరుకోవచ్చు. తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనతో మిర్యాలగూడ మీదుగా సాగే ఈ కారిడార్‌ను చెన్నై వరకు పొడిగిస్తే 3 గంటల్లోనే వెళ్లొచ్చు.

March 3, 2026 / 07:42 AM IST

‘పుష్కర ఏర్పాట్లు ప్రణాళిక బద్ధంగా ఏర్పాటు చేయాలి’

PDPL: 2027 గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై ప్రతిపాదనలు సమగ్రంగా సిద్ధం చేయాలని పెద్దపల్లి కలెక్టర్ శ్రీ హర్ష అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సీపీ అంబర్ కిషోర్ ఝాతో కలిసి నిర్వహించిన సమీక్షలో, ఘాట్ నిర్మాణం,రోడ్డు విస్తరణ,లైటింగ్, పార్కింగ్, ఆలయాల అభివృద్ధి వంటి పనులపై తక్షణ ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. గోలివాడ, మంథని పలుప్రాంతాల్లో ప్రత్యక చర్యలు చేపట్టాలన్నారు.

March 3, 2026 / 07:42 AM IST

KUలో పార్ట్ టైం పోస్టుల దరఖాస్తులకు రేపే లాస్ట్

HNK: కేయూలోని వివిధ విభాగాలలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి పార్ట్ టైం బోధనా సిబ్బంది నియామక దరఖాస్తు గడువు రేపటితో ముగుస్తుందని రిజిస్ట్రార్ ఆచార్య వి. రామచంద్రం తెలిపారు. ఫిబ్రవరి 28తో ముగియాల్సిన గడువును అభ్యర్థుల అభ్యర్థన మేరకు మార్చి 4 వరకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. అర్హత గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.

March 3, 2026 / 07:37 AM IST

ఎల్లమ్మ గుడి దొంగతనం కేసులో నిందితుడి అరెస్ట్

ASF: కాగజ్ నగర్‌లోని రేణుక ఎల్లమ్మ గుడిలో ఇటీవల జరిగిన దొంగతనం కేసులో నిందితుడిని అరెస్టు చేసినట్లు DSP వహిదొద్దిన్ తెలిపారు. దర్యాప్తులో భాగంగా నిందితుడు మానుపాటి నరేష్‌ను మణికొండ గ్రామంలో అదుపులోకి తీసుకున్నామన్నారు. అతడి వద్ద నుంచి అమ్మవారి బొట్టు బిళ్ల, సుమారు 10 గ్రాముల బంగారు ఆభరణాలు,1,250 గ్రాముల రెండు వెండి కిరీటాలను స్వాధీనం చేసుకున్నామన్నారు.

March 3, 2026 / 07:36 AM IST

పట్టణాన్ని పరిశుభ్ర పట్టణంగా మార్చాలి: ఎమ్మెల్యే

BDK: ఇల్లందు మున్సిపాలిటీ కౌన్సిలర్లతో ఎమ్మెల్యే కోరం కనకయ్య నిన్న సమావేశం నిర్వహించారు. త్వరితగతిన వార్డులలో ప్రధాన సమస్యలు డ్రైనేజ్,వీధి ధిపాలు, త్రాగు నీరు, విధ్యుత్ స్ధంభాలు వంటి తదితర సమస్యలకు తక్షణ పరిష్కారం చూపాలని పాలకవర్గానికి ఎమ్మెల్యే ఆదేశించారు. పట్టణాన్ని పరిశుభ్రత పట్టణంగా కౌన్సిలర్లు పనిచేయాలన్నారు.

March 3, 2026 / 07:35 AM IST

ఉచిత నైపుణ్య శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

MDK: హవేలిఘనపూర్ ప్రభుత్వ ఐటీఐలోని అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్ (ATC)లో ఉచిత నైపుణ్య శిక్షణ, ఉద్యోగ అవకాశాలు ఉన్నట్లు ప్రిన్సిపాల్ గుమ్మకొండ శ్రీనివాసులు తెలిపారు. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన (PMKVY) కింద పదో తరగతి ఉత్తీర్ణులు, ఇంటర్, డిగ్రీ మధ్యలో ఆపేసిన నిరుద్యోగులకు అధునాతన సాంకేతిక కోర్సుల్లో శిక్షణ ఇస్తామన్నారు.

March 3, 2026 / 07:34 AM IST

సమస్యల పరిష్కారం కొరకు కృషి

SRCL: బోయినపల్లి మండలం స్తంభంపల్లి గ్రామంలో గత కొన్నేళ్లుగా మూతపడి ఉన్న వాటర్ ప్లాంట్‌ను తిరిగి ప్రారంభించారు. గ్రామంలో నీటి సరఫరాకు సంబంధించిన గేట్ వాల్స్, పైపు లీకేజీలు, హ్యాండ్ బోర్లనుకూడా మరమ్మతులు చేశారు. ఈ చర్యలతో గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బొంగాని అశోక్ గౌడ్, మాజీ ఎంపిటిసి అక్కనపల్లి ఉపేందర్, పాల్గొన్నారు.

March 3, 2026 / 07:34 AM IST

కలెక్టర్ ముందు అక్కాచెల్లెళ్ల ఆవేదన..!

NRML: ఆరేళ్లుగా కార్యాలయాల చుట్టూ ఐసీడీఎస్ అధికారి తిప్పించుకుంటున్నారని ఇద్దరు అనాథ అక్కాచెల్లెళ్లు కలెక్టర్ ఎదుట కన్నీరుమున్నీరయ్యారు. సుమారు 600 సార్లు తిరిగినా అనాథ సర్టిఫికెట్ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం కలెక్టర్ ముందే సదరు అధికారి మళ్లీ వినతిపత్రం తీసుకోవడంపై మండిపడ్డారు.

March 3, 2026 / 07:32 AM IST

దళితబంధు నిధులు విడుదల చేయాలని కలెక్టర్‌కు వినతి

KNR: దళిత బంధు రెండో విడత నిధులు విడుదల చేయాలని కరీంనగర్ ప్రజావాణిలో హుజూరాబాద్ నియోజకవర్గం దళిత బంధు సాధన సమితి వినతిపత్రం అందజేశారు. స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ కారణంగా నిలిపివేసిన దళితబంధు పథకం గ్రౌండింగ్ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని కోరారు. 5,200 లబ్ధిదారుల్లో కేవలం 1,200 మందికే మంజూరు చేశారని, మిగిలిన కుటుంబాలకు రెండవ విడత నిధులు విడుదల చేయాలన్నారు.

March 3, 2026 / 07:29 AM IST

‘పార్వతమ్మగూడెం పాఠశాలకు మినీ వ్యాన్ బహుకరణ’

MHBD: నెల్లికుదురు మండలంలోని పార్వతమ్మగూడెం ప్రాథమికొన్నత పాఠశాలలో చదువుకునేందుకు దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థుల సౌకర్యార్ధం కోసం హనుమాన్ నగర్ తండాకు చెందిన దాత భూక్యా వెంకన్న మినీ వ్యాన్‌ను సోమవారం ఎంఈవో రాందాస్, హెచ్ఎం నరేందర్ ఆధ్వర్యంలో పాఠశాలకు అందజేశారు. ఈ సందర్భంగా వెంకన్నను అభినందించారు.

March 3, 2026 / 07:28 AM IST

హోలీ వేడుకలపై ఎస్పీ కీలక సూచనలు

NGKL: నాగర్ కర్నూల్ జిల్లాలో హోలీ పండుగను శాంతియుతంగా జరుపుకోవాలని ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ కోరారు. రసాయన రంగులు కాకుండా సహజ సిద్ధమైన రంగులు వాడాలని, చెరువులు, బావుల వద్ద ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించకుండా పండుగ జరుపుకోవాలని ఎస్పీ తెలిపారు.

March 3, 2026 / 07:27 AM IST