• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

బీజేపీ సంస్థాగత నియామకాలు

MNCL: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్‌లో బీజేపీ సంస్థాగత నియామకాలు చేశారు. శుక్రవారం బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ వారికి బాధ్యతలు అప్పగించారు. బీసీ మోర్చా అధ్యక్షులుగా నల్ల రవి, ఎస్సీ మోర్చా అధ్యక్షులుగా ముల్కల్ల కుమార్, బీసీ మోర్చా అధ్యక్షులుగా నాంపల్లి శ్రీనివాస్, మహిళా మోర్చా అధ్యక్ష కార్యదర్శులుగా బైరం లక్ష్మి, అంకం సంగీత నియమితులయ్యారు.

February 20, 2026 / 08:13 PM IST

మెరుగైన సేవలకై జలమండలి.. బస్తీబాట

RR: ప్రజల నుంచి నేరుగా సమస్యలు తెలుసుకునే విధంగా జలమండలి బస్తీబాట ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. జలమండలి ఎండి అశోక్ రెడ్డి శేరిలింగంపల్లి వార్డులోని శంకర్ నగర్‌లో పర్యటించారు. నీటి సరఫరా సమయంలో పలు ఇళ్లలో తనిఖీలు చేసి నీటి నాణ్యతను పరిశీలించారు. రూఫ్ వాటర్, వాన నీటిని భూమిలోకి ఇంకించే విధంగా ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని ప్రజలకు తెలిపారు.

February 20, 2026 / 08:12 PM IST

మంత్రిని కలిసిన టీఎన్జీవో కార్యవర్గం

NRPT: జిల్లా టీఎన్జీవో (TNGO) యూనియన్ నూతన కార్యవర్గ సభ్యులు మంత్రి వాకిటి శ్రీహరిని ఆయన క్యాంప్ కార్యాలయంలో కలిశారు. జిల్లా అధ్యక్షుడు నరసింహరెడ్డి మంత్రికి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో తొలిసారిగా యూనియన్ ఏర్పాటు కావడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేస్తూ, కార్యవర్గ సభ్యులను శాలువాతో సన్మానించారు.

February 20, 2026 / 08:12 PM IST

‘సేవాలాల్ బోధనలు సమాజానికి మార్గదర్శకం’

JGL: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ ప్రభుత్వం గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సేవాలాల్ బోధనలు గిరిజన సమాజానికి మార్గదర్శకమని పేర్కొన్నారు.

February 20, 2026 / 08:11 PM IST

బొల్లారం రైల్వే స్టేషన్‌ను సందర్శించిన ఎంపీ

MDCL: మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ శుక్రవారం అల్వాల్ పట్టణ పరిధిలోని బొల్లారం రైల్వే స్టేషన్‌ను సందర్శించారు. నిజామాబాద్–రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌కు బొల్లారం స్టేషన్‌లో నిలుపుదల కల్పించామని తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక బీజేపీ నాయకులు విశాఖ ఎక్స్‌ప్రెస్, నాగావళి ఎక్స్‌ప్రెస్, నాగర్‌సోల్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు కూడా హాల్ట్ ఇవ్వాలని కోరారు.

February 20, 2026 / 08:09 PM IST

పెండింగ్ కేసులపై దృష్టి సారించాలి: ఎస్పీ

VKB: పెండింగ్ కేసులపై దృష్టి సారించాలని ఎస్పీ స్నేహ మెహ్రా తెలిపారు. శుక్రవారం జిల్లా కార్యాలయంలో పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కేసుల దర్యాప్తులో జాప్యం లేకుండా వేగవంతంగా విచారణ పూర్తి చేయాలని తెలిపారు. బాధితులకు సత్వరమే న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

February 20, 2026 / 08:08 PM IST

‘సేవాలాల్ మహారాజ్ ఆదర్శప్రాయుడు’

MDK: దేశ ప్రజలకు సేవలాల్ మహారాజ్ ఆదర్శప్రాయుడని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, అదునపు కలెక్టర్ నగేష్ పేర్కొన్నారు. నర్సాపూర్ పట్టణంలో సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి పురస్కరించుకొని ర్యాలీ నిర్వహించారు. గిరిజన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడి వారి ఔన్నత్యానికి పునాదులు వేశారని సేవాలాల్ మహారాజును కొనియాడారు. ఆయన ఆధ్యాత్మిక మార్గంలో ప్రతీ ఒక్కరు నడవాలన్నారు.

February 20, 2026 / 08:07 PM IST

భూత్పూర్ మున్సిపాలిటీ కొత్త ఛైర్మన్

MBNR: భూత్పూర్ మున్సిపాలిటీ కొత్త ఛైర్మన్‌గా బాలకోటి మున్సిపల్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. మున్సిపాలిటీని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తానని, వార్డుల సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తానని.. సీసీ రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ వంటి మౌలిక వసతుల కల్పనకు కౌన్సిలర్ల సహకారంతో కృషి చేస్తానని చెప్పారు.

February 20, 2026 / 08:07 PM IST

‘సంక్షేమ పథకాలు ప్రజలకు చేరడంలో సోషల్ మీడియా పాత్ర కీలకం’

BDK: మణుగూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోషల్ మీడియా యువజన కాంగ్రెస్ నాయకుల ఆత్మీయ సమావేశం శుక్రవారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పాల్గొని మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి పనులను సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడంలో సోషల్ మీడియా పాత్ర కీలకమని పేర్కొన్నారు. యువజన శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు.

February 20, 2026 / 08:07 PM IST

హోరా హోరీగా పోలీస్ క్రీడలు

HYD: సైబరాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో జరుగుతున్న 4వ తెలంగాణ రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్&గేమ్స్‌ మీట్-2026 3వ రోజూ అత్యంత ఉత్సాహభరితంగా కొనసాగింది. వివిధ జిల్లాలు, జోన్లు, కమిషనరేట్లు,స్పెషల్ ఫోర్సెస్ నుంచి తరలివచ్చిన వందలాది మంది పోలీస్ అథ్లెట్లు తమ క్రీడా నైపుణ్యంతో మైదానాన్ని హోరెత్తించారు. వాలీబాల్, కబడ్డీ వంటి ప్రధాన విభాగాలలో గెలుపే లక్ష్యంగా పోటీపడ్డారు.

February 20, 2026 / 08:04 PM IST

‘భరోసా’ సెంటర్ ఇన్‌ఛార్జ్‌గా ఎస్సై శ్రావంతి

కామారెడ్డిలోని ‘భరోసా’ సెంటర్ నిర్వహణ బాధ్యతలను మహిళా ఎస్సై శ్రావంతికి అప్పగిస్తూ జిల్లా పోలీస్ కార్యాలయం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఇక్కడ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న మహిళా ఎస్సై జి. జ్యోతి అనారోగ్య కారణాల వల్ల సెలవులో ఉన్న నేపథ్యంలో, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఈ నిర్ణయం తీసుకున్నారు. బాధితులకు అందుతున్న సేవలకు అంతరాయం కలగకుండా చూడాలన్నారు.

February 20, 2026 / 08:03 PM IST

ఇచ్చిన హామీని నెరవేర్చిన కౌన్సిలర్

NLG: చిట్యాల మున్సిపాలిటీ 10వ వార్డు కౌన్సిలర్ నిమ్మనగోటి శ్రీనివాస్ తాను ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేరుస్తూ ఆదర్శంగా నిలిచారు. ఇటీవలి మున్సిపల్ ఎన్నికల వేళ తన వార్డులోని ప్రతి పేద ఇంటి ఆడబిడ్డ వివాహానికి రూ. 10,016లు ఆర్థిక సాయం అందిస్తానని వాగ్దానం చేశారు. అంబేద్కర్ నగర్‌కు చెందిన సుంకరి రాజేశ్వరి వివాహనికి ఇవాళ హాజరై, ఆ నగదును అందించారు.

February 20, 2026 / 08:03 PM IST

పకృతి వ్యవసాయంపై దృష్టి సారించాలి: MAO

SRCL: రైతులు పకృతి వ్యవసాయంపై దృష్టి సారించాలని మండల వ్యవసాయ శాఖ అధికారి దుర్గరాజు అన్నారు. చందుర్తి మండలం తిమ్మాపూర్ గ్రామంలో గ్రామపంచాయతీ లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నేషనల్ మిషన్ ఆన్ నాచురల్ ఫార్మింగ్, ప్రకృతి వ్యవసాయం పైన అవగాహన, దిశ నిర్దేశం కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. దుర్గరాజు మాట్లాడుతూ.. రైతులు పంటల సాగులో రసాయనాలను తగ్గించాలన్నారు.

February 20, 2026 / 08:02 PM IST

యాదాద్రి దేవస్థానం నేటి ఆదాయ వివరాలు

BHNG: శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఖజానాకు శుక్రవారం రూ.20,47,905 ఆదాయం సమకూరినట్లు ఆలయ EO భవాని శంకర్ వెల్లడించారు. అందులో భాగంగా ప్రసాద విక్రయాలతో రూ.6,55,700, లీజులతో రూ.5,35,400, కార్ పార్కింగ్‌తో రూ.2,27,000, VIP దర్శనాలతో రూ.1,50,000, బ్రేక్ దర్శనాలతో రూ.1,02,900, వ్రతాలతో రూ.1,01,000, కళ్యాణకట్ట రూ.49,000, తదితర విభాగాల నుంచి ఆదాయం వచ్చింది.

February 20, 2026 / 08:02 PM IST

కవి రాజుకు ప్రతిభా పురస్కారం

SRCL: చందుర్తి మండలం నర్సింగాపూర్ గ్రామం చెందిన ఆర్మీ అధికారి, జాతీయ కవి, రచయిత, అనువాదకుడు డా. పెరుక రాజు సాహిత్యంలో చేస్తున్న విశిష్ట కృషికి ప్రతిష్ఠాత్మకమైన విశిష్ట సాహితీ ప్రతిభా పురస్కారం 2026ను హైదరాబాద్‌లో రవీంద్రభారతిలో శుక్రవారం అందుకున్నారు. ఆయన చేస్తున్న అవిరళ విశిష్ట సాహిత్య ప్రతిభకు గుర్తింపుగా పురస్కారం ప్రదానం చేశారు.

February 20, 2026 / 08:02 PM IST