• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

11వ వార్డులో పారిశుధ్య పనులు

VKB: పరిగిలోని 11వ వార్డులో అపరిశుభ్ర పరిస్థితుల కారణంగా కౌన్సిలర్ పారిశుధ్య కార్యక్రమం నిర్వహించారు. వార్డులో పర్యటించిన కౌన్సిలర్ ఎండీ అజాజ్ ఆయన మురుగునీరు నిల్వ, నాలాల్లో చెత్త పేరుకుపోవడంతో ప్రజలకు అనారోగ్యాలు వచ్చే ప్రమాదం ఉందని తెలిపారు. మున్సిపల్ కార్మికుల సహాయంతో నాలాలను శుభ్రపరిచి చెత్తను తొలగించే పనులు చేపట్టించారు.

February 24, 2026 / 11:21 AM IST

వనపర్తి పాత బస్టాండ్ సమస్యలు

WNP: వనపర్తి పాత బస్టాండ్‌లో తాగు నీరు, సరియైన కూర్చీలు, వేచిచూడే సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నామని ప్రయాణికులు తెలిపారు. కేవలం ఒక షెడ్డు, 4 కుర్చీలు ఉన్నాయని వారు చెబుతున్నారు. కొల్లాపూర్, నాగర్కర్నూల్ బస్సులు బస్టాండ్‌కి రాకుండా రాజీవ్ చౌరస్తాలో ఆగి వెల్లిపోతున్నాయన్నారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించమని అదికారులను కోరారు.

February 24, 2026 / 11:21 AM IST

‘దిశ సమావేశానికి అధికారులు సిద్ధంగా ఉండాలి’

KMM: కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పరిపాలన అంశాలపై సమీక్ష నిర్వహించి, ఈ నెల 27న జరిగే ‘దిశ’ సమావేశానికి అధికారులు పూర్తి సమాచారంతో హాజరుకావాలని ఆదేశించారు. సత్తుపల్లిలో అటవీ ఉత్పత్తుల మార్ట్ నిర్మాణానికి రూ. 10 లక్షల ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, భూసేకరణ కేసులు, భూ భారతి దరఖాస్తులపై త్వరితగతిన నివేదికలు సమర్పించాలని సూచించారు.

February 24, 2026 / 11:18 AM IST

గురుకుల హాస్టల్‌లో క్షుద్ర పూజల కలకలం

JN: పాల‌కుర్తి (M) గూడురు గిరిజ‌న‌ బాలిక‌ల వ‌స‌తి గృహంలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. హాస్టల్‌లో గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి సమయంలో క్షుద్ర పూజలు చేసి పసుపు, కుంకుమ, బొమ్మలు లాంటివి వేస్తున్నారని విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. దీంతో రాత్రి సమయంలో నిద్ర కూడా పట్టడం లేదు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు.

February 24, 2026 / 11:16 AM IST

విద్యాపీఠం సందర్శించిన మున్సిపల్ చైర్ పర్సన్

సంగారెడ్డి మండలం ఫసల్వాదిలోని జ్యోతిర్ వాస్తు విద్యాపీఠాన్ని నూతన మున్సిపల్ చైర్ పర్సన్ కూన వనిత సంతోష్ కుమార్ మంగళవారం సందర్శించారు. ఈ మేరకు స్థానిక బ్రహ్మశ్రీ మహేశ్వర శర్మ సిద్ధాంతిని కలిసి ఆశీర్వచనం తీసుకున్నారు. అయితే ఈనెల 26న మున్సిపల్ కార్యాలయంలో జరిగే ప్రమాణ స్వీకారం మహోత్సవానికి రావాలని చైర్ పర్సన్ సిద్ధాంతిని ఆహ్వానించారు.

February 24, 2026 / 11:14 AM IST

గాలివాన బీభత్సం.. పలుచోట్ల కూలిన చెట్లు

SRPT: మేళ్లచెరువులో నిన్న రాత్రి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడడంతో జనజీవనం సంధించింది. గాలి దాటికి పలుచోట్ల చెట్లు విరిగిపడగా, విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రస్తుతం మిర్చి ఏరుతున్న దశలో వర్షం కురవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. నేడు రేపు వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికతో ప్రజలు అప్రమత్తంగా అధికారులు సూచించారు.

February 24, 2026 / 11:14 AM IST

పాదయాత్రగా బయలుదేరిన కౌన్సిలర్

KMR: పట్టణ పరిధిలోని దేవునిపల్లి పదవ వార్డు కౌన్సిలర్ కాసర్ల మాధవి రవీందర్ మంగళవారం దేవునిపల్లి నుంచి రామారెడ్డి-ఇసన్నపల్లి కాలభైరవ స్వామి ఆలయానికి 15 మంది అనుచరులతో పాదయాత్రగా వెళ్లారు. వార్డులో ఎటువంటి అవాంతరాలు లేకుండా అన్ని అభివృద్ధి పనులు సక్రమంగా కొనసాగేందుకు పాదయాత్ర చేస్తున్నట్లు ఆమె వివరించారు.

February 24, 2026 / 11:14 AM IST

రొమాన్స్, క్రాస్ మసాజ్ అడ్డగా KPHB.. చర్యలేవి..?

MDCL: రోడ్ల పై రొమాన్స్, స్పా సెంటర్లలో మసాజ్ పేరిట అసాంఘిక కార్యకలాపాలకు KPHB, కూకట్ పల్లి ప్రాంతాలు అడ్డాలుగా మారుతున్నాయి. స్పా సెంటర్లలో క్రాస్ మసాజింగ్ జరుగుతున్నప్పటికీ, కఠిన చర్యలు తీసుకోకపోవడంతోనే ఇలాంటివి చెలరేగుతున్నాయని పరిసర ప్రజలు ఆరోపిస్తున్నారు. రాత్రి రోడ్ల మీద అమ్మాయిలు అందంతో వలవేస్తూ అసభ్యంగా ప్రవర్తిస్తున్నారన్నారు.

February 24, 2026 / 11:12 AM IST

కో ఆప్షన్ పదవుల కోసం మంతనాలు

SRCL: మున్సిపల్ కో ఆప్షన్ పదవుల కోసం పలువురు ఆశావహులు నిరీక్షిస్తున్నారు. వేములవాడ మున్సిపల్ పీఠాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడంతో ఆ పార్టీకి చెందిన ముస్లిం నాయకులు అబ్దుల్ రజాక్, పీర్ మహ్మద్, బాబున్, క్రైస్తవ నాయకులు ఇన్నారెడ్డి, ప్రశాంత్ రెడ్డితో పాటు పలువురు మాజీ కౌన్సిలర్లు కో ఆప్షన్ సభ్యత్వం కోసం విప్‌తో మంతనాలు జరుపుతున్నారు.

February 24, 2026 / 11:11 AM IST

భద్రాద్రిలో రెండు పవర్ ప్లాంట్లు

BDK: మహిళా సంఘాల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం ముందడుగు వేసింది. ఇందిరా మహిళా శక్తి ఆధ్వర్యంలో భద్రాద్రి జిల్లాలోని సుజాతనగర్ లక్ష్మీదేవిపల్లి, మణుగూరు ఉడతనేని గుంపు గ్రామాల్లో రెండు సోలార్ పవర్ ప్లాంట్ల స్థాపనకు ఆమోదం తెలిపింది. ఒక్కో ప్లాంట్‌కు రూ.3 కోట్లు కేటాయించనున్నారు. ఈ ప్రాజెక్టులతో మహిళా సంఘాలకు స్థిర ఆదాయం లభించనుందని అధికారులు తెలిపారు.

February 24, 2026 / 11:10 AM IST

ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల కోసం ఏర్పాట్లు పూర్తి

NZB: రేపటి నుంచి మార్చి 18 వరకు నిర్వహించబోయే ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల కోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. NZB జిల్లా వ్యాప్తంగా 58 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా మొత్తం 36,963 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. పరీక్ష కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉంటుంది.

February 24, 2026 / 11:09 AM IST

చెట్లు నాటాలనే సంకల్పం గర్వకారణం: సీఐ

MDK: ప్రతి ఒక్కరూ చెట్లు నాటాలనే సంకల్పంతో గ్రామంలో ‘ప్రతి ఒక్కరు-ఒక చెట్టు’ కార్యక్రమం నిర్వహించడం గర్వకారణమని సీఐ రేణుకరెడ్డి తెలిపారు. సోమవారం టేక్మాల్ మండలంలోని దాదాయిపల్లిలో సర్పంచ్ నర్సింహారావ్ దేశ్పాండే ఆధ్వర్యంలో చెట్లను నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. సీఐ మాట్లాడుతూ.. గ్రామాన్ని మద్యం రహితంగా, హరిత గ్రామంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంమన్నారు.

February 24, 2026 / 11:08 AM IST

‘ఏజెన్సీ దళిత బహుజనులకు మద్దతు ఇవ్వాలి’

MLG: ఏజెన్సీలోని SC, ST, BCలు తరతరాలుగా సాగుచేస్తున్న భూముల్లో ఫారెస్ట్ అధికారులు మొక్కలు నాటడం ద్వారా వారిని వెళ్లగొట్టే కుట్ర జరుగుతోందని TDP జిల్లా అధ్యక్షుడు దేవా నాయక్ ఆరోపించారు. ఛత్తీస్‌గడ్ నుంచి వచ్చినవారితో అడవులను నాశనం చేస్తున్నారన్నారు. తమపై దాడులు ఆపాలని, ఉక్కుపాదం మోపడాన్ని వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. జిల్లాలో రేపటి దళిత సభకు ప్రజలు మద్దతు ఇవ్వాలన్నారు.

February 24, 2026 / 11:08 AM IST

ఇంటర్ విద్యార్థులకు ALL THE BEST: మంత్రి

మంచిర్యాల జిల్లాలో రేపటి నుంచి ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ వార్షిక పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు మంత్రి వివేక్ వెంకటస్వామి మంగళవారం ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు. గత కొద్ది నెలలుగా విద్యార్థులు చేసిన కృషికి ఫలితం అందుకునే సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. ఎటువంటి ఒత్తిడికి లోను కాకుండా ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని సూచించారు.

February 24, 2026 / 11:07 AM IST

శామీర్ పేట మెట్రో.. కేంద్ర అనుమతి కోసం ఎదురుచూపులు..!

MDCL: జూబ్లీ బస్ స్టేషన్ నుంచి మేడ్చల్, మరోవైపు శామీర్‌పేట వరకు మెట్రో నిర్మాణానికి సంబంధించి డీటెయిల్స్ పూర్తి చేసి కేంద్రానికి పంపినట్లుగా మెట్రో సంస్థ తెలిపింది. గత కొద్ది రోజులుగా కేంద్ర అనుమతి కోసం ఎదురుచూపులు చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కేంద్రం త్వరగా నిర్ణయం తీసుకుని గ్రీన్ సిగ్నల్ ఇస్తే నిర్మాణం ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి.

February 24, 2026 / 11:07 AM IST