• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

పోస్ట్-మెట్రిక్ స్కాలర్‌షిప్ విద్యార్థులకు హెచ్చరిక..!

BHPL: జిల్లాలో పోస్ట్-మెట్రిక్ స్కాలర్‌షిప్ పథకం కింద ఉపకార వేతనాలు మంజూరు కావాలంటే విద్యార్థుల బ్యాంక్ ఖాతాలకు ఆధార్ సీడింగ్ తప్పనిసరని జిల్లా వెనుకబడిన తరగతుల అధికారి ఇందిర తెలిపారు. BC, EBC విద్యార్థులు పేర్లు నమోదు చేసుకున్నా, బ్యాంక్ ఖాతాకు ఆధార్ నంబర్ లింక్ చేయకపోతే స్కాలర్‌షిప్ జమ కాదని స్పష్టం చేశారు. ఆధార్ సీడింగ్ త్వరగా చేసుకోవాలన్నారు.

February 22, 2026 / 06:07 AM IST

గద్వాలకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాక

GDWL: జిల్లాకు సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ జాన్ వెస్లీ ఆదివారం రానున్నట్లు కార్యకర్తలు తెలిపారు. ఉదయం 11 గంటలకు అలంపూర్ చౌరస్తాలో నిర్వహించే సీపీఎం జిల్లా విస్తృత సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. రాష్ట్ర కమిటీ సభ్యుడు ఆర్.శ్రీరామ్ నాయక్ కూడా హాజరవుతారని జిల్లా కార్యదర్శి ఏ. వెంకటస్వామి పేర్కొన్నారు.

February 22, 2026 / 06:05 AM IST

నేడు పట్టణంలో హ్యాపీ సండే కార్యక్రమం

VZM: పట్టణంలో స్దానిక కోట వద్ద ఆదివారం ఉదయం 6.30 నుండి 8.30 వరకు హ్యాపీ సండే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మునిసిపల్ సహాయ కమీషనర్ కిల్లాన అప్పలరాజు శనివారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. యాంత్రిక జీవితంతో సతమతమవుతున్న ప్రజానీకానికి మానసిక ఉల్లాసం కలిగించే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం హ్యాపీ సండే కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని తెలిపారు.

February 22, 2026 / 06:05 AM IST

ఉమ్మడి వరంగల్‌లో రేవంత్ పర్యటన

TG: సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన దేవాదుల ప్రాజెక్ట్‌ను సందర్శించి, పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. అనంతరం, మహబూబాబాద్‌లో ఏర్పాటు చేసిన ఓ ప్రైవేట్ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు.

February 22, 2026 / 06:04 AM IST

వైద్య శిబిరాన్ని సందర్శించిన కలెక్టర్

HNK: భీమదేవరపల్లి మండల ప్రజల కోసం స్థానిక మోడల్ స్కూల్‌లో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని శనివారం జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె రోగుల నమోదు ప్రక్రియ, ప్రాథమిక పరీక్షల కౌంటర్లు, జనరల్ ఫిజీషియన్ విభాగం, ఎముకల శస్త్ర చికిత్స విభాగాల్లో నిర్వహిస్తున్న పరీక్షలను పరిశీలించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు డాక్టర్లను కోరారు.

February 22, 2026 / 06:03 AM IST

రాష్ట్రస్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలను ప్రారంభించిన కలెక్టర్

ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో సీఎం కప్ 2025-26 రాష్ట్రస్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలను జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. క్రీడాకారులు గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ, పూర్తి ఆత్మవిశ్వాసంతో క్రీడా స్ఫూర్తిని చాటాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం అర్చరీ విజేతలకు కలెక్టర్ బహుమతులు అందజేశారు.

February 22, 2026 / 06:02 AM IST

మేయర్ ఆకస్మిక పర్యటన.. అధికారులపై ఆగ్రహం

వరంగల్ పట్టణ కేంద్రంలోని కొత్తవాడ, BT బజార్ ప్రాంతాల్లో శనివారం సాయంత్రం నగర మేయర్ గుండు సుధారాణి ఆకస్మికంగా పర్యటించారు. ఈ పర్యటన సందర్భంగా కాలనీలో పేరుకుపోయిన చెత్త చెదారం చూసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఇంత దారుణంగా చెత్త పేరుకుపోతే ఏం చేస్తున్నారు? ప్రజలు ఇబ్బంది పడుతుంటే మీరు ఏమీ చేయట్లేదా?” అని మండిపడ్డారు. వెంటనే శుభ్రం చేయాలని ఆదేశించారు.

February 22, 2026 / 06:01 AM IST

లక్ష్మీ నరసింహుని బ్రహ్మోత్సవాలపై ఎమ్మెల్యే సమీక్ష

సత్యసాయి: కదిరి శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలను ఫిబ్రవరి 27 నుంచి మార్చి 13 వరకు అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ తెలిపారు. ఈ ఉత్సవాల ఏర్పాట్లపై ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డి, వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

February 22, 2026 / 06:00 AM IST

రాఘవేంద్ర స్వామిని దర్శించుకున్న ఎంపీ

ATP: మంత్రాలయంలోని ప్రసిద్ధ శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. తుంగభద్రా నదీతీరంలో వెలసిన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాఘవేంద్రుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నట్లు ఎంపీ తెలిపారు.

February 22, 2026 / 06:00 AM IST

ALERT: పిడుగులతో కూడిన వర్షాలు

AP: రాష్ట్రంలో రానున్న మూడు రోజుల్లో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. ఈరోజు, రేపు తూ.గో. జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఏలూరు, పశ్చిమ గోదావరి, NTR, కృష్ణా, గుంటూరు, చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వానలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది.

February 22, 2026 / 06:00 AM IST

‘ప్రజా సమస్యల పరిష్కారానికై సీపీఎం పాదయాత్రలు’

W.G: ప్రజా సమస్యల పరిష్కారానికై సీపీఎం ఆధ్వర్యంలో జరుగుతున్న పాదయాత్రను జయప్రదం చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బలరాం పిలుపునిచ్చారు. శనివారం ఆకివీడులోని సీపీఎం ఏరియా కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఎన్నో ఏళ్లుగా ఉన్న సమస్యలను పాలకుల దృష్టికి తీసుకువెళ్లేందుకు జిల్లా స్థాయిలో పాదయాత్రను నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

February 22, 2026 / 05:53 AM IST

కంట్రీ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు 4 పతకాలు

జపాన్‌లో జరుగుతున్న ఆసియా క్రాస్ కంట్రీ ఛాంపియన్‌షిప్‌లో భారత్ నాలుగు పతకాలు సాధించింది. 10 కిలో మీటర్ల పరుగు పోటీలో హర్మన్‌జ్యోత్ రజతం గెలుచుకున్నాడు. టీమ్ పోటీల్లో భారత్ మూడు పతకాలు కైవసం చేసుకుంది. అండర్-20లో మహిళలు, పురుషుల జట్లు కాంస్యం గెలిచాయి. మహిళల 10 కిలోమీటర్ల టీమ్ విభాగంలో భారత బృందం కంచు నెగ్గింది.

February 22, 2026 / 05:52 AM IST

పారిశుద్ధ్య కార్మికులే నిజమైన హీరోలు

SKLM: గ్రామాల పరిశుభ్రతలో, మౌలిక సదుపాయాల నిర్వహణలో అహర్నిశలు శ్రమిస్తున్న పారిశుద్ధ్య కార్మికులే నిజమైన హీరోలని ఎమ్మెల్యే శంకర్ అన్నారు. శనివారం సాయంత్రం శ్రీకాకుళం రూరల్ ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ మేరకు పారిశుద్ధ్య కార్మికులకు ఆర్థిక భరోసా కల్పించే ఉద్దేశంతో ఇన్సూరెన్స్ కార్డులను అందజేశారు .

February 22, 2026 / 05:45 AM IST

బాధిత కుటుంబానికి బీమా పరిహారం అందజేత

AKP: మునగపాక మండలం నాగులపల్లి పీఏసీఎస్ సభ్యుడు రంగాల గురువు నాయుడు ఇటీవల ప్రమాదవశాత్తు మృతి చెందాడు. ఆ కుటుంబానికి రూ. రెండు లక్షల బీమా చెక్కును ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ఎలమంచిలి క్యాంపు కార్యాలయంలో శనివారం అందజేశారు. పీఏసీఎస్ ఛైర్మన్ వై. వెంకట భాస్కరరావు మాట్లాడుతూ.. సభ్యులందరకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించామన్నారు. సీఈవో మల్ల స్వామి పాల్గొన్నారు.

February 22, 2026 / 05:41 AM IST

మతపరమైన చర్చలు నిషేధించాలని విజ్ఞప్తి

W.G: సోషల్ మీడియాతోపాటు మీడియా ఛానెళ్లలో మతపరమైన చర్చలను నిషేధించాలని జాతీయ పాస్టర్స్ ఫెలోషిప్ నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శనివారం తెలంగాణ గవర్నర్ జిషుదేవ్ వర్మను తణుకుకు చెందిన ఫెలోషిప్ వ్యవస్థాపకులు, ఛైర్మన్ రెవరెండ్ మాథ్యూ మీగర్, చీఫ్ కోఆర్డినేటర్ రెవరెండ్ ఓ. మనోజ్ బాబ్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బిషన్ అనుపమ కలిసి వినతి పత్రాన్ని అందజేశారు.

February 22, 2026 / 05:40 AM IST