• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

హత్యాయత్నం కేసులో కార్పొరేటర్ అరెస్టు

WGL: ఆర్థిక లావాదేవీల వివాదంలో ఓ వ్యక్తిపై దాడి చేసిన ఘటనలో కాంగ్రెస్ పార్టీ 5వ డివిజన్ వరంగల్ కార్పొరేటర్ శ్రీమన్నారాయణను మంగళవారం సరూర్‌నగర్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. దిల్సుఖ్‌నగర్‌కు చెందిన చీదర శ్రీనివాస్ వద్ద రూ.35 లక్షల అప్పు, చెక్కుల వివాదంలో దాడిచేసిన కేసులో కార్పొరేటర్ పాత్ర బయట పడడంతో పోలీసులు అరెస్టు చేశారు.

February 25, 2026 / 06:01 AM IST

రైతుల కోసం వ్యవసాయ విద్యుత్ కలెక్షన్లు

పెద్దపల్లి సర్కిల్లో రైతులకు నిరంతర నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించేందుకు వ్యవసాయ కనెక్షన్లు వేగంగా మంజూరు చేస్తున్నట్లు ఎస్ఈ గంగాధర్ తెలిపారు. డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు 344 సర్వీసులు మంజూరు చేసినట్లు వెల్లడించారు. పంటల కోత అనంతరం రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని చర్యలు చేపట్టినట్లు చెప్పారు. క్షేత్రస్థాయిలో అవసరమైన సామగ్రి అందుబాటులో ఉన్నట్లు తెలిపారు.

February 25, 2026 / 05:36 AM IST

వరంగల్ సూపర్ స్పెషాలిటీపై హరీశ్‌రావుకు మంత్రి కౌంటర్..!

MDK: వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌పై మాజీ మంత్రి హరీశ్‌రావు చేసిన విమర్శలను ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఖండించారు. బీఆర్‌ఎస్ హయాంలో పనులు 50% కూడా పూర్తికాలేదని, అశాస్త్రీయంగా వ్యయం పెంచారని ఆరోపించారు. తమ ప్రభుత్వం రూ. 300 కోట్లు ఆదా చేసి పనులు వేగవంతం చేసిందన్నారు.

February 25, 2026 / 05:34 AM IST

‘నీటి సమస్య రాకుండా చర్యలు చేపట్టాలి’

ADB: వేసవికాలంలో నీటి సమస్య రాకుండా చర్యలు చేపట్టాలని మున్సిపల్ ఛైర్మన్ బండారి అనూష అన్నారు. నిన్న రూరల్ మండలం లండసాంగి గ్రామ సమీపంలోని పంప్ హౌస్ ను మున్సిపల్ అధికారులతో కలిసి సందర్శించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పబ్లిక్ హెల్త్ EE గంగాధర్, DE అరుణ్, పబ్లిక్ హెల్త్, మున్సిపల్ అధికారులు, AE, స్థానికులు, తదితరులు ఉన్నారు.

February 25, 2026 / 05:23 AM IST

స్కూలు వాహనాలపై రవాణాశాఖ నిఘా

SRCL: జిల్లా వ్యాప్తంగా పాఠశాల బస్సులు, ఆటోలపై రవాణాశాఖ అధికారులు మంగళవారం ముమ్మర తనిఖీలు చేపట్టారు. డీటీవో లక్ష్మణ్ ఆదేశాల మేరకు వేములవాడ,ఎల్లారెడ్డిపేట, కోనరావుపేట,చందుర్తి, రుద్రంగి, తంగళ్లపల్లి మండలాల్లో తనిఖీలు నిర్వహించి, నిబంధనలు పాటించని 15 వాహనాలను సీజ్ చేశారు. విద్యార్థుల భద్రత దృష్ట్యా ఫిట్‌నెస్ లేని వాహనాలను నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

February 25, 2026 / 05:21 AM IST

రోడ్డు భద్రతే లక్ష్యంగా ‘అరైవ్-అలైవ్’ కార్యక్రమం

PDPL: రోడ్డు భద్రతే లక్ష్యంగా రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా ఆధ్వర్యంలో ‘అరైవ్-అలైవ్’ కార్యక్రమం నిర్వహించారు. హెల్మెట్ లేని వారికి చలాన్లకు బదులు హెల్మెట్లు పంపిణీ చేసి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డీసీపీ రామ్ రెడ్డి, ఏసీపీలు రమేష్, శ్రీనివాస్, ఇన్స్పెక్టర్లు ఇంద్రసేనారెడ్డి, రాజేశ్వరరావు, అనిల్, సత్యనారాయణ, సీఐలు రమేష్, హరిశేఖర్, తదితరులు పాల్గొన్నారు.

February 25, 2026 / 04:56 AM IST

ప్రమాదాల నివారణపై ‘అరైవ్-అలైవ్’ అవగాహన

SRCL: వీర్నపల్లి మండలం గర్జనపల్లి గ్రామంలో మంగళవారం ఎస్సై వేముల లక్ష్మణ్ ఆధ్వర్యంలో ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ప్రమాదాలను నివారించాలని కోరారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని సూచించారు.

February 25, 2026 / 04:38 AM IST

క్రీడల్లో మెరిసిన విద్యుత్ ఉద్యోగులు

JGL: విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ఈనెల 17 నుంచి 19 తేదీ వరకు ఖమ్మంలో నిర్వహించిన ఆటల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి జిల్లాకు మెడల్స్ తీసుకొచ్చిన జగిత్యాల జిల్లా ఉద్యో గులను SE బి.సుదర్శనం అభినందించారు. ఉద్యోగంలో రాణిస్తూ క్రీడల్లో ముందంజలో ఉండటం సంతోషమని అన్నారు. ఇలాగే జాతీయ స్థాయి పోటీల్లో కూడా మంచి ప్రతిభ కనబరచాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

February 25, 2026 / 04:29 AM IST

‘జిల్లాలో యూరియా కొరత లేదు’

KNR: కరీంనగర్ జిల్లాలో జనవరి 31 నుంచి 84663 మంది రైతులు 301479 యూరియా బస్తాలను బుక్ చేసుకొని 269215 బస్తాలను కొనుగోలు చేశారని డీఏఓ భాగ్య లక్ష్మి తెలిపారు. జిల్లాలో 1510 మెట్రిక్ టన్నులు యూరియా అందుబాటులో ఉందన్నారు. జిల్లా రైతులు ఆందోళన చెందొద్దని స్పష్టం చేశారు. అవసరానికి తగ్గట్టుగా యూరియా సరఫరా చేస్తామని DAO పేర్కొన్నారు.

February 25, 2026 / 04:04 AM IST

‘రాకేష్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకో’

NZB: ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు ఎమ్మెల్యే గూండాలా, రౌడీలా మాట్లాడుతున్నారని కాంగ్రెస్​ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ఇంటికి వచ్చిన వ్యక్తి వయసు 65 ఏళ్లు ఉంటుందన్నారు.

February 24, 2026 / 10:00 PM IST

ఆలయానికి విరాళాలు అందజేత

KMR: పల్వంచ మండలం భవానీపేటలో మంగళవారం రేణుక ఎల్లమ్మ కళ్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు. పల్వంచ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పల్లె రమేశ్ గౌడ్ హాజరయ్యారు. ఆలయ అభివృద్ధికి తనవంతు సహాయంగా రూ.1,16,000 లక్షల విరాళం అందజేశారు. మాతమ్మ ఆలయానికి రూ.20,000 వేలు సహాయం ప్రకటించి చెక్కును గ్రామస్థులకు పంపిణీ చేశారు. గ్రామ అధ్యక్షుడు చాకలి రాజు కృతజ్ఞతలు తెలిపారు.

February 24, 2026 / 09:28 PM IST

ట్రాఫిక్​ నిబంధనలపై అవగాహన ఉండాలి: సీపీ

NZB: సామాజిక అంశాలపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని సీపీ సాయి చైతన్య సూచించారు. రోడ్డు భద్రత ప్రమాదాల నివారణపై విద్యార్థులు ఇతరులను చైతన్యవంతం చేయాలన్నారు. రోడ్డు ప్రమాదాలు నివారించడం కోసం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ‘అలైవ్-​ అరైవ్’​ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

February 24, 2026 / 09:23 PM IST

మేళ్లచెరువు జాతర ఆదాయం ఎంతంటే..?

SRPT: మేళ్లచెరువు రామలింగేశ్వర స్వామి జాతర ద్వారా మొత్తం రూ. 45,43,657 లక్ష్లల ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో శంభిరెడ్డి మంగళవారం తెలిపారు. టికెట్ ద్వారా రూ. 15 లక్షలు, ఉండి ద్వారా రూ. 12 లక్షలు, వేలం పాటల ద్వారా రూ. 6 లక్షలు లభించాయి. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఆదాయం రూ. 6 లక్షలు వరకు పెరిగిందని ఆయన తెలియజేశారు.

February 24, 2026 / 09:02 PM IST

ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ

KNR: మానకొండూరు మండలం మద్దికుంట గ్రామపంచాయతీలో మంగళవారం శ్రీధర్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద ఐదుగురికి ఉచిత గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేశారు. నిరుపేద కుటుంబాలు కట్టెల పొయ్యి వాడకం వల్ల అనారోగ్యానికి గురవుతున్నాయని, పేదలను దృష్టిలో ఉంచుకుని పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కవిత, ఉప సర్పంచ్ పాల్గొన్నారు.

February 24, 2026 / 09:02 PM IST

టూరిజం మాస్టర్ ప్లాన్ పై సమావేశం

BHNG: టూరిజం మాస్టర్ ప్లాన్ తయారీలో భాగంగా ఇవాళ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కరరావు సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. టూరిజం మాస్టర్ ప్లాన్ రూపకల్పనలో రెండు రోజులలో ప్రణాళికలు సిద్ధం చేయాలని అన్నారు. రాచకొండ, భువనగిరి ఫోర్ట్, మహదేవ్ పూర్, యాదాద్రి టెంపుల్, కొలనుపాకలను గుర్తించి ప్రణాళికలు రూపొందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

February 24, 2026 / 09:00 PM IST