NTR: నందిగామ ఎంపీడీవో ఆర్.వి.యస్. ప్రసాదరావు గురువారం అంబారుపేట గ్రామంలో పర్యటించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇంటింటికీ వెళ్లి జరుగుతున్న హౌస్ టాక్స్ వసూళ్లను స్వయంగా పరిశీలించారు. నిర్దేశించిన రోజువారీ లక్ష్యాలను ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకుండా, సమయానికి పూర్తి చేయాలని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు.
ఖమ్మం జిల్లాలోని రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతాల్లో వన్యప్రాణుల సంచారం పెరిగింది. అటవీ శాఖ ఏర్పాటు చేసిన కెమెరా ట్రాప్లలో ఇటీవల చిరుతపులి, ఎలుగుబంటికి సంబంధించిన దృశ్యాలు నిక్షిప్తమయ్యాయి. ఇది జిల్లా అటవీ పర్యావరణ వ్యవస్థలో జీవవైవిధ్యం ఆరోగ్యంగా ఉందనడానికి నిదర్శనమని అధికారులు తెలిపారు.
HYD: ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్‌ను వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వేం నరేందర్ రెడ్డిని శాలువాతో సత్కరించి, అభినందనలు తెలిపారు. తెలంగాణ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎంపికైన ఆయన కాంగ్రెస్ పార్టీ అధికారిక అభ్యర్థిగా బీ-ఫామ్‌ను అందుకున్నారు.
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం చిలుకోడు సమీపంలో గురువారం ఉదయం ఆటో బోల్తా పడి ఓ యువకుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే 108కు సమాచారం అందించగా సంఘటన స్థలానికి చేరుకున్న 108 ఈఎంటి లింగంపల్లి శ్రీనివాస్ పైలట్ సైదులు ప్రథమ చికిత్సను అందించి రక్తస్రావమును అరికట్టి మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
VZM: ఎల్.కోట మండలం ఆర్.జి.పేట పరిసర ప్రాంతాల్లో నెలకొన్న తీవ్ర విద్యుత్ సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి అసెంబ్లీలో కోరారు. ఆర్.జి.పేట సమీపంలో ఉన్న పరిశ్రమల కారణంగా చుట్టుపక్కల ఉన్న సుమారు 15 గ్రామాలకు లో-వోల్టేజ్ సమస్య తలెత్తుతోందని, దీనివల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆమె సభ దృష్టికి తీసుకువచ్చారు.
VSP: 2024 అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ సాధించిన ముగ్గురు నేతల ఫొటోను మంత్రి లోకేశ్ పంచుకున్నారు. లోకేశ్, పల్లా, గంటా శ్రీనివాసరావు కలిసి ఉన్న ఈ ఫొటోలో గెలుపు తమపై ఉన్న బాధ్యతను గుర్తు చేస్తోందన్నారు. ప్రజలు ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ నిబద్ధతతో సేవ చేస్తామని తెలిపారు.
WGL: రాయపర్తి మండలం మైలారం రిజర్వాయర్‌లో గురువారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభించింది. మత్స్యకారులు దేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సారెస్పీ కెనల్‌లో ఆగిపోయిన నీటి ప్రవాహం కారణంగా దేహం బయటకు వచ్చింది. వెంటనే అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీశారు. పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు ప్రారంభించారు.
VKB: రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల కాలపరిమితిని ఏప్రిల్ 30 వరకు పొడిగించింది. వికారాబాద్ జిల్లాకు చెందిన జర్నలిస్టులు తమ కార్డులను రెన్యువల్ చేసుకోవాలని జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి (DPRO) సూచించారు. మీడియా విలేకరులు, కార్యాలయ పని వేళల్లో ఉదయం 10:30 గంటల నుంచి తమ ఒరిజినల్ కార్డుపై పొడిగింపు స్టిక్కర్ వేయించుకోవాలని కోరారు.
ఉమ్మడి విశాఖ జిల్లాలో 2,684 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వాటిలో 1,584 కేంద్రాలు అద్దె భవనాల్లో నడుస్తున్నాయని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్ బాబు తెలిపారు. అసెంబ్లీలో ఆయన భవనాల నిర్మాణంతో పాటు కేంద్రాల్లో కనీస సదుపాయాలకు నిధులు కేటాయించాలని కోరారు. సదుపాయాలు కల్పిస్తేనే పిల్లల హాజరు పెరుగుతుందని అన్నారు.
ADB: ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి గ్రామస్తులు ముందుకు రావాలని ప్రధాన ఉపాధ్యాయుడు ఆనంద్ అన్నారు. తాంసి మండలంలోని కప్పర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు పరీక్ష సామాగ్రిని రిటైర్డ్ ఉపాధ్యాయుడు విలాస్ గురువారం అందజేశారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని ఆనంద్ పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, విద్యార్థులు తదితరులున్నారు.
VSP: పద్మనాభం మండలం పొట్నూరు గ్రామంలో కొలువు దీరిన పరదేశమ్మ తల్లి జాతర ఈ నెల 9, 10, 11వ తేదీల్లో నిర్వహించనున్నారు. ఈ ఏడాది భారీ ఎత్తున్న జాతర చేయనున్నట్లు గ్రామ పెద్దలు, యువత తెలిపారు. అదేవిధంగా అమ్మవారిని దర్శించుకోవడానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చే వారికి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.
KDP: ఎర్రగుంట్లలోని మండల పరిషత్ కార్యాలయ సభా భవనంలో ఈ నెల 7వ తేదీన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు ఎంపీడీవో వెంకటరమణయ్య తెలిపారు. ఈ సమావేశ కార్యక్రమానికి అధికారులు, ప్రజాప్రతినిధులు, సర్పంచ్‌లు తప్పక హాజరుకావాలని ఆయన కోరారు. ప్రగతి పనులకు సంబంధించి నివేదికలను తప్పక సమర్పించాల్సి ఉంటుందన్నారు. సమావేశ కార్యక్రమానికి ఎవరు గైర్హాజరు కావద్దని హెచ్చరించారు.
KRNL: చాగలమర్రి మండలంలో ప్రైవేటు పాఠశాలల్లో ఒకటో తరగతి ప్రవేశాల కోసం పేద విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 10వ తేదీ చివరి తేదీ అని మండల విద్యాధికారి న్యామతుల్లా ఇవాళ తెలిపారు. విద్యా హక్కు చట్టం-2009 ప్రకారం 25 శాతం సీట్లు పేదలకు కేటాయిస్తారని పేర్కొన్నారు. దరఖాస్తు చేసిన విద్యార్థులకు లాటరీ విధానంలో సీట్లు కేటాయిస్తారని ఆయన వెల్లడించారు.
KMM: వైరా మున్సిపాలిటీలోని 15వ వార్డులో దోమల నివారణకు గురువారం ప్రత్యేక చర్యలు చేపట్టారు. కౌన్సిలర్ నల్లమోతు శైలజ సురేష్ ఆధ్వర్యంలో మున్సిపల్ సిబ్బంది వార్డు అంతటా ఫాగింగ్ చేయించి, నివారణ మందును పిచికారీ చేయించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వ్యాధులు ప్రబలకుండా ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.
విశాఖలో నడిరోడ్డుపై వ్యక్తి విగతజీవిగా పడిఉన్నాడు. అందరూ చూస్తున్నారే గానీ ఎవరూ పట్టించుకోవడంలేదు. గంటల తరబడి మృతదేహం అలాగే ఉన్నా సమీపంలో ట్రాఫిక్ పోలీసులు సైతం పట్టించుకోలేదు. ఇసుకతోట జంక్షన్ వెంకజిపాలెం వెళ్లే మార్గంలో ప్రధాన రహదారిపై గంటల తరబడి మృతదేహం అలానే ఉంది. దీనిపై స్థనికులు ఆగ్రహ వ్యక్తం చేస్తున్నారు.