• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

అధ్వానంగా మారిన రహదారి

NRPT: మక్తల్-మంథన్ గోడ్ రహదారి అధ్వానంగా మారింది. సోమవారం రాత్రి కురిసిన వర్షం వల్ల గొల్లపల్లి సమీపంలో రోడ్డుపై భారీ నీరు చేరి చెరువును తలపిస్తోంది. గుంతలతో బురద ఏర్పడిన రోడ్డుపై వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామస్థులు అధికారులు వెంటనే రోడ్డు మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.

February 24, 2026 / 04:45 PM IST

ఎమ్మెల్యేను కలిసిన యాదవ సంఘం నాయకులు

PDPL: పెద్దపల్లి మండలం బోజన్నపేట గ్రామానికి చెందిన యాదవ సంఘం నాయకులు మంగళవారం ఎమ్మెల్యే విజయరమణారావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు యాదవ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరగా,ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి రూ.10 లక్షలు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కట్టుబడి ఉందని ఆయన పేర్కన్నారు.

February 24, 2026 / 04:44 PM IST

లక్ష్మణ్ రాథోడ్​కు ఇండియన్ బెస్ట్ ఇన్​స్పిరేషన్​ అవార్డ్

KMR: విద్యార్థులకు, క్రీడాకారులకు ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూ.. వారి ఉన్నతికి విశేష కృషి చేస్తున్న జడ్పీహెచ్​ఎస్​ పేట్​సంగం పీఈటీ, బామన్​ నాయక్​ స్పోర్ట్స్​ ఫౌండేషన్​ వ్యవస్థాపకుడు లక్ష్మణ్​రాథోడ్​కు ఇండియన్​ బెస్ట్​ ఇన్​స్పిరేషన్ అవార్డు వరించింది. న్యూఢిల్లీకి చెందిన గ్యాన్ ఉదయ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం అవార్డును ఆయనకు అందజేసింది.

February 24, 2026 / 04:40 PM IST

పాఠశాలలో లాంగ్వేజ్ టీచర్ల కాంప్లెక్స్ సమావేశం

NZB: భీంగల్ మండలం పల్లికొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉన్నత పాఠశాలల లాంగ్వేజెస్ ఉపాధ్యాయుల కాంప్లెక్స్ సమావేశం మంగళవారం ప్రారంభమైంది. ఐ.సీ.టీ టూల్స్, డిజిటల్ టూల్స్, IFP బోర్డు, దీక్ష ఆప్ మొదలైన వాటిని పాఠశాలలో ఏ విధంగా ఉపయోగిస్తునరన్న ఆంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాల లాంగ్వేజెస్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

February 24, 2026 / 04:40 PM IST

కేంద్ర మంత్రిని కలిసిన కౌన్సిలర్ కొండ వర్షిణి-నరేష్

సిరిసిల్ల పట్టణంలోని 33వ వార్డు కౌన్సిలర్ కొండ వర్షిణి-నరేష్ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్‌ను ఇవాళ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు ఎంపీ బండి సంజయ్‌ను శాలువుతో ఘనంగా సన్మానించారు. కౌన్సిలర్‌గా గెలుపొందడం సంతోషంగా ఉందని ఎంపీ అభినందిచారు. ప్రజలకు నిరంతరం తోడు ఉంటూ.. వార్డు అభివృద్ధికి కృషి చేయాలని కేంద్ర మంత్రి తెలిపారు.

February 24, 2026 / 04:38 PM IST

‘పిల్లల బంగారు భవిష్యత్తును కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత’

HNK: పిల్లల బంగారు భవిష్యత్తును కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని, బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలపై ప్రజల్లో విస్తృత అవగాహన అవసరమని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు. బాల్య వివాహ విముక్తి అవగాహన ప్రచార రథాన్ని నేడు హన్మకొండలో ఎంపీ ప్రారంభించారు. బాల్య వివాహాలు బాలికల విద్య, ఆరోగ్యం, మానసిక వికాసంపై ప్రతికూల ప్రభావం చూపుతాయని అన్నారు.

February 24, 2026 / 04:37 PM IST

గెలుపును జీర్ణించుకోలేక అక్రమ అరెస్టులు

MLG: చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టుపై ములుగు జిల్లా బీఆర్ఎస్ దళిత నాయకుడు చిట్టిమల్ల సమ్మయ్య తీవ్రంగా స్పందించారు. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించకుండా గెలుపును జీర్ణించుకోలేక నిర్బంధాలకు పాల్పడటం హేయమని అన్నారు. కుళ్ళు రాజకీయాలకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. నిమ్మగడ్డ ప్రవీణ్, కర్రీ శ్రీను, బియ్యం శ్రీను, బోడ ప్రసాద్, పాల్గొన్నారు.

February 24, 2026 / 04:35 PM IST

తెలంగాణ ఉద్యమకారుని జలజకు ఘన నివాళులు

MHBD: జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్థూపం వద్ద మంగళవారం తెలంగాణ మలి విడత ఉద్యమకారిణి, రచయిత్రి జలజకు కళాకారులు ఘనంగా నివాళులర్పించారు. జలజ చిత్రపటానికి డీ పీ ఆర్ ఓ రాజేంద్రప్రసాద్ పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై జిల్లా మేనేజర్ కృష్ణవేణి, కళాకారులు పాల్గొన్నారు.

February 24, 2026 / 04:34 PM IST

పాఠశాలను సందర్శించిన అదనపు కలెక్టర్

MBNR: హన్వాడ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయాన్ని అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యా బోధన, సదుపాయాలు, నిర్వహణ తదితర అంశాలను సమగ్రంగా పరిశీలించారు. అనంతరం SSC విద్యార్థులతో మాట్లాడి వారి చదువు, లక్ష్యాలు, భవిష్యత్ ప్రణాళికల గురించి ఆరా తీశారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదివి మంచి ఫలితాలు సాధించాలని సూచించారు.

February 24, 2026 / 04:33 PM IST

‘కులం పేరుతో విమర్శిస్తే సహించేది లేదు’

SDPT: కులం పేరుతో రాజకీయం చేస్తూ MP రఘునందన్ రావును విమర్శిస్తే ఊరుకునేది లేదని బీసీ కుల సంఘాల ఐక్యవేదిక సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు నీల స్వామి ముదిరాజ్, రాయపోల్ బీజేపీ మండల అధ్యక్షుడు మంకిడి స్వామి హెచ్చరించారు. మంగళవారం వారు మాట్లాడుతూ.. కులం పేరుతో రాజకీయం చేస్తున్న నీలం మధు చరిత్ర ప్రజలందరికీ తెలుసని ధ్వజమెత్తారు.

February 24, 2026 / 04:32 PM IST

హైదరాబాద్‌కు తరలిన టీఎంయూ నాయకులు

KNR: ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరుతూ జేఏసీ పిలుపునిచ్చిన ‘ఛలో సచివాలయం’ కార్యక్రమానికి కరీంనగర్ రీజియన్ టీఎంయూ నాయకులు భారీగా తరలివెళ్లారు. టీజీఆర్టీసీని ప్రైవేటుపరం చేసే కుట్రలను ఆపాలని, కార్మికులందరినీ ప్రభుత్వంలో విలీనం చేయాలని వారు డిమాండ్ చేశారు.

February 24, 2026 / 04:32 PM IST

‘జిల్లాలో తాగునీటి ఎద్దడి రావొద్దు’

వేసవిని దృష్టిలో పెట్టుకుని మున్సిపాలిటీ ప్రజలు ఎక్కడ కూడా తాగునీటి ఎద్దడి రాకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని ఛైర్ పర్సన్ మాధవి రమేష్ అధికారులను ఆదేశించారు. వనపర్తి జిల్లాలోని 33వ వార్డులో నూతన బోరు మోటర్ బిగించి వార్డు వాసులకు భరోసా కల్పించారు. బోరు మోటర్ నుంచి అంతర్గత పైప్‌లైన్‌లో బిగించి ప్రతి ఇంటికి తాగునీరు అందేలా చూడాలన్నారు.

February 24, 2026 / 04:30 PM IST

మాజీ ఎంపీపీని పరామర్శించిన ఎమ్మెల్యే

MDK: నార్సింగి మండలం వల్లూర్‌లో మాజీ ఎంపీపీ చిందం సబిత కుటుంబాన్ని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మంగళవారం పరామర్శించారు. గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకురాలు, మాజీ ఎంపీపీ చిందం సబిత భర్త రవీందర్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మరణించారు. ఈ విషాద ఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఎమ్మెల్యే వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.

February 24, 2026 / 04:30 PM IST

‘విద్యార్థులు తరగతులకు తప్పనిసరిగా హాజరుకావాలి’

JGL: పదవ తరగతి విద్యార్థులు తరగతులకు తప్పకుండా హాజరుకావాలని మండల విద్యాధికారి శ్రీపతి రాఘవులు అన్నారు. రాయికల్ మండలంలోని అల్లీపూర్ పాఠశాలలో మంగళవారం 10వ తరగతి ప్రీ ఫైనల్ పరీక్షలు రాస్తున్న పరీక్ష కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థులు పరీక్ష సమయంలో ఎలాంటి ఒత్తిడికి గురి కావద్దని, పరీక్షలకు హాజరయ్యేంత వరకు తరగతులకు తప్పకుండా హాజరు కావాలని సూచించారు.

February 24, 2026 / 04:28 PM IST

ప్రతి ఇంటికి తాగునీరు సరఫరా చేసే లక్ష్యంతో పనిచేయాలి: మంత్రి

MLG: ఎర్రమంజిలోని మిషన్ భగీరథ కార్యాలయంలో, గ్రామీణ మంచినీటి సరఫరా, వేసవి సన్నద్ధతపై మంత్రి సీతక్క రివ్యూ నిర్వహించారు. ప్రతి ఇంటికి తాగునీరు సరఫరా చేసే లక్ష్యంతో మిషన్ భగీరథ సిబ్బంది పని చేయాలని, కేంద్ర ప్రభుత్వం ప్రజల తాగునీటి అవసరాలను తీర్చేలా నిధులు మంజూరు చేయాలని మంత్రి కోరారు.

February 24, 2026 / 04:26 PM IST