• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

త్రికోటేశ్వరస్వామిని దర్శించుకున్న మంత్రి

PLD: కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామి ఆలయాన్ని రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్ శనివారం సందర్శించారు. శ్రీ త్రికోటేశ్వరస్వామి వారిని దర్శించుకుని, ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు, దేవస్థాన అర్చకులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు.

February 21, 2026 / 02:51 PM IST

రోడ్లపై వాహనాల నిలిపివేత.. స్థానికుల ఇబ్బందులు

ఎన్టీఆర్: కంచికచర్లలోని చెవిటికల్లు సెంటర్, నెహ్రూ సెంటర్, జుజ్జూరు రోడ్డు సెంటర్‌లో రోజురోజుకు ట్రాఫిక్ సమస్య అధికమవుతుందని స్థానికులు, వాహనదారులు వాపోతున్నారు. ఆటోవాలాలు ఇష్టాను సారంగా రోడ్లపై వాహనాలను నిలిపి ఉంచడంతో మిగిలిన వాహనదారులు గందరగోళానికి గురవుతున్నామంటున్నారు. అధికారులు స్పందించి ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

February 21, 2026 / 02:51 PM IST

గ్రామస్తులతో మంత్రి ముఖాముఖి

NGKL: కొల్లాపూర్ మండలం అంకిరావుపల్లిలో మంత్రి జూపాలి కృష్ణారావు గ్రామస్తులతో ముఖాముఖి నిర్వహించారు. గ్రామస్థాయిలో విద్య, వైద్యం, విద్యుత్ సరఫరా, ఆర్టీసీ బస్సుల సౌకర్యాం వంటి వసతులపై గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందాలని, పెండింగ్‌లో ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

February 21, 2026 / 02:50 PM IST

పేదల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే

JGL: పేదల సొంతింటి కల నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల మండలంలోని హనుమాజీపేట గ్రామంలో బొడ్డు మౌనిక-సురేశ్‌ల ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా వారిని అభినందించారు. సర్పంచ్ బొడ్డు దామోదర్, అంజా గౌడ్, నక్క సతీశ్ పాల్గొన్నారు.

February 21, 2026 / 02:49 PM IST

సమాచార శాఖలో స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమం

VSP: ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతీ నెల మూడవ శనివారం నిర్వహించే స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో ‘జీరో–వేస్ట్ లిట్టర్ గవర్నెన్స్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఉదయం 9 గంటల నుంచి కార్యాలయ ప్రాంగణం, పరిసర ప్రాంతాలను శుభ్రపరిచారు.

February 21, 2026 / 02:49 PM IST

దేశంలో ఏపీనే నెంబర్ వన్: చంద్రబాబు

AP: టెక్నాలజీ వినియోగంలో దేశంలో ఏపీనే నెంబర్ వన్ అని సీఎం చంద్రబాబు అన్నారు. వ్యవసాయంలోనూ AI సేవలు అందుబాటులోకి తెస్తున్నామని తెలిపారు. రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా చేస్తామన్నారు. స్త్రీశక్తి, దీపం పథకం అమలు చేస్తున్నామని వెల్లడించారు. పేదల ఆదాయం పెంచేందుకు పీ4 పథకం తీసుకువస్తున్నామని చెప్పారు.

February 21, 2026 / 02:48 PM IST

భారత్-పాక్ మ్యాచ్.. కళ్లు చెదిరే రికార్డు

T20 ప్రపంచకప్ గ్రూప్ దశలో భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ కళ్లు చెదిరే రికార్డును నెలకొల్పింది. జియోస్టార్ తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. కేవలం ఆన్‌లైన్ స్ట్రీమింగ్‌లోనే ఏకంగా 163 మిలియన్ల (16.3 కోట్లు) వ్యూస్ నమోదయ్యాయి. ఇది 2024 టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ కంటే కూడా అత్యధికం. దీంతో ఈ మ్యాచ్ బ్రాడ్‌కాస్టర్లకు కాసుల వర్షం కురిపించింది.

February 21, 2026 / 02:48 PM IST

‘విశ్వంభర’ విడుదలపై సందిగ్ధత

మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ సినిమా విడుదలపై సందిగ్ధత నెలకొంది. 2026 సమ్మర్ రిలీజ్ అని చిరు స్వయంగా చెప్పినా, భారీ VFX పనుల వల్ల జాప్యం జరుగుతోంది. మరోవైపు ఆలస్యంగా మొదలైన ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఇప్పటికే విడుదలై రూ.300 కోట్లకు పైగా వసూళ్లతో ఇండస్ట్రీ హిట్ కొట్టింది. దీంతో పెండింగ్‌లో ఉన్న ‘విశ్వంభర’ ఓటీటీ డీల్, విడుదల తేదీపై మెగా ఫ్యాన్స్ ఆందోళన చెంద...

February 21, 2026 / 02:47 PM IST

ఖానంపల్లిలో అంగన్వాడి సేవలపై అధికారులు దృష్టి

PDPL: ధర్మారం మండలం ఖానంపల్లి గ్రామంలోని అంగన్వాడి కేంద్రంలో శనివారం చిన్నారులు, గర్భిణీలకు అందిస్తున్న పౌష్టికాహారం, కోడిగుడ్లు, బలామృతం పంపిణీని పరిశీలించారు. సర్పంచ్ కాల్వ సుగుణ–మల్లయ్య, ఉపసర్పంచ్ బెజ్జెంకి యమున–రాజేందర్ సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి సతీష్, వార్డు సభ్యులు, అంగన్వాడి టీచర్లు పాల్గొన్నారు.

February 21, 2026 / 02:45 PM IST

యాదగిరిగుట్టలో వైభవంగా బ్రహ్మోత్సవాలు

TG: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ రోజు స్వామి వారిని ముస్తాబు చేసే పర్వంలో వటపత్ర శయన అలంకృతుడిగా తీర్చిదిద్దారు. అనంతరం మాడవీధులలో తీర్థజనుల దర్శనార్థం స్వామివారిని ఊరేగించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి దివ్య దర్శనం పొందారు.

February 21, 2026 / 02:45 PM IST

రసాయన ఎరువులు మోతాదులో వాడాలి: ఎమ్మెల్యే

WGL: రసాయన ఎరువులను తగు మోతాదులోనే వాడాలని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి రైతులకు సూచించారు. నల్లబెల్లి మండల కేంద్రంలోని కొండయిలపల్లి గ్రామంలో మిర్చి రైతులకు ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. అధిక రసాయనులు వాడడం వలన పంట దిగుబడి సరిగ్గా రాదని పేర్కొన్నారు. రైతులు రసాయన ఎరువులు తగ్గించాలని కోరారు.

February 21, 2026 / 02:45 PM IST

బాధిత కుటుంబానికి రూ.3 లక్షల ఎల్‌వోసీ అందజేత

జనగామ మండలం వెంకిర్యాల గ్రామానికి తాళ్లపల్లి నరసింహులు వేరికోసిల్ (కాళ్ల నరాల) సంబంధిత వ్యాధితో బాధ పడుతూ అనారోగ్యానికి గురయ్యారు. చికిత్స కోసం పెద్ద మొత్తంలో డబ్బులు అవసరం పడగా విషయాన్ని కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు నాగపురి కిరణ్ కుమార్ గౌడ్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన వారు రూ.2 లక్షల LOCని మంజూరు చేయించి, నేడు అందజేశారు.

February 21, 2026 / 02:45 PM IST

రాష్ట్రస్థాయి యోగాసనా పోటీలకు విద్యార్థులు ఎంపిక

కామారెడ్డి: జిల్లా నుంచి 11 మంది విద్యార్థులు రాష్ట్రస్థాయి యోగాసనా పోటీలకు ఎంపికయ్యారని జిల్లా యువజన స్పోర్ట్స్ అధికారి శ్రీరంగ వేంకటేశ్వర్ గౌడ్ తెలిపారు. ఈ యోగాసనా పోటీలు నేటి నుంచి 23 వరకు రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ స్టేడియంలో జరగనున్నాయని తెలిపారు. కామారెడ్డి జిల్లాకు స్వర్ణ, రజక పతకాలు తీసుకురావాలని ఆయన కోరారు.

February 21, 2026 / 02:43 PM IST

పల్నాడు వస్తే వైబ్రేషన్స్ వస్తాయి: చంద్రబాబు

AP: పల్నాడు అంటే పౌరుషాల గడ్డ అని సీఎం చంద్రబాబు తెలిపారు. పల్నాడు వస్తే వైబ్రేషన్స్ వస్తాయని అన్నారు. శివరాత్రి అంటే కోటప్పకొండ ప్రభలు ప్రత్యేకమన్నారు. ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో పెను మార్పులు తీసుకురాబోతోందని చెప్పారు. సూపర్ సిక్స్.. సూపర్ హిట్ అని వెల్లడించారు. తాను సీఎం అయ్యే నాటికి 108 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త పేరుకుపోయిందని పేర్కొన్నారు.

February 21, 2026 / 02:42 PM IST

‘స్వచ్ఛ ఆంధ్ర- స్వర్ణ ఆంధ్రగా’ తీర్చిదిద్దేటట్లు కృషి: MLA

E.G: కొవ్వూరులో శనివారం జరిగిన ‘స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర’ కార్యక్రమంలో కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా భవిష్యత్ తరాలకు ఆరోగ్యవంతమైన ఆంధ్ర రాష్ట్రాన్ని నిర్మించి స్వచ్ఛ ఆంధ్ర- స్వర్ణ ఆంధ్రగా తీర్చిదిద్దేటట్లు కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

February 21, 2026 / 02:42 PM IST