• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

లక్షెట్టిపేటలో మహిళలదే కీలకపాత్ర

MNCL: లక్షెట్టిపేట మండలంలో మహిళలు ప్రజా ప్రతినిధులుగా, అధికారులుగా రాణిస్తూ గుర్తింపు పొందుతున్నారు. లక్షెట్టిపేట మున్సిపల్ ఛైర్మన్‌గా దొంత అంజలి, వైస్ ఛైర్మన్‌గా మోత్కూరి రాజేశ్వరి ఎన్నికై చరిత్ర సృష్టించారు. అలాగే లక్షెట్టిపేట ఎంపీడీవోగా సరోజ, ఎంఈఓగా శైలజ పనిచేస్తున్నారు. చాలా పంచాయతీలకు సర్పంచులుగా, కార్యదర్శులుగా, అధికారులుగా పనిచేస్తున్నారు.

March 8, 2026 / 08:32 AM IST

చిట్యాల లో మహిళా దినోత్సవ వేడుకలు

NLG: చిట్యాల మున్సిపల్ కార్యాలయంలో ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నట్లు జిల్లా కాంగ్రెస్ నాయకురాలు, న్యాయవాది గాదె గీత తెలిపారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ ఛైర్‌పర్సన్ పందిరి గీత, వైస్ ఛైర్‌పర్సన్ శ్రీలక్ష్మి, కమిషనర్ శ్రీను, సీఐ నాగరాజు, పలువురు కౌన్సిలర్లు ముఖ్య అతిథులుగా, అలాగే పలువురు గౌరవ అతిథులు హాజరుకానున్నారు.

March 8, 2026 / 08:30 AM IST

సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

NLR: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా కందుకూరు నియోజకవర్గానికి అత్యధికంగా ఆర్థిక సహాయాలు మంజూరయ్యాయని MLA ఇంటూరి నాగేశ్వరరావు తెలిపారు. శనివారం కందుకూరులోని టీడీపీ కార్యాలయంలో 53 మందికి రూ.31.73 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆయన అందజేశారు. ప్రజల ఆరోగ్య భద్రతకు CM చంద్రబాబు అండగా నిలుస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

March 8, 2026 / 08:30 AM IST

ప్రణాళికతో చదవాలి: డీఈవో ప్రవీణ్ కుమార్

MBNR: మరో ఐదు రోజుల్లో 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానుండడంతో డీఈవో ప్రవీణ్ కుమార్ శనివారం బాలానగర్ మండలంలోని నేరళ్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించారు. డీఈవో విద్యార్థుల ఉద్దేశించి మాట్లాడుతూ.. 10 పరీక్షల్లో అత్యధిక మార్పులు సాధించేందుకు పక్కా ప్రణాళికతో ప్రిపరేషన్ అవ్వాలన్నారు. విద్యార్థుల శక్తి సామర్థ్యాలను పరిశీలించారు.

March 8, 2026 / 08:30 AM IST

దొడ్డిపట్ల PHC డాక్టర్ ఆత్మహత్య

W.G: యలమంచిలి మండలం దొడ్డిపట్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్‌గా పనిచేస్తున్న కర్రి చంద్రరేఖ (30) నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. శుక్రవారం అధిక మోతాదులో నిద్ర మాత్రలు మింగడంతో ఆపస్మారక స్థితిలోకి చేరారు. పాలకొల్లులోని హాస్పిటల్‌కు తరలించగా చికిత్స పొందుతూ.. శనివారం ఆమే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

March 8, 2026 / 08:29 AM IST

‘పూర్తి సమాచారంతో హాజరు కావాలి’

ASR: చింతపల్లి మండల సర్వసభ్య సమావేశం ఈనెల 9వ తేదీ సోమవారం (రేపు) నిర్వహించడం జరుగుతుందని ఎంపీడీవో సీతామహాలక్ష్మి తెలిపారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ కే.అనుషదేవి అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి మండలంలోని ప్రజాప్రతినిధులు అందరూ హాజరు అవుతారని చెప్పారు. ఈమేరకు మండలంలోని అన్ని శాఖల అధికారులు, సిబ్బంది పూర్తి సమాచారంతో తప్పనిసరిగా హాజరు కావాలన్నారు.

March 8, 2026 / 08:29 AM IST

‘మహిళలు ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగాలి’

ASF: మహిళా దినోత్సవం ఏడాదికి ఒక్కసారి జరుపుకున్నా దాని వెనక ఉన్న స్ఫూర్తి ప్రతిరోజూ మహిళలను ముందుకు నడిపించాలని ఆసిఫాబాద్ కలెక్టర్ హరిత అన్నారు. మహిళలు ముందుగా తమ ఆలోచన విధానాన్ని మార్చుకొని తాము ఏ పనికైనా సమర్ధులమే అన్న నమ్మకంతో ముందుకు సాగాలన్నారు. ప్రభుత్వం మహిళలకు అందిస్తున్న పథకాలు, రిజర్వేషన్లు వినియోగించుకోవాలని సూచించారు

March 8, 2026 / 08:29 AM IST

భూసేకరణ వేగవంతం చేయాలి: అదనపు కలెక్టర్

SRD: భూ సేకరణను మరింత వేగవంతం చేయాలని జిల్లా అదనపు కలెక్టర్‌లు మాధురి, విశాలాక్షి అధికార యంత్రాంగానికి ఆదేశించారు. శనివారం న్యాల్కల్ మండలం రుక్మాపూర్ తండాలో భూ నిర్వాసితులతో చర్చించారు. ముంగి తాండాలో 17, రుక్మాపూర్ తాండలో 10 చొప్పున హద్దురాళ్లను ఏర్పాటు చేశారు. ఏ ఒక్క భూనిర్వాసితులు నష్టపోకుండా అన్ని విధాల ఆదుకుంటామన్నారు. RDO దేవుజా ఉన్నారు.

March 8, 2026 / 08:28 AM IST

ఆటో నుంచి పడి వృద్ధుడు మృతి

W.G: నరసాపురం రుస్తుంబాద వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యలమంచిలి మండలం చింతదెబ్బకు చెందిన కడలి వెంకటేశ్వరరావు (65) దుర్మరణం చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మొగల్తూరులో శుభకార్యానికి వెళ్లి తిరిగి ఆటోలో వస్తుండగా, రుస్తుంబాద సమీపంలో ఆయన ప్రమాదవశాత్తు కిందపడ్డారు. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందగా, పోలీసులు కేసు నమోదు చేశారు.

March 8, 2026 / 08:27 AM IST

శ్రీవారి దర్శనానికి సుమారు 8 గంటలు సమయం

TPT: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శనివారం మొత్తం 82,838 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 31,006 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ. 3.94 కోట్లుగా నమోదైంది. ప్రస్తుతం 31 కంపార్ట్‌మెంట్లు నిండగా, సర్వదర్శనం (SSD టోకెన్లు లేకుండా) సుమారు 8 గంటలు సమయం పడుతోంది.

March 8, 2026 / 08:26 AM IST

పరగడుపున కాఫీ/టీ తాగుతున్నారా?

పరగడుపున బెడ్ కాఫీ లేదా టీ తాగడం ఆరోగ్యానికి ప్రమాదకరం. నిద్రలేవగానే ఖాళీ కడుపుతో వీటిని తీసుకోవడం వల్ల ఎసిడిటీ, గ్యాస్ వంటి జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. అంతేకాకుండా, శరీరంలో కార్టిసోల్ (స్ట్రెస్ హార్మోన్) స్థాయిలు పెరిగి ఒత్తిడికి గురిచేస్తాయి. కాబట్టి, ఉదయాన్నే కనీసం ఒక గ్లాసు నీళ్లు తాగిన తర్వాతే టీ లేదా కాఫీ తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

March 8, 2026 / 08:26 AM IST

12 ఇసుక ట్రాక్టర్‌లు పట్టివేత

పెద్దపల్లి మండలం పెద్ద కల్వలలో 12 ఇసుక ట్రాక్టర్‌లు పట్టుకున్నట్లు రూరల్ ఎస్సై మల్లేష్ తెలిపారు. పోలీసుల వాహన తనిఖీలలో భాగంగా నిన్న సరైన ధ్రువపత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడంతో ట్రాక్టర్లను స్టేషన్‌కు తరలించి జరిమానా విధించినట్లు తెలిపారు. లైసెన్స్ కలిగిన వారు మాత్రమే వాహనాలు నడపాలని ఎస్ఐ సూచించారు.

March 8, 2026 / 08:25 AM IST

సునయనను అభినందించిన DCC అధ్యక్షుడు

వరంగల్ 15వ డివిజన్ గొర్రెకుంట గ్రామానికి చెందిన పోలేపాక సునయన తన అద్భుత సృజనాత్మకతతో భద్రకాళి బండ్ వద్ద జరిగిన రుద్రమ రాకెట్ లాంచ్ చిత్రపటాలను రూపొందించింది. శనివారం సాయంత్రం ఆ చిత్రపటాన్ని DCC అధ్యక్షుడు వెంకట్రామ్ రెడ్డికి అందజేసింది. చిన్న వయసులోనే అసాధారణ కళా నైపుణ్యం ప్రదర్శిస్తున్న సునయనను DCC అధ్యక్షుడు ప్రత్యేకంగా అభినందించారు.

March 8, 2026 / 08:25 AM IST

భూదాన్ భూముల అక్రమాలపై ఉక్కుపాదం.. 9 మంది అరెస్ట్

ఖమ్మం జిల్లా వెలుగుమట్ల భూదాన్ భూముల వ్యవహారంలో నకిలీ పట్టాలు, అక్రమ కేటాయింపులపై ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. ఈ కుంభకోణానికి సంబంధించి ఇప్పటివరకు 19 కేసులు నమోదు కాగా, 9 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. దాదాపు 250 కోట్ల విలువైన 31 ఎకరాల భూమిని ఆక్రమణల నుంచి అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

March 8, 2026 / 08:25 AM IST

రోడ్డు ప్రమాదంలో తల్లి మృతి..కుమారుడికి తీవ్ర గాయాలు..!

అన్నమయ్య: వాల్మీకిపురం బైపాస్‌లో శనివారం రాత్రి రోడ్డు ప్రమాదంలో 40 ఏళ్ల రెడ్డిలక్ష్మీ మృతి చెందగా, ఆమె కుమారుడు బాలాజీ పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు. గుర్రంకొండ మండలం రామాపురానికి చెందిన వీరు, చింతపర్తిలో పని ముగించుకుని బైకుపై తిరిగి వెళ్తుండగా ఓ స్కూటర్ బలంగా ఢీకొట్టినట్లు వారు పేర్కొన్నారు. గాయపడిన బాలాజీని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించమన్నారు.

March 8, 2026 / 08:24 AM IST