KNR: గంగాధర మండలం కురిక్యాల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ కార్యదర్శి ప్రభాకర్‌ను సస్పెండ్ చేస్తూ జిల్లా సహకార అధికారి సీహెచ్ మనోజ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. నిధుల దుర్వినియోగం, ఎరువుల కొనుగోలులో అవకతవకలు, రుణాల వసూలులో పాత ఓచర్ల డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు రావడంతో సస్పెండ్ చేశారు. రామడుగు కార్యదర్శికి అదనపు బాధ్యతలు అప్పగించారు.
SRPT: మునగాల మండలం రేపాల లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా, గ్రామానికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ పింగళి ఉపేందర్, కందిబండ సురేష్ కలిసి లక్ష్మీనరసింహస్వామి సేవకులకు టీషర్ట్స్‌ను ఆలయ ఛైర్మన్ సారిక చిన్న రామయ్యతో అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ ఛైర్మన్ మాట్లాడుతూ.. స్వామివారి సేవకులకు టీషర్ట్స్ అందజేసిన ఉపేందర్, సురేష్‌ను అభినందించినారు.
NRPT: ప్రభుత్వం రక్షణ చట్టం తేవాలని న్యాయవాదులు గురువారం నారాయణపేట జిల్లా కోర్టు నుంచి రాష్ట్ర సచివాలయం వరకు మహా పాదయాత్ర చేపట్టారు. కాళేశ్వర్, మోహన్యాదవ్, మహేష్ యాదవ్, రాములు పాదయాత్రగా బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ న్యాయవాది రఘువీర్ యాదవ్ మాట్లాడుతూ.. రేపటిలోగా న్యాయవాదుల చట్టం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని హెచ్చరించారు.
HYD: ప్రతి గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. ఫరూఖ్ నగర్ మండల పరిధిలోని అన్నారం గ్రామంలో ఆయన పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యకు అత్యధిక ప్రాధాన్యతను ఇస్తున్నామని, విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించడం ద్వారానే ఉజ్వల భవిష్యత్తు సాధ్యమవుతుందన్నారు.
BHPL: చిట్యాల(M) నవాబుపేట గ్రామానికి చెందిన PACS మాజీ డైరెక్టర్ కసిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి సతీమణి రమ క్యాన్సర్ వ్యాధితో అనారోగ్యానికి గురై ఈ రోజు మరణించారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ MLA గండ్ర వెంకటరమణారెడ్డి, BRS జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి మృతురాలి నివాసానికి వెళ్లి ఆమె పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. BRS నేతలు ఉన్నారు.
RR: చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డిని ఆయన నివాసంలో BJP నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా OBC మోర్చా నాయకుడు బోయిని మహేష్ యాదవ్ MPకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. పలువురు పార్టీ కార్యకర్తలు, నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఆదిలాబాద్ నలంద కళాశాలలో మార్చి 1న ఫౌండేషన్ కోర్సు ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు ఎస్సీ అభివృద్ధి అధికారి సునీత కుమారి పేర్కొన్నారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసిన వారు వెబ్సైట్ నుంచి హాల్‌టికెట్లు పొందవచ్చు. పరీక్ష ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుందని, అభ్యర్థులు సకాలంలో హాజరుకావాలని కోరారు. సమాచారం కోసం 9494149416 నంబర్‌కు సంప్రదించాలని వెల్లడించారు.
నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర ఘటనలో చోటుచేసుకున్న ఉద్రిక్తతలు, చిన్నారి మృతిపై జిల్లా SP సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ గురువారం విలేకరుల సమావేశం నిర్వహించనున్నారు. ఈ ఘటనపై ఇప్పటికే పోలీసులు లోతైన దర్యాప్తు జరుపుతుండగా, నమోదైన కేసులు, అరెస్టయిన నిందితుల వివరాలను ఆయన వెల్లడించే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన ఈ సున్నితమైన అంశంపై ఆసక్తి నెలకొంది.
SDPT: మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో శివోల సతీష్ ఇందిరమ్మ ఇల్లు కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఇండ్ల గృహ ప్రవేశంలో ప్రారంభోత్సవంలో సీనియర్ నాయకులు తిర్మల్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ.. తాము ఎన్నో సంవత్సరాలు సొంత ఇల్లు లేక ఇబ్బందులు ఎదుర్కొన్నామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తమ సొంత ఇంటి కల పేదలకు నెరవేరింది.
JGL: రాయికల్ మండలంలోని ఇటిక్యాల గ్రామంలో శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు ఇవాళ గురువారం నుంచి వైభవంగా ప్రారంభం కానున్నాయి. ధర్మకర్తలు చెన్నమనేని విష్ణువర్ధన్, వంశీవర్ధన్ ఆధ్వర్యంలో ఉత్సవాలకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అర్చకులు మరింగంటి రామకృష్ణాచార్యులు తెలిపారు. ఈరోజు నుంచి మార్చి 5వ తేదీ వరకు జరుగుతాయి.
NLG: అఖిల భారత బంజారా సేవా సంఘం మాజీ అధ్యక్షులు రామావత్ భీమా నాయక్ 9వ వర్ధంతి సందర్భంగా దేవరకొండలోని బంజారా భవనంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ పాల్గొని భీమా నాయక్ విగ్రహానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బంజారా సమాజం కోసం భీమా నాయక్ చేసిన పోరాటం మరువలేనిదని కొనియాడారు.
MHBD: రైన్య తండా గ్రామంలో ఇటీవల కురిసిన అకాల వర్షాలతో రైతుల మొక్కజొన్న పంట తీవ్రంగా దెబ్బతింది. పంట పక్వానికి వచ్చే సమయంలో భారీ వర్షాలు, ఈదురు గాలులతో కూడిన వాతావరణం కారణంగా మొక్కలు నేలకు ఒరిగిపోయాయి. చాలా చోట్ల నీరు నిలిచి పంట మునిగిపోయింది. రైతులు పంట నష్టం భరించలేక ఆందోళన చెందుతున్నారు
VKB: దాదాపూర్ గ్రామానికి చెందిన 21 ఏళ్ల తోకని శ్రీనివాస్, దేశ రక్షణలో అమరుడైనందున ఆయనకు అంకితంగా “వీర జవాన్” విగ్రహాన్ని రేపు ఉదయం 11:30 గంటలకు దోమ మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ముందు ప్రత్యేకంగా ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమాన్ని దోమ సర్పంచ్ శివకుమార్ పర్యవేక్షిస్తారు. ఈ కార్యక్రమానికి స్థానిక నాయకులు, గ్రామస్థులు ఘనంగా హాజరుకావాలని ఆహ్వానించారు.
WNP: జిల్లా అదనపు కలెక్టర్ కీమ్యా నాయక్‌కు ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. ఇప్పటివరకు రెవెన్యూ అదనపు కలెక్టర్‌గా సేవలందించిన ఆయనను, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు)గా కేటాయించింది. జిల్లాలోని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల పాలనను మరింత మెరుగుపరిచే లక్ష్యంతో ప్రభుత్వం ఈ మార్పు చేపట్టింది. త్వరలోనే తన కొత్త బాధ్యతలను స్వీకరించనున్నారు.
GDWL: ధరూర్ మండల కేంద్రంలోని పీఎం శ్రీ జడ్పిహెచ్ఎస్ ధరూర్ పాఠశాలలో హెడ్మాస్టర్ ప్రతాప్ రెడ్డి ఫిజికల్ సైన్స్ కాంప్లెక్స్ ఉపాధ్యాయులను సత్కరించారు. కార్యక్రమంలో ఆయన ఉపాధ్యాయుల సమిష్టి కృషి విద్యార్థుల విద్యాభివృద్ధికి ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఫిజికల్ సైన్స్ బోధనలో నాణ్యత పెంచేందుకు కాంప్లెక్స్ సమావేశాలు దోహదపడతాయని ఉపాధ్యాయులు ప్రశంసించారు.