AP: శ్రీవారి లడ్డూ అంశంలో కూటమి ప్రభుత్వం డ్యామేజ్ అయిందని ఎమ్మెల్సీ అనంతబాబు తెలిపారు. లడ్డూ నెయ్యి అంశం డైవర్ట్ చేయడానికి తన కేసు మళ్లీ తెరపైకి తీసుకొచ్చారని చెప్పారు. అన్యాయంగా తన భార్యను కేసులో ఇరికించారని.. న్యాయపోరాటం చేస్తానని స్పష్టం చేశారు. అధికారులు సహకరిస్తే.. 7 నెలలు జైల్లో ఎందుకు ఉంటానని నిలదీశారు.
AP: తాను పరారీలో లేనని MLC అనంతబాబు స్పష్టం చేశారు. వ్యక్తిగత పనుల మీద బిజీగా ఉన్నానని.. తనకు పోలీసులు నోటీసులు ఇవ్వలేదని తెలిపారు. తన డిఫాల్ట్ బెయిల్‌ని సుప్రీంకోర్టు పర్మినెంట్ బెయిల్ చేసిందని చెప్పారు. వైసీపీలో యాక్టివ్‌గా ఉన్న వాళ్లని ఏదోరకంగా ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. తన భార్యను, తనను మానసికంగా వేధిస్తున్నారని ఆవేదన చెందారు.
ELR: గణపవరం శ్రీ చింతలపాటి బాపిరాజు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. విద్యార్థులు అరగంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకున్నారు. పరీక్ష కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలులో ఉంది. సీఐ రజిని కుమార్ పర్యవేక్షించారు. మొదటి సంవత్సరం జనరల్ విద్యార్ధులు వొకేషనల్ విద్యార్ధులు పరీక్షలు రాయునున్నారు.
GNTR: పొన్నూరు మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు ఆదేశాల మేరకు, శానిటేషన్ ఇన్స్పెక్టర్ పోతురాజు ఆధ్వర్యంలో సోమవారం ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమం చేపట్టారు. నిడుబ్రోలు ఓవర్ బ్రిడ్జి వద్ద ప్రధాన డ్రైన్‌లోని పూడికను (సిల్ట్) సిబ్బంది తొలగించారు. పట్టణంలో దోమల నివారణ కోసమే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు.
BDK: జూలూరుపాడు మండలంలో క్రీడాకారుల కోసం ఏర్పాటు చేసిన మైదానాలు నిర్వహణ లోపంతో పాడైపోతున్నాయి. వ్యాయామం, వాకింగ్‌కు అవసరమైన సదుపాయాలు లేకపోవడంతో యువత దూరమవుతోంది. పిచ్చిమొక్కలు, చెత్తతో మైదానాలు దెబ్బతినగా, వెంటనే అభివృద్ధి చేయాలని యువకులు డిమాండ్ చేస్తున్నారు. సంబంధిత అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ATP: జిల్లాలో ఈ ఏడాది మామిడి పూత ఆశాజనకంగా ఉన్నా, మారుతున్న వాతావరణం రైతులను కలవరపెడుతోంది. ఫిబ్రవరిలో ఆలస్యంగా వచ్చిన పూత జూన్ నాటికి కాయలుగా మారి కోతకు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎండలు పెరుగుతుండటంతో పూత మాడి రాలిపోతోంది. దీంతో ముందస్తుగా తోటలు కొన్న వ్యాపారులు, పెట్టుబడి పెట్టిన రైతులు నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
NTR: కంచికచర్ల పట్టణంలోని స్థానిక చెవిటికల్లు సెంటర్లో సోమవారం ఆటో డ్రైవర్లకు ఎస్సై నాని నరేందర్ కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఆటోలను ఇష్టానుసారంగా ఎక్కడపడితే అక్కడ నిలిపి ఇతర వాహనాదారులకు ఇబ్బంది కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
VZM: జనసేన సభ్యత్వ నమోదు ఈనెల 26 నుంచి ప్రారంభం కానుందని నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవి తెలిపారు. ఈ సందర్బంగా భోగాపురం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ నాయకులతో ఆమె ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సమావేశంలో గ్రామ స్థాయి నుంచి సభ్యత్వ నమోదు ప్రక్రియను విస్తృతంగా చేపట్టాలని, ప్రతి నాయకుడు సమన్వయంతో బాధ్యతలు నిర్వర్తించాలని సూచించారు.
SDPT: కొమురవెల్లిలో చేర్యాల సీఐ రమేశ్ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం పోలీసులు అదనపు బలగాలతో ‘ప్లాగ్ మార్చ్’ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. శాంతిభద్రతలు పరిరక్షణ కోసం పోలీసులకు ప్రజలు సహకరించాలన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా ప్రవర్తిస్తే ఉపేక్షించేది లేదన్నారు. గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు.
AP: కృష్ణా జిల్లా పామర్రు మండలం డీపీగూడెంలో దారుణం జరిగింది. తండ్రిని కొడుకు మహేష్ కత్తితో పొడిచి చంపాడు. వేడినీళ్ల విషయంలో తండ్రి మందలించాడని ఘాతుకానికి ఒడిగట్టాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
BHNG: జిల్లాలో భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం రీ-సర్వే చేపట్టింది. భువనగిరి చందుపట్ల, బొమ్మలరామారం మునిరాబాద్ గ్రామాలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. డిజిటల్ మ్యాపింగ్ ద్వారా ప్రతి ఇంచు భూమికి హద్దులు నిర్ణయించి, రైతులకు ‘భూధార్’ కార్డులు జారీ చేస్తారు. త్వరలో జిల్లావ్యాప్తంగా ఈ ప్రక్రియ విస్తరించడం ద్వారా భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం లభించనుంది.
ముంబై-పుణె ఎక్స్‌ప్రెస్‌వేపై ఇటీవల భారీ ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకున్న వాహనదారులకు మహారాష్ట్ర సర్కార్ ఊరట కల్పించింది. ఆ సమయంలో టోల్ చెల్లించిన సుమారు 1.2 లక్షల వాహనాలకు రూ.5.16 కోట్లను తిరిగి చెల్లించనున్నట్లు మహారాష్ట్ర రాష్ట్ర రోడ్డు అభివృద్ధి సంస్థ (MSRDC) ప్రకటించింది. రానున్న వారంలోగా ఈ మొత్తాన్ని నేరుగా వాహనదారుల ఫాస్టాగ్ ఖాతాల్లో జమ చేయనున్నారు.
NLR: బుచ్చి మండలంలో ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. విద్యార్థులు ఉదయాన్నే ఎనిమిది గంటలకు పరీక్ష కేంద్రాలకు హాజరయ్యారు. అధికారులు హాల్ టికెట్లు క్షుణ్ణంగా పరిశీలించి, విద్యార్థులను లోపలికి అనుమతించారు. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
MDK: మాసాయిపేట మండల కేంద్రంలో వెలసిన శ్రీ రుక్మిణి పాండురంగ విఠలేశ్వర ఆలయ 22వ వార్షికోత్సవం ఈనెల 28న నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు కాసుల హరిరంజన్ శర్మ, రఘు శర్మలు తెలిపారు. వార్షికోత్సవం పురస్కరించుకొని శ్రీ రుక్మిణి పాండురంగ విఠలేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం, శ్రీ మాధవానంద సరస్వతి స్వామి అనుగ్రహ భాషణం, చక్రి భజన తదితర కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.
హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.2,070 పెరిగి రూ.1,61,350కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,900 పెరిగి రూ.1,47,900 పలుకుతోంది. ఇక, కిలో వెండి ధర రూ.10,000 పెరిగి రూ.3 లక్షలకు చేరింది. దాదాపు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు ఉన్నాయి.