• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘సంజీవిని సేవలపై ప్రజలకు అవగాహన కల్పించాలి’

CTR: సంజీవని ప్రాజెక్ట్ సమర్థవంతంగా అమలు చేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. గురువారం స్థానిక కలెక్టరేట్‌లో పలమనేరు నియోజకవర్గానికి చెందిన డాక్టర్లతో నాల్గవ సమావేశం నిర్వహించి, డిజిటల్ నర్స్ సెంటర్ మరియు “సంజీవిని” ప్రాజెక్ట్‌పై సమీక్ష సమావేశం నిర్వహించారు. సంజీవినిసేవలపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలని సూచించారు.

February 26, 2026 / 06:46 PM IST

అబ్దుల్లాపురంలో వివాహిత ఆత్మహత్య

NDL: కొలిమిగుండ్ల(మం) అబ్దుల్లాపురంలో ఇవాళ జూటూరు పుష్పావతి అనే వివాహిత పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. మృతురాలి తల్లి గురమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రమేష్ బాబు తెలిపారు.

February 26, 2026 / 06:45 PM IST

కంచికచర్లలో డ్రగ్స్‌పై అవగాహన ర్యాలీ

NTR: కంచికచర్ల మండలం కీసర టోల్ ప్లాజా నుంచి విద్యార్థులు, యువతతో కలిసి డ్రగ్స్‌పై అవగాహన సైకిల్ ర్యాలీ యాత్ర పోలీస్ వారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు, ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పోలీస్ కమిషనర్ ఎస్ వి. రాజశేఖర్ బాబు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు, ప్రజలు, డ్రగ్సకి దూరంగా ఉండాలన్నారు. ఈ ర్యాలీలో భారీ ఎత్తున విద్యార్థులు పాల్గొన్నారు.

February 26, 2026 / 06:44 PM IST

గుర్రపు డెక్క తొలగింపు పనుల పర్యవేక్షణ

MDCL: పీర్జాదిగూడ చెరువులో గుర్రపు డెక్క తొలగింపు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ పనులను ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుంగతుర్తి రవి పర్యవేక్షించారు. గుర్రపు డెక్క వెంట వెంటనే తొలగించాలని సంబంధిత కాంట్రాక్టర్‌ని ఆయన ఆదేశించారు. గుర్రపు డెక్కల వలన దోమలు పెరిగి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కావున ప్రజలకు అసౌకర్యం కలగకుండా పనులు పూర్తి చేయాలని అన్నారు.

February 26, 2026 / 06:44 PM IST

బాల్యవివాహాలను అరికట్టాలి: ఎంపీ

ELR: బాల్య వివాహాలను అరికట్టాలని ఏలూరు ఎంపీ మహేష్ కుమార్ యాదవ్ సూచించారు. గురువారం బాల్య వివాహ విముక్తి రథాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. బాల్య వివాహం చట్టరీత్యా నేరమని అన్నారు. 18 సంవత్సరాల కంటే తక్కువ వయసున్నవారికి వివాహం చేయడం సమంజసం కాదని అన్నారు. మనమందరం కలిసికట్టుగా బాల్య వివాహ మూలాలను నిర్మూలించాలని చెప్పుకొచ్చారు.

February 26, 2026 / 06:44 PM IST

రోడ్డు భద్రతపై ACP సారంగపాణి అవగాహన

KMM: బోనకల్ పోలీస్ స్టేషన్ పరిధిలో “అరైవ్ అలైవ్ క్యాంపెయిన్-2026” నిర్వహించారు. వైరా ఏసీపీ సారంగపాణి వాహనదారులకు రోడ్డు నిబంధనలపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల కలిగే ప్రాణనష్టం, కుటుంబాలపై పడే ప్రభావం మరియు చట్టపరమైన చర్యల గురించి ఆయన హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించి సురక్షితంగా ప్రయాణించాలని కోరారు.

February 26, 2026 / 06:43 PM IST

లిక్కర్ స్కామ్.. అవినాష్‌కు రిమాండ్

AP: లిక్కర్ కేసులో నిందితుడిగా ఉన్న ముప్పిడి అవినాష్ విచారణ ముగిసింది. లిక్కర్ కేసులో A7గా ఉన్న అవినాష్‌ను సిట్ అధికారులు ACB కోర్టులో హాజరుపరిచారు. విచారణ చేపట్టిన కోర్టు రేపటి వరకు రిమాండ్ విధించింది. అనంతరం అవినాష్‌ను గుంటూరు జిల్లా జైలుకు తరలించాలని ఆదేశాలు జారీ చేసింది. కాగా, సుప్రీంకోర్టు ఆదేశాలతో అవినాష్ ఇవాళ ఉదయం పోలీసుల ఎదుట లొంగిపోయిన విషయం తెలిసిందే.

February 26, 2026 / 06:42 PM IST

ఆచంటలో పిచ్చికుక్క దాడి

W.G. ఆచంటలో గురువారం ఓ పిచ్చికుక్క స్వైరవిహారం చేస్తూ గ్రామస్తులను భయభ్రాంతులకు గురిచేసింది. కచేరి సెంటర్, ఎం‌వీఆర్ కళాశాల రహదారి, ముత్యాలమ్మ గుడి ప్రాంతాల్లో ఐదుగురు విద్యార్థులతో సహా సుమారు 15 మందిపై దాడి చేసింది. కుక్కకాటుకు గురైన వారంతా PHCలో చికిత్స పొందుతున్నారు. వీధుల్లో కుక్కల బెడద పెరిగిపోవడంతో అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు.

February 26, 2026 / 06:42 PM IST

అభివృద్ధి పనుల ఆలస్యంపై ఫయాజ్ అహ్మద్ ఆవేదన

KRNL: ఆదోనిలో కౌన్సిల్ బడ్జెట్ సమావేశంలో వైసీపీ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, మున్సిపల్ కౌన్సిలర్ ఫయాజ్ అహ్మద్ ఇవాళ మైనార్టీ కాలనీ, నిజాముద్దీన్ కాలనీ ప్రాంతాల అభివృద్ధి పనుల ఆలస్యాన్ని ప్రస్తావించారు. రూ.21.60 లక్షల పనులు భూమిపూజ చేసినప్పటికీ ప్రారంభం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

February 26, 2026 / 06:41 PM IST

ఇందిరమ్మ ఇండ్ల పనులను వేగంగా చేయండి

SRPT: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయించి, రూ.22,500 కోట్ల బడ్జెట్‌తో పనులు వివిధ దశల్లో ఉన్నాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. గురువారం హుజూర్ నగర్‌లోని రామస్వామి వద్ద 110 ఎకరాలలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల ప్లాట్ల పెండింగ్ పనులను జిల్లా కలెక్టర్ తేజస్ నంత్ లాల్ పవార్‌తో కలిసి పరిశీలించారు.

February 26, 2026 / 06:41 PM IST

కుమ్మెర ఘటనపై ఎస్పీ క్లారిటీ

NGKL: కుమ్మెర మల్లన్న జాతర ఘర్షణపై గురువారం జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ స్పందించారు. రెండు వర్గాల మధ్య జరిగిన దాడులపై కేసులు నమోదు చేసి, ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు. శిశువు మృతిపై అనుమానాస్పద కేసు నమోదు చేశామని, పోస్టుమార్టం నివేదిక ఆధారంగా అవసరమైతే మర్డర్ సెక్షన్లు చేరుస్తామన్నారు.

February 26, 2026 / 06:41 PM IST

‘పదవ తరగతి పరీక్షలకు విద్యార్థులు సిద్ధం కావాలి’

MHBD: నెల్లికుదురు మండల కేంద్రంలోని మోడల్ స్కూలులో ఇవాళ ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్సై రమేష్ బాబు పాల్గొని మాట్లాడుతూ.. త్వరలో పదవ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్న తరుణంలో పరీక్షలకు విద్యార్థులు సిద్ధం కావాలని, పరీక్షలు అంటే భయం లేకుండా ధైర్యంగా రాయాలని సూచించారు.

February 26, 2026 / 06:40 PM IST

పవర్‌లిఫ్టింగ్‌లో మెరిసిన యువతి.. MLA అభినందన..!

HYD: హరిద్వార్‌లో జరిగిన నేషనల్ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో కాంస్య పతకం సాధించిన ఓల్డ్ బోయినపల్లికి చెందిన ఎం.తనయను MLA వివేకానంద అభినందించారు. తనయ ఇటీవల జిల్లా స్థాయిలో వెయిట్ లిఫ్టింగ్‌లో రజతం, CM పవర్ లిఫ్టింగ్ పోటీల్లో స్వర్ణ, రజత పతకాలు కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా గురువారం MLA క్యాంపు కార్యాలయంలో ఆమెను MLA సన్మానించారు.

February 26, 2026 / 06:40 PM IST

నియోజకవర్గ సమస్యలపై సీఎంతో మాట్లాడిన ఎమ్మెల్యే

PLD: అసెంబ్లీ సమావేశాల అనంతరం ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ సీఎం చంద్రబాబుతో ముచ్చటించారు. నియోజకవర్గ సమస్యలపై సీఎం చంద్రబాబుకు వివరించారు. గ్రామాల్లో నిర్వహిస్తున్న వంద రోజులు 100 గ్రామాలు కార్యక్రమం గురించి తెలిపారు. ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి అవసరమైన మేర పరిష్కరిస్తున్నామన్నారు. నియోజకవర్గానికి నిధులు కేటాయించాలని భాష్యం కోరారు.

February 26, 2026 / 06:40 PM IST

టైలర్స్ డేను జయప్రదం చేయండి: బాజీ ఉల్లా

SRPT: కుట్టు మిషన్ ఆవిష్కరించి లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించిన విలియమ్స్ హో జయంతిని పురస్కరించుకుని ఫిబ్రవరి 28న నిర్వహించే టైలర్స్ డేను విజయవంతం చేయాలని జిల్లా టైలర్స్ యూనియన్ నాయకులు బాజీ ఉల్లా తెలిపారు. గురువారం స్థానిక గాంధీ పార్క్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. టైలర్ వృత్తి గౌరవాన్ని కాపాడుతూ, సంఘటితంగా కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు.

February 26, 2026 / 06:40 PM IST