ADB: ఉట్నూర్ మండలం కల్లూర్ గూడలో భీంరావు, సుగుణల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహానికి నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు, ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ హాజరయ్యారు. ఈ సందర్బంగా నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో జైనూర్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ విశ్వనాథ్, ఇంద్రవెల్లి మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ మారుతి తదితరులు పాల్గొన్నారు.
KNR: శాతవాహన విశ్వవిద్యాలయ పరిధిలో పీజీ, ఎంబీఏ, ఎంసీఏ మొదటి సెమిస్టర్ పరీక్షలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం కరీంనగర్లోని వివేకానంద డిగ్రీ & పీజీ కళాశాల పరీక్షా కేంద్రాన్ని విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఆచార్య యు. సతీష్ కుమార్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పరీక్షలు నడుస్తున్న తీరును పరిశీలించారు.
BDK: నూతన జిల్లా కలెక్టర్‌గా అంకిత్ గురువారం సాయంత్రం ఐడీవోసి కార్యాలయంలోని తన ఛాంబర్‌లో తొలి సంతకం చేసి అధికారికంగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా తెలంగాణ సదర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ సంస్థ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ జితేష్ వి. పాటిల్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) డి. వేణుగోపాల్ శుభాకాంక్షలు తెలిపారు.
NRPT: మక్తల్ మండల పరిధిలో మంతన్ గోడ గ్రామ జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో గురువారం ఉదయం ఘనంగా స్వపరిపాలన దినోత్సవం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కలెక్టర్ జి.కావేరి, అడిషనల్ కలెక్టర్ డి.అనూష, డీఈవో కే.జ్యోతి, డిప్యుటీ డిఈవో సి.శిరీష, ఏంఈఓ కే.నరేష్ ప్రధాన ఉపాధ్యాయులు md.అబ్దుల్ ఖదీర్ పాల్గొన్నారు.
GDWL: జనగామ నుంచి బదిలీపై గద్వాలకు రానున్న కలెక్టర్ రిజ్వీన్ భాష షేక్‌కు నడిగడ్డ ప్రజలు స్వాగతం పలుకుతున్నారు. జనగామ అభివృద్ధిలో ఆయన చూపిన పనితీరును చూసిన స్థానికులు, గద్వాల అభివృద్ధికి కూడా అదే ఉత్సాహంతో కృషి చేయాలని ఆశిస్తున్నారు. ఇక్కడి కలెక్టర్ బీఎం సంతోష్ ట్రైబల్ వెల్ఫేర్‌కు బదిలీ అయిన విషయం తెలిసిందే.
NZB: బోధన్ సబ్ కలెక్టర్ గురువారం సాలంపాడ్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాలలో జరుగుతున్న బేస్‌లైన్, మిడ్‌లైన్ పరీక్షల సరళిని ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ క్రమంలో వర్షిత, గంగ, ప్రసాద్ అనే విద్యార్థుల సమాధాన పత్రాలను స్వయంగా తనిఖీ చేసి, వారి అభ్యసన సామర్థ్యాలను అడిగి తెలుసుకున్నారు.
KMR: ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాడతామని కామారెడ్డి జిల్లా ఎస్జీటీ ఉపాధ్యాయ సంఘం ప్రధాన కార్యదర్శి సంతోష్ స్పష్టం చేశారు. గురువారం ఇబ్రహీంపేట ZPHSలో సంఘం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి, మాట్లాడుతూ.. ఉపాధ్యాయులకు ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే సంఘం దృష్టికి తీసుకురావాలని సూచించారు.
KMR: దోమకొండ మండలం అంచనూర్‌లో దోమల బెడద నివారణకు సర్పంచ్ జనగామ నరేష్ ఆధ్వర్యంలో ఫాగింగ్ కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో దోమల వల్ల వ్యాధులు వ్యాప్తి చెందకుండా ముందస్తు చర్యలుగా ఫాగింగ్ చేపట్టామని తెలిపారు. కార్యక్రమానికి గ్రామస్థుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ సందర్భంగా ఇలాంటి చర్యలు కొనసాగించాలని కోరుతున్నట్లు అధికారులు వెల్లడించారు.
NZB: కమ్మర్పల్లి మండలం హస కొత్తూర్ గ్రామంలోని హరిహర క్షేత్రంలో అన్నపూర్ణ సమేత మహాదేవస్వామి కల్యాణ వేడుకలు వైభవంగా జరిగాయి. వీడీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఉత్సవాల్లో స్వామివారి సుప్రభాత సేవ, కల్యాణ ఘట్టాలను భక్తులు అధిక సంఖ్యలో తిలకించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నెలిమెల రేవతి గంగారెడ్డి, వీడీసీ అధ్యక్షులు బంగ్లా లింబాద్రి, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
NZB: కమ్మర్పల్లికి చెందిన బొడ్డు సుజాత న్యూరో సంబంధిత వ్యాధితో నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె వైద్య ఖర్చుల నిమిత్తం మంజూరైన రూ.2 లక్షల ఎల్ఎసీ పత్రాన్ని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. ఆపద సమయంలో ఆర్థికసాయం అందించి అండగా నిలిచిన ఎమ్మెల్యేకు కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
WGL: వాహనదారులు తమ కుటుంబ క్షేమాన్ని దృష్టిలో వుంచుకోని మద్యం సేవించి వాహనం నడపోద్దని వరంగల్ ట్రాఫిక్ ACP సత్యనారాయణ అన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనీఖీల్లో పట్టుపడిన వాహనదారులకు నేడు కౌన్సిలింగ్ నిర్వహించారు. ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా ట్రాఫిక్ నియమ, నిబంధనలు పాటించాలని అన్నారు. హన్మకొండ ట్రాఫిక్ ఇన్స్‌స్పెక్టర్ సీతారెడ్డి, తదితరులు ఉన్నారు.
MNCL: బెల్లంపల్లి నియోజకవర్గ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని MLA గడ్డం వినోద్ అన్నారు. గురువారం కాసిపేట్ మండలంలోని పలు గ్రామాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసి పనులు ప్రారంభించారు. MLA మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల మెరుగుదలకు ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని పేర్కొన్నారు.
ఆసిఫాబాద్ జిల్లాలో మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు నిర్వహించనున్న 10వ తరగతి వార్షిక పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ డేవిడ్ గురువారం సూచించారు. ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్ బృందాలు నియమించామని తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో క్రమశిక్షణ, గోప్యత పాటించాలని, మొబైల్ ఫోన్లను అనుమతించవద్దని తెలిపారు.
BDK: బూర్గంపాడు మండలం సిపిఎం పార్టీ మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు సింగారం రోడ్డు ని గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆదివాసి గిరిజనుల పరిస్థితి చూసి ఆవేదన వ్యక్తం చేశారు. రహదారి లేక గిరిజన ప్రజలు అనేక ఇబ్బంది పడుతున్నారని మణుగూరు చెరువు సింగారం రోడ్డు మార్గం చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
BDK: ప్రభుత్వం ప్రజా పాలనలో పేదలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. టేకులపల్లి మండలం ముత్యాలంపాడు క్రాస్ రోడ్ గ్రామ పంచాయితి పరిధిలోని స్ధానిక రైతు వేదికలో స్ధానిక MRO అధ్యక్షతన జరిగిన కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణి కార్యక్రమానికి గురువారం ఎమ్మెల్యే కోరం కనకయ్య హాజరయ్యారు. మంజూరైన లబ్ధిదారులకు ఎమ్మెల్యే చెక్కులు పంపిణీ చేశారు.