NLG: చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్రామ సర్పంచ్ ఆవుల సుందర్ యాదవ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే వేముల వీరేశం ఆయనతో కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. శాలువాతో సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కాటం వెంకటేశం, గ్రామ కాంగ్రెస్ నేతలు, సామాజిక సేవాకర్త దశరథ, తదితరులు పాల్గొన్నారు.
SDPT: కొమురవెల్లి రైల్వే స్టేషన్ ప్రారంభానికి ముహూర్తం ఖరారవుతోంది. ఎంపీ రఘునందన్ రావు ఇటీవల దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ కుమార్‌ను కలిసి, పనులు పూర్తయిన స్టేషను వెంటనే అందుబాటులోకి తేవాలని కోరారు. దసరాకే ప్రారంభం కావాల్సి ఉన్నా, ఎన్నికల కోడ్ కారణంగా వాయిదా పడింది. ఎంపీ చొరవతో కదలిక రావడంతో ఈ నెలలోనే స్టేషన్ ప్రారంభం కానున్నట్లు సమాచారం.
SRPT: కోదాడ పట్టణంలోని మెయిన్ రోడ్డుపై పశువులు యధేచ్ఛగా తిరుగుతూ వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. ఖమ్మం క్రాస్ రోడ్ నుంచి రంగా థియేటర్ చౌరస్తా వరకు ఉదయం, రాత్రి వేళల్లో రహదారిపై పశువులు అడ్డదిడ్డంగా సంచరిస్తున్నాయి. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి రోడ్లపై పశువుల సంచారాన్ని నివారించేలా చర్యలు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు.
RR: చేవెళ్ల పరిధి మల్కాపూర్‌లోని శ్రీ భువనేశ్వరి సహిత మల్లికార్జున స్వామి దేవాలయాన్ని మరింత వైభవంగా తీర్చేదిద్దెందుకు దాతల సహకారం అవసరమని దేవాలయ కమిటీ సభ్యులు తెలిపారు. కళ్యాణ మండపం, కోనేరు నిర్మాణం,హోమగుండం ఏర్పాటు, రాజగోపురం నిర్మాణం చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఈ పుణ్యకార్యంలో దాతలు భాగస్వామ్యం కావాలని, తమవంతు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
WNP: వేసవి కాలంలో పలువురు ఇళ్లకు తాళాలు వేసి వెళ్తారు. ఇంటి యజమానులు తప్పకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి అని జిల్లా ఎస్పీ సునీత రెడ్డి తెలిపారు. ఎప్పుడూ ఇంటి పరిసరాలను చరవాణుల్లో ప్రత్యక్షంగా చూడొచ్చన్నారు. కాలనీల్లో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి సూచించారు. పోలీస్ కంట్రోల్ రూంకు అందిస్తే నేరుగా నిఘాను తాము చూసే అవకాశం ఉంటుందన్నారు.
MLG: బీఆర్ఎస్ నాయకుడు కాకులమర్రి లక్ష్మణ్ బాబు ఆదేశాల మేరకు ఏటూరు నాగారం చెందిన మృతి చెందిన కార్యకర్త జగదంపుల పూలమ్మ కుటుంబానికి కాళ్ల రామకృష్ణ ఆర్థిక సాయం అందజేశారు. కుటుంబాన్ని పరామర్శించి చిత్రపటానికి నివాళులర్పించి, జిల్లా అధ్యక్షుల తరఫున ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
MBNR: జడ్చర్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈరోజు ఉదయం 11 గంటలకు మీడియా సమావేశం నిర్వహించనున్నట్లు టీపీసీసీ కో-ఆర్డినేటర్ ధారాభాస్కర్ తెలిపారు. రెండు రోజుల క్రితం నవాబుపేట పోలీస్ స్టేషన్‌లో తనపై కేసు నమోదైందన్నారు. అక్రమాలను అడ్డుకున్నందుకే తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు. సమావేశాన్ని పోలీసులు అనుమతిస్తారా లేదా అన్నది ఆసక్తిగా మారింది.
NLG: రాష్ట్రంలో ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ఈ నెల 6వ తేదీ నుంచి జూన్ 12వ తేదీ వరకు నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో, హైదరాబాద్లోని సచివాలయంలో మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివిధ జిల్లాల కలెక్టర్లతో సమావేశమయ్యారు. ఈ సదస్సులో నల్లగొండ కలెక్టర్ బి. చంద్రశేఖర్ కూడా పాల్గొన్నారు.
NRPT: ప్రశాంత వాతావరణంలో హోలీ పండుగను జరుపుకోవాలని మరికల్ సీఐ భగవంతు రెడ్డి యువకులకు సూచించారు. బుధవారం హోలీ పండుగను పురస్కరించుకుని యువకులతో కలిసి హోలీ ఆడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా యువకులు కలిసి మెలిసి హోలీ పండుగను నిర్వహించుకోవడం అభినందనీయమన్నారు. మరికల్ పోలీస్ స్టేషన్లో సీఐ, ఎస్సైలకు యువకులు రంగులు వేసి హోలీ ఆడారు.
MDK: నిజాంపేట మండలం వెంకటాపూర్ తండాకు చెందిన కవిత అనే గర్భిణికి పురిటినొప్పులు రావడంతో, 108 అంబులెన్స్‌లో సిద్దిపేట ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే నొప్పులు అధికమయ్యాయి. 108 ఈఎంటీ స్వామి అప్రమత్తమై అంబులెన్స్‌లో చాకచక్యంగా ప్రసవం చేయగా, ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారు.
MDK: నిజాంపేట మండలం వెంకటాపూర్ తండాకు చెందిన కవిత అనే గర్భిణికి పురిటినొప్పులు రావడంతో, 108 అంబులెన్స్‌లో సిద్దిపేట ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే నొప్పులు అధికమయ్యాయి. 108 ఈఎంటీ స్వామి అప్రమత్తమై అంబులెన్స్‌లో చాకచక్యంగా ప్రసవం చేయగా, ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారు.
HNK: నడికూడ మండలం కంఠాత్మకూరు గ్రామంలో కొనసాగుతున్న ఉపాధి హామీ పనులను ఎంపీడీవో రామకృష్ణ బుధవారం పరిశీలించారు. గ్రామస్తులతో మాట్లాడి పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. పనులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించిన ఆయన, పని ప్రదేశాల్లో అవసరమైన సదుపాయాలు కల్పించాలని ఈజీఎస్ సిబ్బందికి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు పాల్గొన్నారు.
WGL: చంద్రగ్రహణం అనంతరం ఓరుగల్లు అధిదేవత భద్రకాళి అమ్మవారి దర్శనాలు బుధవారం పునఃప్రారంభమయ్యాయి. తెల్లవారుజామునే ఆలయ ద్వారాలు తెరిచిన అర్చకులు.. ఆలయ శుద్ధి, సంప్రోక్షణ కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం అమ్మవారికి పంచామృతాలతో అభిషేకాలు, అలంకరణలు జరిపారు. గ్రహణం వీడటంతో పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చారు.
ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో కేంద్రం ప్రవేశపెట్టిన ఈ-నామ్ 2.0 వెర్షన్ అందుబాటులోకి వచ్చింది. పంట నాణ్యత తనిఖీకి ఏఐ (AI) సాంకేతికతను వాడుతున్నారు. బిడ్డింగ్ ధర తూకం కమీషన్ వివరాలు నేరుగా రైతు ఫోన్‌కు మెసేజ్ వస్తాయి. దీనివల్ల పారదర్శకత పెరగడమే కాకుండా రైతులు తమ ఉత్పత్తులను దేశంలో ఎక్కడైనా అమ్ముకునే వీలుంటుందని మార్కెట్ అధికారులు వెల్లడించారు.
కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం జంగంపల్లి శివారులోని తెలంగాణ విశ్వవిద్యాలయం సౌత్ క్యాంపస్ వసతిగృహంలో అర్ధరాత్రి విద్యార్థుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.హోలీ సంబరాల అనంతరం సీనియర్, జూనియర్ విద్యార్థులు రెండు గ్రూపులుగా విడిపోయి పరస్పరం దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం.