ఎన్టీఆర్: దేవుడు చిత్రపటాలు రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవటం అత్యంత దుర్మార్గమని ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ మండిపడ్డారు. ఈ సందర్భంగా విజయవాడ గురునానక్ కాలనీ ఎంపీ కేశినేని చిన్ని కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, పలువురు నాయకులు పాల్గొన్నారు.
TG: చంచల్‌గూడ జైల్లో ఇటీవల నిర్వహించిన ములాఖత్‌లో పేలుళ్లకు ప్లాన్ రచించినట్లుగా నిఘావర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు వస్తున్న వార్తలను జైళ్లశాఖ డీజీ సౌమ్య మిశ్రా ఖండించారు. ఉగ్రకుట్రకు ప్లాన్ చేస్తున్నారని వస్తున్న వార్తల్లో నిజంలేదని, అదంతా అవాస్తవమని స్పష్టం చేశారు. ఈ అసత్య వార్తలను కొన్ని ఛానళ్లు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు.
HYD: చంచల్‌గూడ జైలు కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీ HYDలో ఉగ్ర కుట్రకు మాస్టర్ మైండ్ వ్యవహరించినట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. జైలు నిబంధనల ప్రకారం లభించే ‘ములాకత్’ సమయాన్ని ఉపయోగించుకుని, బయట ఉన్న తన అనుచరులకు రహస్యంగా ఆదేశాలు పంపినట్లు దర్యాప్తులో తేలింది. ఈ ఆపరేషన్లో భాగంగా పోలీసులు ముగ్గురు కీలక నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
MDK: చేగుంట మండలంల వడియారం ప్రాథమిక పాఠశాలలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. మాతృభాషలో చదువుకున్నప్పుడే విషయాన్ని పూర్తిగా అవగాహన చేసుకోవడం సులువు అవుతుందని, మాతృభాష పట్ల ప్రతి ఒక్కరు మమకారం పెంచుకోవాలని పాఠశాల హెచ్ఎం సిద్ధిరాములు కోరారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
సత్యసాయి: పరిగి మండలంలో స్వచ్ఛ రథాన్ని శనివారం ప్రారంభించారు. గ్రామాల్లో పరిశుభ్రత, పారిశుధ్యంపై అవగాహన, చెత్త వర్గీకరణ, ప్లాస్టిక్ నిర్మూలనపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు ఈ స్వచ్ఛ రథాన్ని ప్రవేశపెట్టినట్లు టీడీపీ కన్వీనర్ గోవింద్ రెడ్డి తెలిపారు. ప్రజలు వేస్ట్ ప్లాస్టిక్ వస్తువులు ఈ వాహనానికి అందిస్తే నిత్యవసర వస్తువులు అందిస్తారని తెలిపారు.
ATP: రాయదుర్గం మున్సిపాలిటీకి సంబంధించి వైసీపీ పార్టీ యూత్ వింగ్ ఉపాధ్యక్షుడిగా తోట రాజును ఎన్నుకున్నట్లు నియోజకవర్గ సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి తెలిపారు. తనపై నమ్మకం ఉంచి గొప్ప బాధ్యతలు అప్పగించిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి, నియోజకవర్గ సమన్వకర్త మెట్టు గోవిందరెడ్డికి, వార్డు కౌన్సిలర్ సంజీవప్పకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ఢిల్లీలో జరిగిన ఏఐ సమ్మిట్ సందర్భంగా ఆందోళన చేపట్టిన యూత్ కాంగ్రెస్ కార్యకర్తలపై పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ కేసులో అరెస్టయిన నలుగురు నిందితులకు పాటియాల హౌస్ కోర్టు ఐదు రోజుల పోలీస్ కస్టడీ విధించింది. నిందితులను విచారించేందుకు పోలీసుల అభ్యర్థన మేరకు న్యాయస్థానం ఈ అనుమతిని ఇచ్చింది.
BDK: అశ్వాపురం సీఐ అశోక్ రెడ్డి మణుగూరు నుంచి మొరంపల్లి బంజరకు వెళ్తున్న పశువుల వ్యాన్‌ను అడ్డగించి, అక్రమంగా రవాణా చేస్తున్న పశువులను పట్టుకున్నారు. శనివారం తెల్లవారుజామున అశ్వాపురం టీడీపీ సెంటర్ వద్ద మణుగూరు నుంచి మొరంపల్లి బంజరకు వాహనమునందు బంధించి తరలిస్తున్న 12 పశువులను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.
KMR: జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అమలు చేయబడుతున్న“టెస్ట్ ఆవేలేబుల్ స్కూల్స్”పథకం కింద 2026-27 విద్యా సంవత్సరానికి గాను ప్రైవేట్ ఆంగ్ల మాధ్యమ పాఠశాలల నుండి ప్రతిపాదనలు కోరుతున్నట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి పి. వెంకటేష్ తెలిపారు. జిల్లాలో ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
TPT: స్వచ్ఛంద్ర–స్వర్ణాంధ్ర సాధన లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తెలిపారు. శనివారం పిచ్చాటూరు ఆర్టీసీ బస్టాండ్‌లో స్వచ్ఛ రథాన్ని ఆయన ప్రారంభించారు. ప్రజలు వినియోగించిన ప్లాస్టిక్, గాజు సీసాలను రథానికి అందిస్తే నిత్యావసర వస్తువులు ఉచితంగా పొందవచ్చని అన్నారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
SRPT: కోదాడ మున్సిపాలిటీ పరిధిలో గల 35 వార్డులలో అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ, మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డితోనే సాధ్యం అవుతుందని మున్సిపల్ ఛైర్ పర్సన్ ఎర్నేని కుసుమ బాబు అన్నారు. శనివారం కోదాడ పట్టణ పరిధిలోని కేఎల్ఆర్ కాలనీవాసులు నూతనంగా ఎన్నికైన ఛైర్ పర్సన్ ఎర్నేని కుసుమ బాబును సన్మానించారు.
SRPT: ఇంటర్ పరీక్షల నేపథ్యంలో విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా పరీక్షా కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలని PDSU జిల్లా ప్రధాన కార్యదర్శి పిడమర్తి భరత్ డిమాండ్ చేశారు. శనివారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్రాల్లో తాగునీరు, బెంచీలు, ఫ్యాన్లు ఏర్పాటు చేయాలన్నారు. ఫీజుల పేరుతో హాల్ టికెట్లు ఆపవద్దని కోరారు.
AP: పల్నాడు జిల్లా వినుకొండలో సీఎం చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా స్వచ్ఛ రథాలను ఆయన ప్రారంభించారు. ప్రతి మండలానికి ఒక స్వచ్ఛరథం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పాత వస్తువులు ఇస్తే బదులుగా నిత్యావసరాలు ఇస్తామన్నారు. ప్రజలకు స్వచ్ఛమైన గాలి, నీరు ఇవ్వాలనేదే తన ఆలోచన అని పేర్కొన్నారు. ప్రతి ఇంటి దగ్గరకు వచ్చి చెత్తను సేకరిస్తామని వెల్లడించారు.
VSP: యెద్దుల వెంకటరమణ రెడ్డికి చెందిన శాన్విరా ఇండస్ట్రీ లిమిటెడ్ గోడౌన్‌ను అధికారులు సీజ్ చేశారు. జీవీఎంసీకి సుమారు రూ.1.90 కోట్లు ఆస్తి పన్ను బకాయి ఉన్నట్లు గుర్తించిన అధికారులు ముందుగా నోటీసులు జారీ చేశారు. అయితే సంబంధిత సంస్థ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో శనివారం రెవెన్యూ అధికారి రామ్ నారాయణ ఆధ్వర్యంలో ఆచ్ఐలు శివ, రెడ్డి మోహన్ పాల్గొన్నారు.
CTR: రొంపిచర్ల మండలం బొమ్మయ్యగారి పల్లెలో స్వచ్ఛ రథాన్ని పుంగనూరు టీడీపీ ఇన్‌ఛార్జ్ చల్లా బాబు రెడ్డి ప్రారంభించారు. తడి చెత్త, పొడి చెత్త సేకరించిన వాహనాన్ని డంపింగ్ యార్డ్ వరకు నడిపారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతామని అందరి చేత ప్రమాణం చేయించారు. కార్యక్రమంలో ఎంపీడీవో మధుసూదన్ రెడ్డి, రాష్ట్ర కురబ కార్పొరేషన్ డైరెక్టర్ ఉయ్యాల రమణ పాల్గొన్నారు.