NGKL: అచ్చంపేట మండలంలో కొలువుదీరిన ఉమామహేశ్వర క్షేత్రం 1800 ఏళ్ల సుదీర్ఘ చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. క్రీ.శ. 2వ శతాబ్దంలో మౌర్య చంద్రగుప్తుని కాలంలోనే ఈ ఆలయ నిర్మాణం జరిగినట్లు చరిత్రకారులు పేర్కొంటున్నారు. 13వ శతాబ్దంలో కాకతీయ సామంతుల కాలంలో ఈ ప్రాంతం మరింత ప్రాచుర్యం పొందింది. శ్రీశైల మల్లికార్జున స్వామికి ‘ఉత్తర ద్వారం’గా పేరుగాంచింది.
KNR: వచ్చే నెల 14 నుంచి పదవ తరగతి పరీక్షలు నిర్వహించనున్న నేపథ్యంలో విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ ఉంచాలని అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే ఉపాధ్యాయులకు సూచించారు. చింతకుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను బుధవారం అడిషనల్ కలెక్టర్ సందర్శించి 10వ తరగతి విద్యార్థులతో మాట్లాడారు. పరీక్షలు సమీపిస్తున్నందున రోజు విధిగా పాఠశాలకు రావాలని సూచించారు.
KNR: కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన ఎన్నికల హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ TG జాగృతి ఆధ్వర్యంలో KNR కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. నెలకు రూ.2500 ఆర్థిక సాయం, తులం బంగారం, విద్యార్థినులకు స్కూటీల పంపిణీ ఏమైందని నేతలు ప్రశ్నించారు. 26 నెలలు గడిచినా బడ్జెట్ సాకులు చెప్పడం సరికాదని, హామీలు నెరవేర్చకుంటే CM నివాసాన్ని ముట్టడిస్తామన్నారు.
ADB: కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అవినీతిని ప్రజల పక్షాన ప్రశ్నిస్తే బీఆర్ఎస్ పార్టీ నేతలపై కేసులు పెడతారా అని తెలంగాణ BRSV రాష్ట్ర నాయకుడు గెల్లు శ్రీనివాస్ అన్నారు. జిల్లా జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను బుధవారం పరామర్శించిన అనంతరం ఆయన మాట్లాడారు. BRS నాయకులపై ఎన్ని కేసులు పెట్టిన వెనుకడుగు వేసేది లేదని హెచ్చరించారు.
BDK: మణుగూరులోని చారిత్రాత్మక శ్రీ కాళీమాత ఆలయ తరలింపు మరియు పునఃప్రతిష్ఠా పనులపై కేంద్ర మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి బుధవారం సానుకూలంగా స్పందించారు. BTPS రైల్వే లైన్ నిర్మాణంలో భాగంగా 55 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయం తొలగింపుకు గురవుతున్న నేపథ్యంలో, ఆలయ కమిటీ విన్నపాన్ని పరిశీలించి ఆలయ తరలింపుకు అయ్యే ఖర్చులు నిబంధనల ప్రకారం అందిస్తామని సూచించారు.
SDPT: కోహెడ మండలంలోని తంగళ్లపల్లిలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకున్నారని సర్పంచ్ బోయిని సంపత్ తెలిపారు. 250 మందికి బీపీ, షుగర్ పరీక్షలు చేసి దాదాపు రూ.20 వేల విలువైన మందులు ఉచితంగా పంపిణీ చేశారు. డా. జయంత్, డా. సాయి శ్రీ ఆధ్వర్యంలో పరీక్షలు జరిగాయి. అనంతరం హాస్పిటల్ యాజమాన్యాన్ని సన్మానించారు.
BDK: కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పాల్వంచ 9వ డివిజన్ గుడిపాడు లో నూతనంగా పునర్నిర్మాణం జరిగిన శ్రీదేవి, గోదాదేవి సమేత శ్రీ మోక్ష వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రతిష్ట మహోత్సవ 5వ రోజు పూజలు ఘనంగా నిర్వహించారు. బుధవారం డీసీఎంఎస్ మాజీ ఛైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు దంపతులు పాల్గొని పూజలు నిర్వహించారు.
MDK: చేగుంట మండలం పోలంపల్లి సర్పంచ్ కొండి రాజ్యలక్ష్మి స్వామి ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాంను బుధవారం కలిశారు. పోలంపల్లి గ్రామ సమస్యలను ఎమ్మెల్సీ కోదండరాం దృష్టికి తీసుకువచ్చినట్లు తెలిపారు. గ్రామ సమస్యలపై ఎమ్మెల్సీ కోదండరాం సానుకూలంగా స్పందించి గ్రామాభివృద్ధికి నిధులు అందజేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. వార్డు సభ్యులు చింతకాయల ప్రవీణ్ పాల్గొన్నారు.
MHBD: గురుకులాల సమస్యలను వెంటనే పరిష్కరించాలని గురుకులాల సెక్రటరీ సీతాలక్ష్మికి DSFI నేతలు వినతిపత్రం అందజేశారు. DSFI రాష్ట్ర కార్యదర్శి సాయికుమార్, కోశాధికారి గుగులోతు సూర్య ప్రకాష్‌లు మాట్లాడుతూ.. గురుకులాల్లో సమస్యలను వెంటనే పరిష్కరించి విద్యార్థులకు నాణ్యమైన విద్య, భోజనం అందించాలన్నారు.
RR: షాద్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలోని ఆర్టీసీ కాలనీ, అయ్యప్ప కాలనీ పార్క్, ఆనంద్ కాలనీ సమీపంలో ఇటీవల వేసిన రోడ్ల పనులు పూర్తిగా చేయకపోవడం వల్ల ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. రోడ్డుకు ఇరుపక్కల మట్టి పోయకపోవడంతో వాహనాలు జారిపడి గాయాల పాలవుతున్నారని వాపోతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి రోడ్డు పక్కన మట్టి పోసి సమతుల్యం చేయాలన్నారు.
MLG: ములుగు కలెక్టరేట్ నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని మంత్రి సీతక్క అన్నారు. ములుగు కలెక్టరేట్ నిర్మాణ పనులను అధికారులతో కలిసి నేడు మంత్రి సీతక్క పరిశీలించారు. ములుగు జిల్లా ప్రజలకు అందుబాటులో ఉండేలా భవనాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని, పనులను సకాలంలో పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.
JGL: అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని మెట్ పల్లి మున్సిపల్ ఛైర్మన్ మైలారపురి లింబాద్రి అన్నారు. మెట్పల్లిలోని ఏడో వార్డులో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమాన్ని మున్సిపల్ ఛైర్మన్ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన లబ్ధిదారుల కుటుంబానికి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రభుత్వం పేదల సంక్షేమమే లక్ష్యమన్నారు.
MNCL: కాసిపేట మండలంలోని దుబ్బగూడెం KK ఓసీ ఓపెన్ కాస్ట్ లో తమకు ఉద్యోగాలు కల్పించాలని ఓపెన్ కాస్ట్ సింగరేణి ముంపుకు గురైన భూ నిర్వాసితులు డిమాండ్ చేశారు. బుధవారం ఓపెన్ కాస్ట్‌లో విధుల సమయంలో వాహనాలు రాకపోకలను నిలిపివేసి ధర్నా చేశారు. సమస్యలను అతిత్వరలో పరిష్కారిస్తమని ఓపెన్ కాస్ట్ యాజమాన్యం చెప్పడంతో ధర్నా విరమించారు.
NZB: ప్రజలకు తక్కువ ధరలో నాణ్యమైన ఔషధాలు అందించేందుకే ఈ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోడీ నిర్వహింప చేస్తున్నారని అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ అన్నారు. నగరంలోని శ్రీనగర్ కాలనీ, వినాయక్ నగర్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ప్రధాన్ మంత్రి భారతీయ జన ఔషధి కేంద్రాన్ని అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ ప్రారంభించారు.
KNR: మహిళల నుంచి వచ్చే ఫిర్యాదులపై అధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే ఆదేశించారు. లైంగిక వేధింపుల నిర్మూలన చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. బుధవారం KNR కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహిళా సాధికారిత కేంద్రం ద్వారా అవగాహన శిబిరం నిర్వహించారు.