SRPT: మేళ్లచెరువు రామలింగేశ్వర స్వామి జాతర ద్వారా మొత్తం రూ. 45,43,657 లక్ష్లల ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో శంభిరెడ్డి మంగళవారం తెలిపారు. టికెట్ ద్వారా రూ. 15 లక్షలు, ఉండి ద్వారా రూ. 12 లక్షలు, వేలం పాటల ద్వారా రూ. 6 లక్షలు లభించాయి. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఆదాయం రూ. 6 లక్షలు వరకు పెరిగిందని ఆయన తెలియజేశారు.
KNR: మానకొండూరు మండలం మద్దికుంట గ్రామపంచాయతీలో మంగళవారం శ్రీధర్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద ఐదుగురికి ఉచిత గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేశారు. నిరుపేద కుటుంబాలు కట్టెల పొయ్యి వాడకం వల్ల అనారోగ్యానికి గురవుతున్నాయని, పేదలను దృష్టిలో ఉంచుకుని పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కవిత, ఉప సర్పంచ్ పాల్గొన్నారు.
BHNG: టూరిజం మాస్టర్ ప్లాన్ తయారీలో భాగంగా ఇవాళ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కరరావు సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. టూరిజం మాస్టర్ ప్లాన్ రూపకల్పనలో రెండు రోజులలో ప్రణాళికలు సిద్ధం చేయాలని అన్నారు. రాచకొండ, భువనగిరి ఫోర్ట్, మహదేవ్ పూర్, యాదాద్రి టెంపుల్, కొలనుపాకలను గుర్తించి ప్రణాళికలు రూపొందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
BPT: ప్రైవేట్ అంబులెన్స్ యజమానులు ప్రభుత్వం నిర్ణయించిన రేట్లనే వసూలు చేయాలని కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ ఆదేశించారు. మంగళవారం చార్జీల పోస్టర్‌ను ఆవిష్కరించిన ఆయన, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అధిక వసూళ్లపై ఫిర్యాదు చేసేందుకు 7702806804 టోల్ ఫ్రీ నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.
PPM: కొమరాడ మండలం వన్నాంగ్రామ పరిసర ప్రాంతాల్లో ఏనుగుల గుంపు సంచరిస్తున్నట్లు అటవీ శాఖ సిబ్బంది మంగళవారం తెలిపారు. రైతులు, గ్రామస్థులు అప్రమత్తంగా ఉండాలని వారు సూచించారు. ఏనుగులు కనిపిస్తే కవ్వింపు చర్యలకు పాల్పడరాదన్నారు. చేతికందొచ్చిన పంటను ఏనుగులు ధ్వంసం చేస్తున్నాయని రైతులు వాపోతున్నారు. వీటిని ఈ ప్రాంతం నుంచి తరలించాలని స్థానికులు కోరుతున్నారు.
SKLM: నరసన్నపేట ఎమ్మెల్యే రమణమూర్తి మంగళవారం కుటుంబ సమేతంగా ఇంద్రకీలాద్రి పై కొలువున్న శ్రీ కనక దుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ మేరకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించి, అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు. అమ్మవారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలపై ఉండాలని కోరుకున్నట్లు ఆయన తెలిపారు.
MDCL: ఉప్పల్ నుంచి చిలుకా నగర్ వెళ్లే మార్గంలో కావేరి నగర్ కమాన్ వద్ద పైపులైన్ కోసం తవ్వగా రోడ్డు అత్యంత ఇరుకుగా మారి పరిస్థితి, అధ్వానంగా మారింది. దీంతో తీవ్రంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడడం, ప్రమాదకరంగా వాహనదారులు అటువైపు వెళుతున్న పరిస్థితి. దీనిపై అనేక కథనాలు వెలువడినప్పటికీ, మున్సిపల్ అధికారులకు తెలిసినా నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు.
పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటుతున్న దక్షిణాది చిత్రాలకు ‘ధురంధర్ 2’ రూపంలో గట్టి పోటీ ఎదురుకాబోతుందని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అభిప్రాయపడ్డాడు. దక్షిణాది సినిమాలు సృష్టించిన బెంచ్ మార్క్‌ను ఈ సినిమా తుడిచేసే అవకాశం ఉందని పేర్కొన్నాడు. ప్రేక్షకులు ఒక్కసారి ఈ తరహా సినిమా రుచి చూస్తే.. రొటీన్ మసాలా సినిమాలు ప్రమాదంలో పడినట్లేనని RGV హెచ్చరించాడు.
PPM: బాల్య వివాహాలు సామాజిక శాపమని, అందుకే వాటి పట్ల అవగాహన పెంపొందించుకోవాలని జిల్లా బాలల సంరక్షణ విభాగం చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ (NIC) ఎం.ఏ.నాయుడు పేర్కొన్నారు. మంగళవారం పాచిపెంట మండలంలోని కొత్తవలస, కర్రివలస ZPHSలో ప్రత్యేక సదస్సులను ఆయన నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఐసీడీఎస్ ఆధ్వర్యంలో విద్యాసంస్థల్లో అవగాహన కార్యక్రమం చేపట్టారు.
TG: మాజీమంత్రి KTR జైలుకు వెళ్లే సమయం దగ్గరపడిందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. BRS పదేళ్లలో ఎంతమందిపై అక్రమ కేసులు పెట్టారని ప్రశ్నించారు. మంత్రి కాన్వాయ్‌పై దాడి చేస్తే చూస్తూ ఊరుకోవాలా అని మండిపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా ప్రవర్తించారని విమర్శించారు. దానికి ప్రతిఫలం ఇప్పుడు అనుభవిస్తున్నారన్నారు.
MDK: జిల్లాలో ఇంటర్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. రామాయంపేట సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో ఇంటర్ పరీక్షల ఏర్పాట్లను పరిశీలించారు. జిల్లావ్యాప్తంగా 28 ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు వివరించారు. సీసీటీవీ కెమెరాలు, త్రాగునీరు, విద్యుత్తు, మెడికల్ కిట్లు ఏర్పాటు చేశామన్నారు.
BDK: నూతనంగా ఎన్నికైన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్‌ను మంగళవారం ప్రకృతి ప్రేమికులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రకృతి హరితదీక్ష ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. చిన్నతనం నుంచే మొక్కలు నాటడాన్ని అలవాటుగా చేసుకోవడం శుభపరిణామమని, నైనికను ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని కోరారు.
✦ విశాఖలో రూ.2,387 కోట్లతో నిర్మించే సెమీకండక్టర్ పరిశ్రమకు ఆమోదం✦ అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ప్రాజెక్టుల ఏర్పాటుకు ఆమోదం✦ ఉన్నత విద్య, నైపుణ్యాభివృద్ధి శాఖలను అభివృద్ధి చేయాలని నిర్ణయం✦ వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై నిర్ణయం✦ కొల్లేరు అభయారణ్య సరిహద్దుల ప్రతిపాదనకు ఆమోదం✦ సైన్స్, టెక్నాలజీ, ఇన్నోవేషన్ శాఖ ఏర్పాటు చేయాలని నిర్ణయం
MHBD: ఆకేరు వాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ సీజ్ చేసినట్లు పెద్దవంగర SI చిలువేరు ప్రమోద్ తెలిపారు. తొర్రూరు మండలంలోని బొంతుపల్లి తండాకు చెందిన గుగులోతు సురేష్ నెల్లికుదురు మండలంలోని బ్రాహ్మణ కొత్తపల్లి గ్రామంలోని ఆకేరు వాగు నుంచి పెద్దవంగర మండలానికి ఇసుక తరలిస్తున్న క్రమంలో సీజ్ చేసి,అతనిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
JN: పాలకుర్తి (M) కేంద్రంలోని గూడూరు గిరిజన బాలికల గురుకుల పాఠశాల & కళాశాలలో నిన్న జరిగిన సంఘటనపై గురుకులాల సెక్రటరీ, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఇవాళ గురుకులాన్ని సందర్శించి విచారణ చేపట్టినట్లు DY సెక్రటరీ D.S వెంకన్న తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గురుకుల పాఠశాలలో భోజనం ఆలస్యం కావడం వలన విద్యార్థుల ధర్నా చేసినట్లు విచారణ తేలిందని తెలిపారు.