• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు

GDWL: ధరూరు మండలం జాంపల్లి శివారులో శుక్రవారం పేకాట స్థావరాలపై పోలీసులు మెరుపు దాడి చేశారు. ఎస్సై నందికర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ దాడుల్లో రూ.37 వేల నగదు, 2 బైకులు, 2 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకోగా, మిగతా వారు పరారీలో ఉన్నారు. గ్రామాల్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు.

February 21, 2026 / 08:36 AM IST

నిజాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి నీటి విడుదల

KMR: నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి పంట సాగు కోసం ప్రధాన కాలువ ద్వారా 3వ విడతలో భాగంగా శనివారం 1,800 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ఏఈఈ సాకేత్ తెలిపారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 17.802 టీఎంసీలు కాగా, ప్రస్తుతం ప్రాజెక్టులో 14.045 టీఎంసీల నీటి నిల్వ ఉందన్నారు. రైతులు నీటిని పొదుపుగా వాడుకోవాలని అధికారులు కోరారు.

February 21, 2026 / 08:35 AM IST

స్త్రీనిధి రుణాలు సకాలంలో చెల్లించాలి: DRDO

KMM: స్త్రీనిధి ద్వారా తీసుకున్న రుణాలు పెండింగ్ ఉంచకుండా సకాలంలో చెల్లించాలని ఖమ్మం డీఆర్డీవో పీడీ శ్రీరామ్ స్పష్టం చేశారు. గ్రామదీపికల నిర్లక్ష్యం వల్ల వడ్డీ భారం పెరుగుతుందని, అవకతవకలకు తావులేకుండా వసూళ్లు చేపట్టాలని సూచించారు. ఉపాధి హామీ పథకంలో కూలీలకు పనులు కల్పించి, హాజరు శాతాన్ని పెంచేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు.

February 21, 2026 / 08:34 AM IST

‘ఎన్నికలు రాగానే ప్రభుత్వానికి రైతు భరోసా గుర్తుకొస్తుంది’

BHNG: ఎన్నికలు రాగానే ప్రభుత్వానికి రైతు భరోసా గుర్తుకొస్తుందని, రైతు భరోసాను ఓట్ల భరోసాగా మార్చి ఓట్లు రాబట్టుకునేందుకే ప్రభుత్వం రైతులను మభ్యపెడుతోందని డీసీసీబీ మాజీ ఛైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. శుక్రవారం గుండాల మండల కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ప్రభుత్వం రైతు భరోసా ఇవ్వకుండా రైతులను మోసం చేస్తోందన్నారు.

February 21, 2026 / 08:34 AM IST

రేపు జిల్లాకు రానున్న సీఎం రేవంత్ రెడ్డి

MHBD: మహబూబాబాద్ మండలంలోని రెడ్యాల గ్రామానికి చెందిన బీగ్ టీవీ ఛైర్మన్ వెన్నం విజయ్ కాంత్ రెడ్డి, టీపీసీసీ రాష్ట్ర మాజీ కార్యదర్శి, రాష్ట్ర సవింధాన్ కమిటీ సభ్యులు వెన్నం శ్రీకాంత్ రెడ్డిల తండ్రి వెన్నం రాఘవేందర్ రెడ్డి ఇటీవల మరణించారు. వారి కుటుంబాన్ని పరామర్శించేందుకు రేపు రెడ్యాల గ్రామానికి సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు.

February 21, 2026 / 08:33 AM IST

NGKL: విద్యుత్ సరఫరాకు అంతరాయం

NGKL: కల్వకుర్తి మండలం తాండ్ర సబ్ స్టేషన్ లో మరమ్మతుల కారణంగా శనివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని విద్యుత్ ఏఈ జానకిరామ్ తెలిపారు. సబ్ స్టేషన్ పరిధిలోని గ్రామాలలో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్ నిలిపివేస్తున్నట్లు ఆయన సూచించారు. విద్యుత్ వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.

February 21, 2026 / 08:32 AM IST

టేబుల్ టెన్నిస్‌లో సీపీకి కాంస్య పతకం

WGL: సైబరాబాద్ కమిషనరేట్ వేదికగా నిర్వహిస్తున్న నాల్గవ రాష్ట్రస్థాయి పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్‌లో టేబుల్ టెన్నిస్ గెజిటెడ్ అధికారుల విభాగంలో WGL కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ కాంస్య పతకం సాధించారు. అదేవిధంగా 55 ఏళ్ల గెజిటెడ్ అధికార బాల్ బ్యాడ్మింటన్ విభాగంలో వరంగల్ కమిషనరేట్‌కు చెందిన ఏసీపీలు జితేందర్ రెడ్డి, మధుసూదన్‌లకు బంగారు పతకం సాధించారు.

February 21, 2026 / 08:24 AM IST

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

BHPL: టేకుమట్ల మండలం దుబ్యాల గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ బిక్కినేని సంపత్ రావు తండ్రి బిక్కినేని మేటల్ రావు ఇటీవల మరణించారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ MLA గండ్ర వెంకటరమణారెడ్డి నిన్న రాత్రి మృతుడి నివాసానికి వెళ్లి ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

February 21, 2026 / 08:24 AM IST

వ్యభిచార దందా కట్టడి చేయాలని వినతి

WGL: రాయపర్తి మండలం మైలారం శివారులో గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న వ్యభిచార దందాను అరికట్టాలని శనివారం గ్రామస్థులు సర్పంచ్ చిర్ర వేణుకు వినతిపత్రం సమర్పించారు. ఈ దందా కారణంగా గ్రామ యువత దారితప్పుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీస్ శాఖ, గ్రామ పంచాయతీ సంయుక్తంగా ఆకస్మిక దాడులు నిర్వహించి నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

February 21, 2026 / 08:24 AM IST

అనధికారిక మార్కెటింగ్‌పై టీజీ-రెరాచర్యలు

HYD: పుప్పాలగూడలోని ప్రణీత్ కాన్‌సెప్ట్ అంబియన్స్ ప్రాజెక్టులో అనధికారిక మార్కెటింగ్‌పై టీజీ-రెరా కఠిన చర్యలు తీసుకుంది. రెరా రిజిస్ట్రేషన్ లేకుండానే బ్లాకులను విక్రయానికి పెట్టినందుకు సదరు ప్రమోటర్‌పై రూ. 43.71 లక్షల ఫైన్ విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. అలాగే నిర్మాణ ప్రగతికి సంబంధించిన పూర్తి వివరాలను వెంటనే సమర్పించాలని ఆదేశించింది.

February 21, 2026 / 08:21 AM IST

మున్సిపాలిటీలో రూ.500 కోట్ల కుంభకోణం..?

NZB: 2014-25 మధ్య ఆర్మూర్ మున్సిపాలిటీలో జరిగిన రూ.500 కోట్ల అవినీతిపై విజిలెన్స్ విచారణకు రంగం సిద్ధమైంది. ఇటీవల కమిషనర్ రాజు ఏసీబీకి చిక్కడంతో పాత అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ విభాగాల్లో ప్రభుత్వ భూముల ఆక్రమణలు, అక్రమ ఇంటి నంబర్ల కేటాయింపుపై అధికారులు ఆరా తీస్తున్నారు. సమగ్ర విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడించనున్నట్లు అధికారులు తెలిపారు.

February 21, 2026 / 08:17 AM IST

తక్షణమే రైతుబంధు విడుదల చేయాలి: హరీశ్ రావు

SDPT: మున్సిపల్ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే 17వ తేదీన రైతుబంధు విడుదల చేస్తానని సీఎం రేవంత్ చెప్పారని, 20వ తేదీ వచ్చినా ఇప్పటికీ నిధులు జమ కాలేదని హరీశ్ రావు విమర్శించారు. రైతుబంధు నాట్లు వేసేటప్పుడా?, కోతల సమయంలోనా? ఇస్తారని ప్రశ్నించారు. ఇప్పటికే రెండు పంటలకు ఇవ్వలేదని, ఈసారి అయినా విడుదల చేస్తారా? అని నిలదీశారు.

February 21, 2026 / 08:17 AM IST

మాట నిలబెట్టుకున్న మాజీ మేయర్

KNR: కరీంనగర్‌లో ఎన్నికల హామీని నెరవేర్చిన మాజీ మేయర్ సర్ధార్ రవీందర్ సింగ్ తన నిబద్ధతను చాటుకున్నారు. 58వ డివిజన్‌కు చెందిన మాడిశెట్టి రవీందర్ కుమార్తె వివాహానికి హాజరైన ఆయన, ప్రచార సమయంలో ఇచ్చిన మాట ప్రకారం రూ.25,000 నగదును ఆడబిడ్డ కట్నంగా అందజేశారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే తన ధ్యేయమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా హామీని అమలు చేశామన్నారు.

February 21, 2026 / 08:17 AM IST

అధికారులు సమన్వయంతో కృషి చేయాలని: కలెక్టర్

SRD: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి అధికారులు సమన్వయంతో కృషి చేయాలని కలెక్టర్ పీ.ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. ఆమె మాట్లాడుతూ.. అంగన్వాడీ కేంద్రాల్లో అభివృద్ధి పనులను వేగవంతం చేయడానికి అధికారులు-ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయం పెంపొందించాలన్నారు.

February 21, 2026 / 08:14 AM IST

ఆందోళన కలిగిస్తున్న మరణాలు..!

NLG: జిల్లాలో శుక్రవారం విషాదం నిండిన రోజుగా మిగిలింది. వేర్వేరు ఘటనల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మామిడాలలో అప్పుల బాధతో సంతోష్ ఉరివేసుకోగా, తిట్టకుంటలో మానసిక స్థితి సరిగా లేక నర్సమ్మ నిప్పంటించుకుని మృతి చెందింది. నకిరేకల్‌లో గీత కార్మికుడు వెంకటేశం చెట్టుపై నుంచి పడి, మండలాపురంలో తల్లిదండ్రులు మందలించారని మహేష్ గడ్డిమందు తాగి మృతి చెందాడు.

February 21, 2026 / 08:14 AM IST