• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘ఆలయాల అభివృద్ధికి పాలకమండళ్లు కృషిచేయాలి’

కోనసీమ: ఆలయాల అభివృద్ధికి పాలకమండళ్లు విశేషంగా కృషి చేయాలని కొత్తపేట జనసేన ఇన్‌ఛార్జ్ బండారు శ్రీనివాస్ సూచించారు. శుక్రవారం రావులపాలెం మండలం లక్ష్మిపోలవరం గ్రామంలో శ్రీ మదన గోపాలస్వామి వారి ఆలయ నూతన ధర్మకర్తల ప్రమాణస్వీకారం మహోత్సవంలో ఆయన పాల్గొన్నారు. పాలకమండలి సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు.

February 20, 2026 / 08:00 PM IST

కొంతమూరులో నడిరోడ్డుపై మూగజీవుల సంచారం

E.G: రాజమండ్రి రూరల్ కొంతమూరులో నడి రోడ్డుపై మూగజీవులు సంచారం చేస్తున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. శుక్రవారం రాత్రి ఆవులు ప్రమాదకరంగా నడిరోడ్డుపై తిష్ట వేయడంతో వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు. ఎయిర్పోర్ట్, కోరుకొండ ప్రధాన రహదారి కావడంతో నిత్యం వందలాది వాహనాలు తిరుగుతాయి. ఎటువంటి ప్రమాదాలు జరుగగా ముందే నియంత్రణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

February 20, 2026 / 08:00 PM IST

ఈనెల 21న రాష్ట్రస్థాయి రాతి దూలం లాగుడు పోటీలు

ATP: గార్లదిన్నె మండలంలో సింగరప్ప స్వామి తిరునాల సందర్భంగా ఈనెల 21, 22 తేదీల్లో రాష్ట్రస్థాయి రాతిదూలం లాగుడు పోటీలు జరుగుతాయని గ్రామస్తుల శుక్రవారం తెలిపారు. గ్రామస్తులు మాట్లాడుతూ.. ఈనెల 21న న్యూ కేటగిరి విభాగానికి పోటీలు ఉండగా, 22న సీనియర్ కేటగిరి విభాగానికి పోటీలు జరుగుతాయన్నారు. గెలుపొందిన వారికి బహుమతులను అందజేస్తామన్నారు.

February 20, 2026 / 08:00 PM IST

ఈనెల 23న మెగా జాబ్ మేళా

KKD: కాకినాడ కలెక్టరేట్లోని వికాస కార్యాలయంలో ఈనెల 23న భారీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రాజెక్ట్ డైరెక్టర్ (పీడీ) లచ్చారావు శుక్రవారం ప్రకటించారు.10th ఆపై చదివిన, 35 ఏళ్ల లోపు అభ్యర్థులు ఈ ఇంటర్వ్యూలకు హాజరుకావచ్చని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ ఒరిజినల్ ధ్రువీకరణ పత్రాలతో ఉదయం 9 గంటలకే వికాస కార్యాలయానికి చేరుకోవాలని సూచించారు.

February 20, 2026 / 08:00 PM IST

పరీక్ష ఫీజుల నోటిఫికేషన్ విడుదల

NZB: తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని M.Ed మూడో సెమిస్టర్ రెగ్యులర్ విద్యార్థులకు పరీక్షల ఫీజు నోటిఫికేషన్ విడుదలైంది. ఉమ్మడి నిజామాబాద్ అనుబంధ కళాశాలల్లో విద్యనభ్యసిస్తున్న వారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని యూనివర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఆచార్య కె. సంపత్ కుమార్ తెలిపారు. ఈ నెల 27 లోపు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఫీజు చెల్లించవచ్చన్నారు.

February 20, 2026 / 08:00 PM IST

ఆదిలాబాద్‌లో ఈనెల 24న జాబ్ మేళా

ADB: ఆదిలాబాద్ జిల్లాలోని నిరుద్యోగ యువతి, యువకులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించేందుకు ఆదిలాబాద్ ప్రభుత్వ ITI కళాశాలలో ఈనెల 24న మంగళవారం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఉపాధి కల్పన అధికారి మిల్కా తెలిపారు. ఏదైనా డిగ్రీ చేసి 18 నుంచి 35లోపు వారు అర్హులన్నారు. ఎంపికైన వారికి ఆకర్షనీయమైన జీతంతో పాటు ఇతర అలవెన్సులు ఇవ్వనున్నట్లు తెలిపారు.

February 20, 2026 / 08:00 PM IST

సఫారీలపై టీమిండియాదే పైచేయి

T20 ప్రపంచకప్ సూపర్-8లో భాగంగా భారత్-సౌతాఫ్రికా జట్లు మరోసారి కీలక సమరానికి సిద్ధమయ్యాయి. ఇప్పటివరకు T20 WC చరిత్రలో ఈ రెండు జట్లు 7 సార్లు తలపడగా, భారత్ 5 సార్లు విజయం సాధించి స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. 2024 ఫైనల్లో సఫారీలను చిత్తు చేసి భారత్ విశ్వవిజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. దీంతో 22న జరిగే మ్యాచ్‌లోనూ ఇదే సీన్ రిపీట్ చేయాలని టీమిండియా భావిస్తోంది.

February 20, 2026 / 08:00 PM IST

‘చలో హైదరాబాదును విజయవంతం చేయాలి’

MNCL: తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిర్వహించే చలో హైదరాబాదును విజయవంతం చేయాలని ఆశా వర్కర్స్ యూనియన్ నాయకురాలు అంబటి సువర్ణ కోరారు. శుక్రవారం జన్నారంలోని సీఐటీయు కార్యాలయంలో ఆశా వర్కర్స్ యూనియన్ సమావేశం నిర్వహించారు. ఆశా వర్కర్లకు రూ. 18 వేల వేతనం ఇవ్వాలని, సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఫిబ్రవరి 23న చలో హైదరాబాద్ నిర్వహిస్తున్నామన్నారు.

February 20, 2026 / 07:59 PM IST

జేబీఆర్ విద్యాసంస్థల్లో ఘనంగా ఫేర్‌వెల్ డే

TPT: పిచ్చాటూరు మండలంలోని జేబీఆర్ విద్యాసంస్థల్లో పదో తరగతి, ఇంటర్ విద్యార్థులకు “ఫీల్ ది థ్రిల్” నినాదంతో ఫేర్‌వెల్ వేడుకలు నిర్వహించారు. నాగలాపురం ఎస్సై సునీల్, ఎంఈవో-2 యుగంధర్ రాజు ముఖ్య అతిథులుగా పాల్గొని విద్యార్థులకు ఆశీస్సులు అందించారు. ప్రతిభావంతులైన విద్యార్థులకు బహుమతులు అందజేసి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

February 20, 2026 / 07:59 PM IST

అంకాలపరమేశ్వరి ఆలయంలో కుంభాభిషేకం ప్రారంభం

TPT: సత్యవేడు మండలం మదనంబేడు గ్రామంలోని పునర్నిర్మిత శ్రీ అంకాలపరమేశ్వరి ఆలయంలో మహా కుంభాభిషేక వేడుకలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఉదయం గణపతి పూజ, కంకణ ధారణ, యాగశాల కలశ స్థాపన నిర్వహించారు. సాయంత్రం వాస్తు పూజలు జరిపారు. మూడు రోజుల పాటు వేడుకలు కొనసాగనుండగా, ఆలయం దీపాలతో అలంకరించబడింది. భక్తులకు అన్నదానం కూడా నిర్వహిస్తున్నారు.

February 20, 2026 / 07:55 PM IST

BREAKING: దంపతులకు మరణశిక్ష

పోక్సో కేసులో యూపీ ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఓ మాజీ ఇంజినీర్ రామ్‌భావన్, ఆయన భార్యకు కోర్టు మరణశిక్ష విధించింది. 2010 నుంచి 33 మంది చిన్నారులను లైంగికంగా వేధించిన కేసులో ఈ తీర్పు వెలువరించింది. ఆ 33 మంది చిన్నారులకు రూ.10 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని కోర్టు ఆదేశాలిచ్చింది. ఇది అత్యంత అరుదైన కేసుగా పోక్సో ప్రత్యేక కోర్టు పేర్కొంది.

February 20, 2026 / 07:55 PM IST

గ్రామ పంచాయతీకి భూమి దానం

MDK: చేగుంట మండలం ఇబ్రహీంపూర్ శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయ వంశపారంపర్య ధర్మకర్త గోల్కొండ కిషన్ రావు దేశ్ముఖ్ గ్రామపంచాయతీ భవనం నిర్మాణం కోసం భూమిని దానంగా అందజేశారు. 20 ఏళ్లుగా గ్రామపంచాయతీ భవనం లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని కిషన్ రావు దేశ్ముఖ్ పేర్కొన్నారు. సర్పంచ్ జ్యోతి రామ్ రెడ్డి, ఉప సర్పంచ్ చౌదరి శ్రీనివాస్, పూజారి రమణచార్యులు పాల్గొన్నారు.

February 20, 2026 / 07:53 PM IST

క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు

AP: నెల్లూరులో క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. బుచ్చిరెడ్డిపాలెంకు చెందిన వేణు, వెంకటరమణను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.34.6 లక్షలు, ల్యాప్‌టాప్, టీవీ, ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల ఖాతాల్లో ఉన్న రూ.కోటి 64 లక్షలను సీజ్ చేశారు. త్వరలోనే క్రికెట్ బెట్టింగ్ ముఠా నిర్వాహకులను పట్టుకుంటామని తెలిపారు.

February 20, 2026 / 07:52 PM IST

‘అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా చర్యలు’

కడప జిల్లాలో మట్కా, క్రికెట్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ వంటి అసాంఘిక కార్యకలాపాలు ఎక్కడా జరగకుండా కఠినంగా వ్యవహరించాలని జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాధ్ ఆదేశించారు. జమ్మలమడుగు, పులివెందుల సబ్-డివిజన్ నేర సమీక్షా సమావేశాల్లో మహిళా భద్రత, సోషల్ మీడియా వేధింపులపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులకు సూచించారు.

February 20, 2026 / 07:50 PM IST

పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే

VZM: ఎస్‌.కోట MLA కోళ్ల లలిత కుమారి శుక్రవారం వేపాడ, కొత్తవలస మండలాల్లో వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ మేరకు ముందుగా ఆమె కొత్తవలసలో విజయ ఆంజనేయ విగ్రహ ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సోంపురం గ్రామంలో గ్రామదేవత ముత్యాలమ్మ తల్లి 5వ వార్షికోత్సవం, అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు.

February 20, 2026 / 07:49 PM IST