• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ACB వలకు చిక్కిన ఎస్సై

AP: కడప జిల్లా సింహాద్రిపురం పోలీస్ స్టేషన్‌లో ACB అధికారులు తనిఖీలు చేపట్టారు. ఓ కేసు విషయంలో ఎస్సై అనిల్ లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. టూవీలర్ కన్సల్టెన్సీ యజమానిని రూ.4 లక్షలు డిమాండ్ చేసినట్లు ఫిర్యాదు అందింది. దీంతో ఎస్సై అనిల్‌తో పాటు సీఐ వెంటరమణను ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. 

February 23, 2026 / 04:34 PM IST

కుమ్మెర జాతరలో చిన్నారి మృతి.. BRS ఫిర్యాదు

TG: నాగర్‌కర్నూల్‌ జిల్లా కుమ్మెర మల్లన్న జాతరలో 2 నెలల చిన్నారి మృతిచెందిన ఘటనపై చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్‌ నేతలు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు DGP శివధర్‌రెడ్డికి మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, నేతలు వినతిపత్రం అందజేశారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేపట్టి నిజాలు వెలికితీయాలని కోరారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలన్నారు.

February 23, 2026 / 04:34 PM IST

విగ్రహ ప్రతిష్ఠలో పాల్గొన్న ఎంపీ అంబిక

ATP: సింగనమల మండలం పెరవల్లి గ్రామంలో సోమవారం నిర్వహించిన మహర్షి వాల్మీకి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో అనంతపురం ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జడ్పీ ఛైర్‌పర్సన్ బోయ గిరిజమ్మతో కలిసి పూజలు నిర్వహించిన ఆయన, గ్రామస్థులతో కలిసి కోలాట భజనలో పాల్గొన్నారు. వాల్మీకి సమాజం విద్యాపరంగా, సామాజికంగా అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు.

February 23, 2026 / 04:34 PM IST

అందుబాటులో మరో 36 కిషాన్ డ్రోన్‌లు

TPT: జిల్లాలో గత ఏడాది సబ్సిడీ కింద జిల్లాలో 36 కిషాన్ డ్రోన్‌లను అందుబాటులోకి తెచ్చారు. సబ్సిడీ కింద ఐదుగురు రైతుల గ్రూప్‌గా కలిసిన సభ్యులకు శిక్షణ ఇచ్చి అందజేశారు. రైతులు డ్రోన్ కావాలంటే కిషాన్ డ్రోన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకుని మీ సమీపంలో డ్రోన్‌లు ఎక్కడ ఉన్నాయి, వారి వివరాల తెలుసుకుని సంప్రదించవచ్చు. ఎకరానికి రూ.400 చొప్పున సేవా ధరను నిర్ణయించారు.

February 23, 2026 / 04:34 PM IST

ప్రజావాణికి వచ్చే సమస్యలకు సత్వరపరిష్కారం: కలెక్టర్

VKB: ప్రజావాణికి వచ్చే సమస్యలకు సత్వర పరిష్కారం చూపి ఫిర్యాదుదారులకు న్యాయం చేయడం జరుగుతుందని కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. కలెక్టరేట్లో జిల్లా అధికారులతో కలిసి కలెక్టర్ ప్రజావాణి నిర్వహించి ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. శాఖల వారీగా అధికారులు ఫిర్యాదులను పరిశీలించి వెంటనే పరిష్కారం చూపి న్యాయం చేయాలన్నారు.

February 23, 2026 / 04:33 PM IST

మహిళా సంఘం భవనానికి శంకుస్థాపన

MDK: తూప్రాన్ మండలం యావపూర్ గ్రామంలో మహిళా సంఘ భవనానికి సర్పంచ్ ఎంజాల స్వామి శంకుస్థాపన పూజ నిర్వహించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మహిళా సంఘ భవనానికి రూ. 10 లక్షలు మంజూరయ్యాయి. పంచాయతీరాజ్ ఏఈ మధుసూదన్‌లతో కలిసి భూమిపూజ నిర్వహించారు. వార్డు సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు.

February 23, 2026 / 04:33 PM IST

గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలపై చలో కలెక్టరేట్

GNTR: గ్రామపంచాయతీ కార్మికులకు జీతాల పెంపు, 132, 142, 680 జీవోలను తక్షణమే అమలు , టెండర్ విధానం రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 27న నిర్వహించనున్న చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఫిరంగిపురంలో మంగళవారం కరపత్రాన్ని విడుదల చేశారు.

February 23, 2026 / 04:32 PM IST

‘ప్రజావాణితో సమస్యలకు పరిష్కారం’

SRCL: ప్రజావాణితో సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఇంఛార్జ్ కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించగా, ఇంఛార్జ్ కలెక్టర్ గరిమ అగ్రవాల్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వాటిని పరిశీలించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు.

February 23, 2026 / 04:32 PM IST

సాక్షి, భారతి సిమెంట్స్‌కు రూ.వెయ్యి కోట్ల లబ్ధి: లోకేష్

AP: వైసీపీ హయాంలో సాక్షి, భారతి సిమెంట్స్ రూ.వెయ్యి కోట్లు లబ్ధి పొందాయని మంత్రి లోకేష్ ఆరోపించారు. తాము ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం నుంచి లబ్ధి పొందలేదని తెలిపారు. మార్కెట్‌లో కిలో నెయ్యి రూ.వెయ్యి పైన ఉంటే రూ.360కి ఇచ్చేది కల్తీ కాక మరేంటి? అని ప్రశ్నించారు. అలాగే, ఇందాపూర్ డెయిరీ.. హెరిటేజ్‌కు కో కంపెనీ అనడం విడ్డూరంగా ఉందన్నారు.

February 23, 2026 / 04:31 PM IST

‘కాంప్లెక్స్ సమావేశాలను సద్వినియోగం చేసుకోవాలి’

VKB: కుల్కచర్ల ఉపాధ్యాయులు కాంప్లెక్స్ సమావేశాలను సద్వినియోగం చేసుకోవాలని మండల ఇంఛార్జ్ MEO రామ్ చందర్ అన్నారు. మండలంలోని ముజాహిద్పూర్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుల కాంప్లెక్స్ సమావేశాలను నిర్వహించారు. విద్యార్థులకు సామర్థ్యాలకు అనుగుణంగా విద్యా బోధన చేయాలన్నారు. FLSను సమర్థవంతంగా నిర్వహించాలని అన్నారు.

February 23, 2026 / 04:31 PM IST

మున్సిపల్ ఛైర్మన్‌కు మంత్రి సీతక్క శుభాకాంక్షలు

KMR: కామారెడ్డి మున్సిపల్ ఛైర్మన్ ఇప్ప ఉమారాణి సోమవారం పదవీ బాధ్యత స్వీకరించారు. ఈ తరుణంలో కామారెడ్డి ఇంఛార్జ్ మంత్రి సీతక్క ఫోన్‌లో ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి మాట్లాడుతూ.. “రావాల్సింది ఉండే కానీ రాలేకపోయాను. మంత్రితో మీటింగ్ ఉండడం వలన రాలేకపోయాను” అని ఫోన్‌లో తెలిపారు. ఈ మేరకు కామారెడ్డి ఛైర్ పర్సన్ మంత్రికి ధన్యవాదాలు తెలిపారు.

February 23, 2026 / 04:31 PM IST

పెద్దాయపల్లి భూమి ఆక్రమంపై ఫిర్యాదు

MBNR: బాలానగర్ (M) పెద్దాయపల్లి సర్వే నం.78లో ప్రభుత్వ భూమిని రియల్ ఎస్టేట్ వెంచర్ ఆక్రమించిందని సామాజిక కార్యకర్త కోస్గి వెంకటయ్య సోమవారం కలెక్టరేట్లో ఫిర్యాదు చేశారు. 2025 అక్టోబర్ 7న ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు చర్యలు తీసుకోలేదని ఆయన అన్నారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

February 23, 2026 / 04:30 PM IST

కోడి పందేల స్థావరంపై పోలీసుల మెరుపు దాడి

కృష్ణా: ఘంటసాల పోలీస్ స్టేషన్ పరిధిలో కోడి పందేలు నిర్వహిస్తున్నారన్న పక్కా సమాచారంతో ఎస్‌ఐ వి. చందన తన సిబ్బందితో కలిసి మెరుపు దాడి చేశారు. ఈ దాడుల్లో ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి ఒక కోడి పుంజు, రూ.1,67 నగదు స్వాధీనం చేసుకున్న పోలీసులు, నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

February 23, 2026 / 04:30 PM IST

నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి ప్రధాన లక్ష్యం

MDCL: మల్కాజ్‌గిరి నియోజకవర్గాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడం తన లక్ష్యమని మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి తెలిపారు. సోమవారం మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డిని కలిసి నియోజకవర్గ అభివృద్ధి అంశాలపై చర్చించారు. వివిధ అభివృద్ధి పనులు సమస్యలను పరిష్కరించాలని కోరారు.

February 23, 2026 / 04:29 PM IST

జిల్లాలో పశువుల హాస్టళ్లు

సత్యసాయి: పాడి రైతులకు ఊరటనిస్తూ ప్రభుత్వం ‘కమ్యూనిటీ అనిమల్ హాస్టళ్ల’ పథకానికి శ్రీకారం చుట్టింది. జిల్లాలోని ధర్మవరం, ముదిగుబ్బ, పరిగి, సోమందేపల్లి, అమరాపురంలో ఐదు యూనిట్లను మంజూరు చేశారు. ఒక్కో హాస్టల్‌ను రూ.10 లక్షలతో ఉపాధి హామీ పథకం ద్వారా నిర్మించనున్నారు. 50 సెంట్ల విస్తీర్ణంలో 20 పశువులకు వసతి కల్పిస్తారు.

February 23, 2026 / 04:28 PM IST