BPT: రాజమండ్రిలో కల్తీ పాలు తాగి చిన్నారులు మృతి చెందిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో ఆహార భద్రతా శాఖ అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో బాపట్ల జిల్లా ఆహార భద్రత అధికారి ప్రణీత్ కుమార్ శుక్రవారం పలు పాల డైరీల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. పాల నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపిన ఆయన, నాణ్యతలో లోపాలు ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
TG: ప్రజా రవాణాలో భాగంగా గ్రేటర్ వరంగల్ నగరానికి ప్రభుత్వం వంద ఎలక్ట్రిక్ బస్సులను మంజూరు చేసింది. RTC, రెవెన్యూ శాఖల అధికారులతో ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ కోసం మడికొండలో ప్రతిపాదిత స్థలం, నిర్వహణ అంశాలకు సంబంధించిన వివిధ అంశాలపై కలెక్టర్ సమీక్షించారు.
ప్రకాశం: కనిగిరి మున్సిపల్ కార్యాలయంలో ఇవాళ ఉదయం 11.00 గంటలకు మున్సిపల్ కౌన్సిల్ హాల్లో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ శ్రీధర్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. మున్సిపల్ ఛైర్మన్ అబ్దుల్ గఫార్ అధ్యక్షతన సమావేశం జరుగుతుందని, సమావేశానికి వైస్ ఛైర్మన్లు, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, అధికారులు హాజరుకానున్నారు.
WGL: కలెక్టర్ కార్యాలయంలో రోడ్డు భద్రత కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ డా. సత్య శారద ప్రమాదాల తగ్గింపు తీసుకోవలసిన చర్యలపై చర్చించారు. ప్రమాదాల ప్రదేశాలను గుర్తించి హచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీసీపీ అంకిత్ కుమార్, AJC సంధ్యారాణి పాల్గొన్నారు.
IPL 2026 షెడ్యూల్ ప్రకారం మార్చి 26న కాకుండా 28న ప్రారంభమవుతుంది. అయితే టైటిల్ పోరు మే 31నే జరుగుతుంది. ఈ విషయంతో పాటు పూర్తిస్థాయి షెడ్యూల్, వేదికల వివరాలపై వచ్చే వారంలో BCCI అధికారిక ప్రకటన చేయనుందని క్రికెడ్ వర్గాలు తెలిపాయి. కాగా అసోం, బెంగాల్, తమిళనాడు ఎన్నికల తేదీలపై స్పష్టత రాలేదు. ఎన్నికల, IPL షెడ్యూల్స్ క్లాష్ కాకూడదని ఈ నిర్ణయం తీసుుకున్నట్లు తెలుస్తోంది.
PPM: గరుగుబిల్లి మండలం పెద్దగూడభ గ్రామంలో శుక్రవారం రాత్రి APM అప్పలనాయుడు ఆద్వర్యంలో ఉల్లాస్ తరగతులు నిర్వహించారు. ఉల్లాస్ అక్షరాంధ్ర కార్యక్రమంలో భాగంగా నిరక్షరాస్యులైన మహిళా సంఘాలు సభ్యులుకు రాయడం, చదవడంతో పాటు డిజిటల్ అక్షరాస్యతపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. మార్చి 4న ఫ్రీ ఫైనల్ పరీక్షకు సిద్ధం చేస్తున్నామని ఆయన తెలిపారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో పాలనాధికారులు (కలెక్టర్లు) ముగ్గురూ మహిళలే కావడం విశేషం. ఉమ్మడి జిల్లాలో సంగారెడ్డి కలెక్టర్గా ప్రావీణ్య, సిద్దిపేట కలెక్టర్గా హైమావతి ఉండగా తాజాగా జరిగిన కలెక్టర్ల బదిలీలో మెదక్ కలెక్టర్‌గా ప్రతిమా సింగ్ నియమితులయ్యారు. దీంతో ఉమ్మడి జిల్లా పరిపాలనలో మహిళల చేతిలో ఉంది.
VSP: విశాఖపట్నం పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌కు శుక్రవారం రాత్రి విమానాశ్రయంలో పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణమూర్తి, గణబాబులతో పాటు వీఎంఆర్డీఏ ఛైర్మన్ ప్రణవ్ గోపాల్, దాడి రత్నాకర్ స్వాగతం పలికారు.
ADB: మహిళా సిబ్బంది శారీరకంగా, మానసికంగా దృఢంగా తయారై అన్ని రకాల విధుల్లో సమర్థంగా పాల్గొనాలని SP అఖిల్ మహాజన్ ఆకాంక్షించారు. జిల్లా పోలీస్ ఏఆర్ హెడ్ క్వార్టర్స్‌లో 3 రోజుల పాటు నిర్వహించిన మహిళా సిబ్బంది మార్షల్ ఆర్ట్స్ శిక్షణ ముగింపు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. మహిళలు పోలీస్ స్టేషన్‌లో ఉన్న ప్రతి ఒక్క విధులకు పూర్తి సంసిద్ధతతో ఉండాలని కోరారు.
కృష్ణా: జిల్లాలో రబీ 2025-26 సీజన్లో సాగు చేసిన అపరాలు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని శుక్రవారం జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్ అన్నారు.ప్రభుత్వం మినుములు క్వింటాలుకు రూ.7800 పెసలు క్వింటాలుకు రూ.8768 మద్దతు ధర నిర్ణయించిందని తెలిపారు.రైతులు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
VKB: మే 10 నుంచి జూన్ 10 వరకు రాష్ట్ర వ్యాప్తంగా జనగణన సర్వే చేపట్టనున్నారు. ఈ సర్వేలో తమకు సూపర్వైజర్లుగా విధులు కేటాయించాలని కుల్కచర్ల తహాశీల్దార్ మనోహర్ చక్రవర్తికి శుక్రవారం PSHMA జిల్లా అధ్యక్షుడు తుప్పలి ఆనంద్ కుమార్ నేతృత్వంలో వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు నరేష్, వీరేశం, తౌర్య నాయక్ తదితరులు పాల్గొన్నారు.
SDPT: మద్దూరు మండలం లద్నూర్ గ్రామానికి చెందిన ఆలేటి మహేష్(28) శుక్రవారం తన ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గత కొంతకాలంగా మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న మహేష్, తీవ్ర మనస్తాపంతో ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు సమాచారం. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై అసిఫ్ ఆధ్వర్యంలో ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోంది.
SRD: దేశం కోసం రాహుల్ గాంధీ బాధ్యత గల ప్రతిపక్ష నేతగా విలువైన సూచనలు ఇస్తున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. శుక్రవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్ ఇచ్చే సలహాలను ప్రధాని మోదీ వింటున్నారే తప్ప, అమలు చేయడంలో విఫలమవుతున్నారని విమర్శించారు. ప్రజల ప్రయోజనాల దృష్ట్యా ఆ సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
HYD: నగర యువతలో ఇప్పుడు ‘అప్‌సైక్లింగ్’ ఒక మతంలా మారుతోంది. మురికివాడల్లో పారేసిన టైర్లు, విరిగిన ప్లాస్టిక్ డబ్బాలను సేకరించి వాటిని లగ్జరీ ఫర్నీచర్‌గా మార్చి ఆన్‌లైన్‌లో అమ్ముతున్నారు. ఇది కేవలం వ్యాపారం కాదు.. పర్యావరణం మీద వారికున్న ‘యూనిక్’ ప్రేమ. పాత సామన్ల మార్కెట్ (జుమ్మెరాత్ బజార్) వీరి పాలిట ఇప్పుడు ఒక ఐడియా బ్యాంక్‌గా మారింది.