CTR: కుప్పం రూరల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ మల్లేష్ యాదవ్, తన సిబ్బందితో కలిసి కుప్పం ప్రభుత్వ డిగ్రీ కళాశాలను సందర్శించారు. క్రమశిక్షణ, నైతిక విలువలను బలోపేతం చేయడం, లక్ష్య సాధనకు ప్రేరణ, సైబర్ అవగాహన, మాదకద్రవ్యాల దుర్వినియోగంపై మార్గ నిర్దేశం చేశారు. యువత చదువు పట్ల బాధ్యతాయుతమైన ప్రవర్తనలు కలిగి ఉండాలని నొక్కి చెప్పారు.
యువ ఓపెనర్ అభిషేక్ శర్మకు టీమిండియా బౌలింగ్ కోచ్ పూర్తి మద్దతు ప్రకటించాడు. అభిషేక్ ఫామ్‌పై జట్టులో ఎలాంటి ఆందోళన లేదని చెప్పాడు. అతని సామర్థ్యంపై తమకు పూర్తి నమ్మకం ఉందని స్పష్టం చేశాడు. ప్రస్తుతం అభిషేక్ నెట్స్‌లో కఠినంగా శ్రమిస్తున్నాడని, త్వరలోనే అతను భారీ స్కోర్లతో ఫామ్‌లోకి వస్తాడని కోచ్ ఆశాభావం వ్యక్తం చేశాడు.
CTR: పాలసముద్రంలోని అరుణోదయం ఇంగ్లీష్ మీడియం పాఠశాలను ఎస్సై రాజశేఖర్ రెడ్డి సందర్శించి విద్యార్థులతో సంభాషించారు. పోక్సో చట్టం శిక్షలు, పొగాకు వాడకం యొక్క ప్రభావాలు, మాదకద్రవ్యాలు ధైర్య స్పర్శ కార్యక్రమం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. విద్యార్థులు సైబర్ మోసాలకు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు.
W.G: చేనేత రంగాన్ని కాపాడుకోవడానికి, నేతన్నల న్యాయమైన డిమాండ్ల సాధనకై ఈ నెల 22న మంగళగిరిలో నిర్వహించ తలపెట్టిన చేనేత గర్జనను విజయవంతం చేయాలని చేనేత సంఘాల నేతలు పిలుపునిచ్చారు. చేనేత సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో మంగళగిరి నేతన్న సర్కిల్ వద్ద ఈ భారీ బహిరంగ సభ జరగనుంది. దీనిలో భాగంగా శుక్రవారం నరసాపురం 25వ వార్డు వీవర్స్ కాలనీలో నేతలు పర్యటించారు.
AP: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి కోవూరు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈనెల 24న రూరల్ డీఎస్పీ ఆఫీస్‌లో విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఇప్పటికే రెండు దఫాలుగా విచారణ వాయిదా పడింది. కాగా గుమ్మలదిన్నెలో బాలిక మృతిపై నిరాధార ఆరోపణలు చేసిన కేసులో ఆయనను విచారించనున్నారు.
రామన్నపేట మండలంలో డీలర్ల వద్ద కొన్న యూరియా నకిలీదంటూ కొమ్మాయిగూడెం రైతులు ఆరోపించారు. ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకున్న 6 బస్తాలలో 3 తెరిచి చూడగా నల్లటి మట్టి పెళ్లల వంటివి కనిపించాయని, బరువు కూడా తక్కువగా ఉందని నరసింహ, గణేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎరువుల కొరతతో ఇబ్బందులు పడుతుంటే, కల్తీ యూరియాతో మోసం చేస్తున్నారని వాపోయారు.
BDK: మణుగూరు గిరిజన సంక్షేమ గురుకుల బాలుర డిగ్రీ కళాశాల 2026-27 ప్రవేశాల పోస్టర్‌ను ట్రైనీ ఐఏఎస్ సౌరభ్ శర్మ ఆవిష్కరించారు. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. కళాశాలలో ఉచిత విద్య, వసతి, భోజనం వంటి సౌకర్యాలు కల్పించబడతాయి.
MNCL: బెల్లంపల్లి ఏరియా GM కార్యాలయంలో GM స్ట్రక్చర్ కమిటీ సమావేశం శుక్రవారం నిర్వహించారు. సమావేశానికి ఏరియా GM విజయభాస్కర్ రెడ్డి అధ్యక్షత వహించారు. సమావేశంలో AITUC ప్రతినిధులు కార్మికుల సమస్యలను యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు. ప్రతినిధులు లేవనెత్తిన సమస్యలపై GM సానుకూలంగా స్పందించి, నిబంధనల ప్రకారం పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేస్తానన్నారు.
WNP: రంజాన్ పవిత్ర మాసం ప్రారంభమైన నేపథ్యంలో ముస్లిం సోదరులు ఉపవాస దీక్షలు (రోజులు) చేపడుతున్నారు. ప్రార్థనల సమయంలో విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా చూడాలని కోరుతూ 8 వ వార్డు కౌన్సిలర్ బుసిరెడ్డి శివప్రసాద్ రెడ్డి విద్యుత్ సబ్ ఇంజనీర్‌కు వినతిపత్రం అందజేశారు. ముఖ్యంగా సెహ్రీ, ఇఫ్తార్ సమయాల్లో నిరంతర విద్యుత్ అందించాలని కోరారు.
ASF: ఈనెల 17న ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం జరిగిన రాష్ట్రస్థాయి క్రీడా పోటీల్లో ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన దివ్యాంగ విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. ఈ సందర్భంగా శుక్రవారం కలెక్టర్ హరిత విద్యార్థులను అభినందించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. తమ శారీరక పరిమితులను అధిగమిస్తూ పోటీల్లో పాల్గొని విజయాలు సాధించడం ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలుస్తుందన్నారు.
SDPT: ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్‌పై జిల్లా కలెక్టర్ హైమావతి జూమ్ సమావేశంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. మండలాల వారీగా మంజూరు, గ్రౌండింగ్, నిర్మాణ దశల వివరాలు తెలుసుకున్నారు. ప్రతి ఇల్లు గ్రౌండింగ్ కావాలని ఎంపీడీవోలు ప్రణాళికతో పర్యవేక్షించాలని ఆదేశించారు. లబ్ధిదారుల ఖాతాల్లోనే నిధులు జమవుతాయని స్పష్టం చేశారు.
గుంటూరు తూర్పు నియోజకవర్గంలో చేపట్టబోయే అభివృద్ధి పనులకు వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్ మున్సిపల్ అధికారులకు సూచించారు. స్థానిక కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఇప్పటి వరకు జరిగిన పనుల పురోగతిని ఆయన ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
TG: ఖమ్మం జిల్లాకు చెందిన విశ్రాంత AR SI మైసయ్య రిటైర్మెంట్ బకాయిలు అందక, ఆసుపత్రి ఖర్చులకు డబ్బుల్లేక ప్రాణాలు కోల్పోవడం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. జీవితకాలం ప్రజల రక్షణ కోసం అహర్నిశలు శ్రమించిన ఒక పోలీస్ అధికారి దుస్థితికి కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
MNCL: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్‌లో బీజేపీ సంస్థాగత నియామకాలు చేశారు. శుక్రవారం బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ వారికి బాధ్యతలు అప్పగించారు. బీసీ మోర్చా అధ్యక్షులుగా నల్ల రవి, ఎస్సీ మోర్చా అధ్యక్షులుగా ముల్కల్ల కుమార్, బీసీ మోర్చా అధ్యక్షులుగా నాంపల్లి శ్రీనివాస్, మహిళా మోర్చా అధ్యక్ష కార్యదర్శులుగా బైరం లక్ష్మి, అంకం సంగీత నియమితులయ్యారు.
W.G: సమాజంలో శాంతి, భద్రత, శ్రేయస్సు వర్ధిల్లాలంటే సామాజిక న్యాయం ఎంతో అవసరమని లీగల్ సర్వీసెస్ సభ్యులు వై.డి. ఫణికర్, ప్యానెల్ లాయర్ కె. శిరీష పేర్కొన్నారు. శుక్రవారం ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం సందర్భంగా లింగబోయిన చర్ల గ్రామ సచివాలయం వద్ద న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ప్రస్తుత కాలంలో పిల్లలు సోషల్ మీడియా మోసాలకు గురయ్యే ప్రమాదం ఉందని తెలిపారు.