• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

నేడు జడ్పీ స్థాయి సంఘ సమావేశాలు

కడప: ప్రజా పరిషత్ స్థాయి సంఘ సమావేశాలను మంగళవారం ఉదయం 10 గంటలకు జిల్లా జడ్పీ కార్యాలయంలో నిర్వహించనున్నట్లు జడ్పీసీఈవో ఓబులమ్మ తెలిపారు. జిల్లా ప్రజా పరిషత్ ఉపాధ్యక్షులు, జడ్పీటీసీ, కో-ఆప్షన్ సభ్యులు హాజరు కావాలని కోరారు. అధికారులు శాఖాపరమైన ప్రగతి నివేదికలతో సమావేశాలకు రావాలన్నారు. హాజరుకాని వారిపై శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని ఆమె హచ్చరించారు.

February 24, 2026 / 04:40 AM IST

పాము కాటుకు అన్నదాత మృతి

అన్నమయ్య: వ్యవసాయ పనుల కోసం పొలానికి వెళ్లిన ఓ రైతు పాముకాటుకు గురై ప్రాణాలు కోల్పోయిన ఘటన బి.కొత్తకోట మండలంలో విషాదం నింపింది. గట్టు గ్రామానికి చెందిన బాబు (60) సోమవారం తన పొలంలో కూరగాయల పంటలో కలుపు తీస్తుండగా పాము కాటేసింది. కుటుంబ సభ్యులు వెంటనే మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

February 24, 2026 / 04:32 AM IST

ఆదిలాబాద్‌లో తిరిగి ప్రారంభమైన పత్తి కొనుగోళ్లు

ADB: ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో నిలిచిపోయిన పత్తి కొనుగోళ్లు ఎంపీ గోడం నగేష్ జోక్యంతో పునఃప్రారంభమయ్యాయి. కొనుగోళ్లు ఆగిపోవడంతో ఆందోళనలో ఉన్న రైతుల సమస్యను బీజేపీ నాయకురాలు చిట్యాల సుహాసిని ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు. తక్షణమే స్పందించిన ఎంపీ, అధికారులతో మాట్లాడి ప్రక్రియను పునరుద్ధరించారు. తమకు అండగా నిలిచిన నేతలకు రైతులు కృతజ్ఞతలు తెలిపారు.

February 24, 2026 / 04:13 AM IST

‘గ్రామ అభివృద్ధిలో NRIల సేవలు అభినందనీయం’

SRCL: గ్రామ అభివృద్ధిలో ఎన్నారైల సేవలు అభినందనీయమని వేములవాడ ఐఏఎస్పీ రిత్విక్ సాయి అన్నారు. చందుర్తి మండలం మల్యాల గ్రామంలో ఎన్నారైల ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీకి వైకుంఠ రథాన్ని సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. విదేశాల్లో ఉండి కూడా గ్రామాభివృద్ధికి సహాయం చేయవచ్చన్నారు.

February 24, 2026 / 04:12 AM IST

భారీ కలప లోడ్డుతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా..!

చిత్తూరు: వెదురుకుప్పం (M) పెరుమాళ్లపల్లి పాఠశాల సమీపంలో సోమవారం సాయంత్రం భారీ లోడ్‌తో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడింది. పోలీసుల వివరాల మేరకు.. వెదురుకుప్పం నుంచి పళ్లిపట్టుకు భారీ కలప లోడ్‌తో వెళుతున్న ట్రాక్టర్ స్పీడ్ బ్రేకును దాటేసమయంలో ట్రాలీ ఒక్కసారిగా రెండుగా విరిగి బోల్తా పడింది. ఇద్దరు వ్యక్తులకు పెను ప్రమాదమే తప్పడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు.

February 24, 2026 / 04:07 AM IST

భారీ కలప లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా..!

చిత్తూరు: వెదురుకుప్పం (M) పెరుమాళ్లపల్లి పాఠశాల సమీపంలో సోమవారం సాయంత్రం భారీ లోడ్‌తో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడింది. పోలీసుల వివరాల మేరకు.. వెదురుకుప్పం నుంచి పళ్లిపట్టుకు భారీ కలప లోడ్‌తో వెళుతున్న ట్రాక్టర్ స్పీడ్ బ్రేకును దాటేసమయంలో ట్రాలీ ఒక్కసారిగా రెండుగా విరిగి బోల్తా పడింది. ఇద్దరు వ్యక్తులకు పెను ప్రమాదమే తప్పడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు.

February 24, 2026 / 04:07 AM IST

నేరుగా శాస్త్రవేత్తలతో మాట్లాడే అవకాశం

KNR: హుజూరాబాద్ పట్టణ శివారులోని కే.సీ క్యాంప్ రైతు వేదిక వద్ద మంగళవారం ఉదయం 9:30 నుండి 11 గంటల వరకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ‘రైతు నేస్తం’ కార్యక్రమం ఉంటుందని ఏఈఓ నిఖిల్ కుమార్ తెలిపారు. యాసంగి పంటల యాజమాన్యం, నిషేధిత HT పత్తి సాగుపై రైతులు నేరుగా శాస్త్రవేత్తలతో మాట్లాడి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చని ఆయన సూచించారు.

February 24, 2026 / 04:01 AM IST

‘నేరుగా శాస్త్రవేత్తలతో మాట్లాడే అవకాశం’

KNR: హుజూరాబాద్ పట్టణ శివారులోని కే.సీ క్యాంప్ రైతు వేదిక వద్ద మంగళవారం ఉదయం 9:30 నుండి 11 గంటల వరకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ‘రైతు నేస్తం’ కార్యక్రమం ఉంటుందని ఏఈఓ నిఖిల్ కుమార్ తెలిపారు. యాసంగి పంటల యాజమాన్యం, నిషేధిత HT పత్తి సాగుపై రైతులు నేరుగా శాస్త్రవేత్తలతో మాట్లాడి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చని ఆయన సూచించారు.

February 24, 2026 / 04:01 AM IST

‘సమస్యాత్మక ప్రాంతాలు గుర్తించాలి’

జగిత్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. డీఆర్ఎస్సీ సమావేశంలో ట్రాఫిక్ సిగ్నల్స్ మరమ్మతులు, బ్లాక్ స్పాట్ల గుర్తింపు, రంబుల్ స్టిప్స్ ఏర్పాటు,సైన్ బోర్డుల ఏర్పాటు వంటి చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఎన్‌హెచ్-63, ఎన్‌హెచ్-563 రహదారులపై సమస్యాత్మక ప్రాంతాలను తక్షణం పరిష్కరించాలని సూచించారు.

February 24, 2026 / 04:00 AM IST

ఫిబ్రవరి 24: మంగళవారం పంచాంగం

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం; ఉత్తరాయణం; శిశిర రుతువు, ఫాల్గుణ మాసం, శుక్ల పక్షం సప్తమి: ఉ.7-48  ఆష్టమి తె.5-17 తదుపరి నవమి; కృత్తిక: మ.3-56 తదుపరి రోహిణి; వర్జ్యం: లేదు; అమృత ఘడియలు: మ.1-14 నుంచి 3-11 వరకు; దుర్ముహూర్తం: ఉ.8-45 నుంచి 9-31 వరకు, తిరిగి రా.10-59 నుంచి 11-48 వరకు; రాహుకాలం: సా.3-00 నుంచి 4-30 వరకు; సూర్యోదయం: ఉ.6.26; సూర్యాస్తమయం: సా6.-01 గంటలకు.

February 24, 2026 / 02:00 AM IST

T20 WC: చిత్తుగా ఓడిన జింబాబ్వే

విండీస్‌తో T20 WC సూపర్ 8 మ్యాచులో జింబాబ్వే 107 రన్స్ తేడాతో చిత్తుగా ఓడింది. తొలుత బ్యాటింగ్ చేసిన కరేబియన్లు 254/6 స్కోర్ చేయగా.. లక్ష్యచేధనలో జింబాబ్వే 147 పరుగులకే ఆలౌటైంది. విండీస్ బౌలర్లలో గూడకేష్ 4, అకీల్ 3, ఫోర్ట్ 2 వికెట్లు పడగొట్టారు. అనూహ్యంగా సూపర్-8కు చేరిన జింబాబ్వేకి ప్రస్తుత టోర్నీలో ఇదే తొలి ఓటమి. మరోవైపు కరేబియన్ల జైత్రయాత్ర కొనసాగుతోంది.

February 23, 2026 / 10:48 PM IST

వైద్య విధాన పరిషత్ పేరు మార్పు

TG: రాష్ట్రంలోని జిల్లా, మండల కేంద్రాల్లో గల ఆస్పత్రుల్లో వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరావు పేర్కొన్నారు. 1998 వ్యాధులకు రాష్ట్రవ్యాప్తంగా 652 ఆస్పత్రుల్లో చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, ఈ మేరకు రాష్ట్ర వైద్య విధాన పరిషత్‌ను డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్‌గా మారుస్తున్నట్లు తెలిపారు.

February 23, 2026 / 10:40 PM IST

పెన్షనర్లు, ఉద్యోగులకు గుడ్‌న్యూస్

TG: రాష్ట్రంలోని ఉద్యోగులు, పెన్షనర్ల ఆరోగ్య భద్రత కోసం రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రమాదంలో మరణించినవారికి రూ.కోటీ 25 లక్షలు ఇవ్వాలని, అలాగే 65 ఏళ్లలోపు ఏ ఉద్యోగైనా సహజ మరణంతో చనిపోతే వారికి రెగ్యులర్ బెనిఫిట్స్‌తో పాటు అదనంగా రూ.10 లక్షలు ఇచ్చే స్కీమ్ తీసుకురావాలని నిర్ణయించినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరావు తెలిపారు. 

February 23, 2026 / 10:30 PM IST

ప్రభాస్ ‘ఫౌజీ’లో భారీ వార్ సీక్వెన్స్

ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ‘ఫౌజీ’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రం ఇప్పటికే 70 శాతం చిత్రీకరణను పూర్తి చేసుకుంది. రాబోయే షెడ్యూల్‌లో 20 నిమిషాల పాటు సాగే ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను షూట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇది సినిమాకే ప్రధాన హైలైట్‌గా నిలవబోతుందట. ప్రభాస్ ఆర్మీ ఆఫీసర్‌గా కనిపిస్తుండటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.

February 23, 2026 / 10:19 PM IST

‘మాజీ సొసైటీ ఛైర్మన్ త్వరగా కోలుకోవాలి’

BDK: హైదరాబాద్ బంజారాహిల్స్ ఏసియన్ అరోరా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దమ్మపేట మాజీ సొసైటీ ఛైర్మన్ యెల్లిన రాఘవరావుని ఎమ్మెల్యే జారె ఆదినారాయణ సోమవారం పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అక్కడి వైద్యులతో మాట్లాడి అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు. అత్యుత్తమ వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు.

February 23, 2026 / 10:15 PM IST