• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

జిల్లాలో కేజీ చికెన్ ధర ఎంతంటే !

సూర్యాపేట జిల్లాలో చికెన్ ధరలు ఆదివారం ఈ విధంగా ఉన్నాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో స్కిన్ చికెన్ కేజీ ధర రూ. 200 నుంచి రూ.220 మధ్య ఉండగా, స్కిన్‌లెస్ చికెన్ కేజీ ధర రూ. 250 నుంచి రూ.280 వరకు పలుకుతోంది. గత వారంతో పోలిస్తే రూ. 10 వరకు తగ్గింది.

March 1, 2026 / 07:05 AM IST

ఈనెల 3న ఈ ఆలయంలో దర్శనాలు బంద్

HYD: ఈనెల 3వ తేదీన చంద్ర గ్రహణం సందర్భంగా శంషాబాద్ మండల పరిధిలోని ముచ్చింతల్ శివారులో గల సమతాస్ఫూర్తి కేంద్రంలో మార్చి 3న దర్శనాలు నిలిపేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 4న మధ్యాహ్నం 3 గంటల నుంచి దర్శనాలు ప్రారంభమవుతాయని, భక్తులు గమనించి సహకరించాలని వారు కోరారు.

March 1, 2026 / 07:03 AM IST

భర్తను సుత్తితో కొట్టి చంపిన భార్య

యాదాద్రి జిల్లా గుండాల మండల కేంద్రానికి చెందిన మాదరబోయిన బిక్షం(64) భార్య ఉపేంద్ర గత కొంతకాలంగా జీవిస్తున్న దంపతులు మధ్య పదేపదే గొడవలు జరుగుతున్నాయి. ఎన్నిసార్లు సర్ది చెప్పినా వినకుండా తాగి రావడంతో విసిగిపోయిన భార్య అర్ధరాత్రి ఇంట్లో నిద్రిస్తున్న బిక్షంని సుత్తితో బలంగా తలపైన కొట్టి చంపింది. ఈఘటనతో గుండాలలో విషాదఛాయలు అలుముకున్నాయి.

March 1, 2026 / 07:02 AM IST

జిల్లా ప్రజలు నిబంధనలు పాటించాలి

నిజామాబాద్ జిల్లా ప్రజలకు సీపీ సాయిచైతన్య కీలక సూచనలు చేశారు. ప్రజలకు అసౌకర్యం కలిగించే ప్రాంతాల్లో విగ్రహ ప్రతిష్ఠలు నిషేధించినట్లు చెప్పారు. రాత్రి 10 గం.ల నుంచి ఉదయం 6 గం.ల వరకు డీజేలు వాడకూడదన్నారు. భారీ సభలకు, డ్రోన్ల వినియోగానికి ముందస్తు అనుమతి తీసుకోవాలన్నారు. ఈ నిబంధనలు మార్చి 1 నుంచి 15వ తేదీ వరకు అమలులో ఉంటాయన్నారు.

March 1, 2026 / 07:01 AM IST

పుష్పయాగంలో పాల్గొన్న పోచారం

KMR: బీర్కూర్ మండలం తిమ్మాపూర్ శివారులోని తెలంగాణ తిరుమల దేవస్థానంలో కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు శనివారంతో ముగిశాయి. శనివారం రాత్రి ముగింపు సందర్భంగా పుష్ప యాగ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి దంపతుల, ఆలయ ధర్మకర్త దంపతులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

March 1, 2026 / 07:01 AM IST

గంజాయి విక్రేతలను పట్టుకోవాలి: CP

WGL: వరంగల్ పట్టణ కేంద్రంలో శనివారం CP సన్ ప్రీత్ సింగ్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా CP మాట్లాడుతూ.. WGL కమిషనరేట్ పరిధిలో గంజాయి విక్రేతలను పట్టుకోవాలని అధికారులకు ఆదేశించారు. నగర శివారు ప్రాంతాల్లో నిరంతర నిఘా ఉంచాలని, ఎంజీఎం ఆసుపత్రి, రైల్వే స్టేషన్ పరిసరాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. వాహనాల తనిఖీలు పెంచాలన్నారు.

March 1, 2026 / 06:59 AM IST

మిస్సింగ్ కేసు పై ప్రత్యేక దృష్టి సారించాలి: SP

BHPL: జిల్లా కేంద్రంలోని SP కార్యాలయంలో శనివారం జిల్లా SP సంకీర్త్ గౌడ్ ఆధ్వర్యంలో నెలవారి నేర సమీక్ష నిర్వహించారు. SP మాట్లాడుతూ.. జిల్లాలో లాంగ్ పెండింగ్ కేసుల ఛేదనకు ప్రత్యేక ప్లాన్ ఆఫ్ యాక్షన్ సిద్ధం చేసి అమలు చేయాలని SP ఆదేశించారు. మిస్సింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించి పురోగతి సాధించాలని, సీసీ కెమెరాల వ్యవస్థను మరింత బలోపేతం చేయాలన్నారు.

March 1, 2026 / 06:56 AM IST

ఫిర్యాదుల పరిష్కారంలో ఆలస్యం జరిగితే చర్యలు: కమిషనర్

HYD: దీర్ఘకాలంగా ఆస్తి పన్ను బకాయిలపై ఊరటనిస్తూ వన్‌టైమ్ సెటిల్ మెంట్ పథకాన్ని ప్రభుత్వం ప్రకటించిందని జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ అన్నారు. పీటీపీ ద్వారా అందే ఫిర్యాదుల పరిష్కారంలో ఆలస్యం జరిగితే సంబంధిత అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని, పాత బకాయిలపై పేరుకుపోయిన వడ్డీలో ఏకంగా 90 శాతం రాయితీ కల్పిస్తున్నట్లు వెల్లడించారు.

March 1, 2026 / 06:50 AM IST

‘ఎలక్ట్రిక్ పాటర్ వీల్స్ పంపిణీ చేసిన కేంద్ర మంత్రి’

KRN: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నిన్న HYDలో జాతీయ ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్ ఛైర్మన్ మనోజ్ కుమార్‌తో కలిసి చేతివృత్తుల పని వాళ్లకు ఆధునిక పనిముట్లు అందజేశారు. ఇందులో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కుమ్మరులకు ఎలక్ట్రిక్ పాటర్ వీల్స్ అందజేశారు. గ్రామీణ చేతి వృత్తులను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం తోడ్పడుతుందని వారు తెలిపారు.

March 1, 2026 / 06:46 AM IST

ఆర్టీసీ ఉద్యోగుల సేవలు ప్రశంసనీయం: డిప్యూటీ ఆర్ఎం

WNP: ఆర్టీసీ సంస్థ అభివృద్ధి కోసం పాటుపడి పదవి విరమణ పొందుతున్న ఉద్యోగుల సేవలు ప్రశంసనీయమని టీజీ ఎస్ఆర్‌టీసీ రీజినల్ డిప్యూటీ ఆర్ ఎం కవిత అన్నారు. వనపర్తి ఆర్టీసీ డిపోలో మెకానికల్, కండక్టర్, డ్రైవర్ విభాగాలలో నలుగురు ఉద్యోగులు రహీమ్, వివి మూర్తి, నీలయ్య, రాములు పదవీ విరమణ పొందిన సందర్భంగా డిపో ఆవరణలో ఘనంగా సన్మానించారు.

March 1, 2026 / 06:43 AM IST

జనగామ పాల ఉత్పత్తిదారులకు శుభవార్త..!

JN: విజయా డెయిరీ ద్వారా సేకరించే పాల కొనుగోలు ధరలను త్వరలోనే పెంచనున్నట్లు తెలంగాణ పాడి పరిశ్రమాభివృద్ధి సమాఖ్య ఛైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి వెల్లడించారు. HYDలో జరిగిన సమావేశంలో జనగామ డిప్యూటీ డైరెక్టర్ గోపాల్ సింగ్‌తో కలిసి ఆయన ఈ వివరాలు వెల్లడించారు. మార్చి బడ్జెట్‌లో పాడి పశువుల కొనుగోలుకు సబ్సిడీ రుణాలు మంజూరు చేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామన్నారు.

March 1, 2026 / 06:41 AM IST

డిప్యూటేషన్‌పై కలెక్టరెట్‌కు బదిలీ అయిన MRO

MNCL: హాజీపూర్ తహశీల్దార్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న దేశ్ పాండే శ్రీనివాస్‌కు కలెక్టరేట్ సూపరింటెండెంట్ -C సెక్షన్ కు బదిలీ చేస్తూ జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఉత్తర్వులు జారీ చేశారు. హాజీపూర్ తహశీల్దార్‌గా కలెక్టరేట్ సి సెక్షన్‌లో డిప్యూటేషన్‌పై పని చేస్తున్న వేమనపల్లి MRO పుష్పలతకు బాధ్యతలు అప్పగిస్తూ కలెక్టర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

March 1, 2026 / 06:40 AM IST

నాటి ‘చితిలాపురం’… నేటి ‘చిట్యాల’

NLG: చిట్యాల మున్సిపాలిటీకి ఘనమైన చరిత్ర ఉంది. కాకతీయుల కాలంలో దీనిని ‘చిత్తాల సంగ్యపురం’ అని పిలిచేవారు. స్మశాన వాటికల వల్ల ‘చితిలాపురం’గా మారి, కాలక్రమేణా చిట్యాలగా స్థిరపడిందని భావిస్తున్నారు. 1984లో రైల్వే పనుల్లో లభించిన శిలాశాసనం ప్రకారం.. క్రీ.శ. 1257లో బెంగాల్ నుంచి వలస వచ్చిన కాయస్థ రాజులు ఈ ప్రాంతాన్ని పాలించినట్లు ఆధారాలు ఉన్నాయి.

March 1, 2026 / 06:34 AM IST

శ్రీవారి ఆలయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్

VKB: కొడంగల్ పట్టణంలోని శ్రీమహాలక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ సమగ్ర మాస్టర్ ప్లాన్ రూపొందించినట్లు ధర్మకర్తలు తెలిపారు. 6 ఎకరాల్లో చేపట్టే పునర్నిర్మాణ పనుల్లో గర్భాలయం, గోదాదేవి, లక్ష్మీదేవి, భూవరహస్వామి, బేడి ఆంజనేయస్వామి ఆలయాలు, మహా మండపం, కోనేరు, ఉంజాల్, సహస్రదీపాలంకరణ సేవ మండపం, కళ్యాణకట్ట, భోజనశాల, పార్కింగ్, వసతి గృహాలు, షాపులు ఏర్పాటు చేయనున్నారు.

March 1, 2026 / 06:33 AM IST

నవమి వేడుకలకు పక్కాగా ఏర్పాట్లు చేయాలి : కలెక్టర్

BDK: భద్రాచలంలో మార్చి 27, 28 తేదీల్లో జరగనున్న శ్రీరామనవమి కళ్యాణం మహా పట్టాభిషేక ఉత్సవాలకు పక్కా ప్రణాళికతో ఏర్పాట్లు పూర్తి చేయాలని భద్రాద్రి కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. శనివారం నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.

March 1, 2026 / 06:32 AM IST