• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

మహిళా సంఘ భవనానికి భూమి పూజ

SRPT: నడిగూడెం మండల పరిధిలోని కరివిరాల గ్రామ పంచాయతీలో పొదుపు మహిళా బృంద సమావేశ మందిర (VO బిల్డింగ్) నిర్మాణానికి గురువారం సర్పంచ్ మరోజు పార్వతమ్మ భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళా సంఘాల బలోపేతానికి, వారి సమావేశాల నిర్వహణకు ఈ భవనం ఎంతో దోహదపడుతుందన్నారు.

February 26, 2026 / 02:18 PM IST

సీనియర్ కమ్యూనిస్టుకి సీపీఐ ఘన నివాళులు

VSP: సీనియర్ కమ్యూనిస్టు నాయకుడు, స్వాతంత్ర సమరయోధుడు ఆర్.నల్లకన్ను మరణంపై సీపీఐ జిల్లా సమితి సంతాపం వ్యక్తం చేసింది. జిల్లా కార్యదర్శి షేక్ రహిమాన్ మాట్లాడుతూ.. 1925 డిసెంబర్ 26న జన్మించిన నల్లకన్ను స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని జైలు జీవితం గడిపారని తెలిపారు. బడుగు బలహీనుల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన ఆయన నిజాయితీకి ప్రతీకగా నిలిచారని కొనియాడారు.

February 26, 2026 / 02:18 PM IST

217 మంది విద్యార్థులు గైర్హాజరు

AKP: జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా పకడ్బందీగా జరుగుతున్నట్లు జిల్లా ఇంటర్ అధికారి ఎం వినోద్ బాబు తెలిపారు. గురువారం జరిగిన సెకండ్ ఇయర్ పరీక్షకు 217 విద్యార్థులు గైర్హాజరు అయినట్లు పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 34 పరీక్షా కేంద్రాల్లో 12,390 మంది విద్యార్థులు హాజరు కావలసి ఉండగా 12,173 మంది హాజరైనట్లు తెలిపారు.

February 26, 2026 / 02:17 PM IST

మున్సిపల్ ఛైర్ పర్సన్‌కు నేమ్ ప్లేట్ కానుక

JGL: జగిత్యాల మున్సిపల్ నూతన ఛైర్ పర్సన్ సమిండ్ల వాణిపై అభిమానాన్ని ఓ వడ్రంగి వినూత్నంగా చాటుకున్నారు. సంగంపల్లికి చెందిన గుగ్గిళ్ల వెంకటేశ్ రెండు రోజుల పాటు శ్రమించి, టేకు కర్రపై ఆమె పేరును అందంగా చెక్కారు. గురువారం ఆ ప్రత్యేక నేమ్ ప్లేట్‌ను ఛైర్ పర్సన్‌ను బహూకరించారు. వృత్తిపై మక్కువతో ఆయన చేసిన ఈ పనిని సమిండ్ల వాణి అభినందించారు.

February 26, 2026 / 02:17 PM IST

కౌన్సిలర్లతో కలిసి వార్డులు పర్యటించిన ఛైర్మన్

WGL: నర్సంపేట మున్సిపల్ ఛైర్మన్ పెండెం లక్ష్మీ రామానంద్ ఇవాళ కౌన్సిలర్లతో కలిసి పట్టణంలోని పలు వార్డులను పర్యటించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సహకారంతో వేసవి కాలంలో పట్టణ ప్రజలకు మంచినీటి కొరత లేకుండా నూతన బోర్లు వేయించేందుకు కృషి చేస్తానని తెలిపారు. అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానని పేర్కొన్నారు.

February 26, 2026 / 02:17 PM IST

బ్యాంకింగ్ సేవల వినియోగంపై అవగాహన

SDPT: కోహెడ మండలం సీసీ పల్లెలో బెజ్జంకి ఆర్థిక అక్షరాస్యత కేంద్రం ఆధ్వర్యంలో ఆర్థిక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బ్యాంకింగ్ సేవల వినియోగం, పొదుపు ప్రాముఖ్యత, బీమా పథకాల వివరాలు ప్రజలకు తెలియజేశారు. కేవైసీ అప్‌డేట్ అవసరాన్ని వివరించి, సైబర్ మోసాల నుంచి జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీజీబీ ఫీల్డ్ ఆఫీసర్ మోహన్, సర్పంచ్ సంపత్ పాల్గొన్నారు.

February 26, 2026 / 02:16 PM IST

ఘనంగా ఎల్లమ్మ తల్లి ఉత్సవం

SKLM: దైవచింతన, సేవాభావం రెండు సమాజానికి అవసరమని పలాస నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త వెంకన్న చౌదరి అన్నారు. గురువారం పలాసలో శ్రీ ఎల్లమ్మ తల్లి జాతర ఉత్సవం ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆయన పార్టీ శ్రేణులతో కలిసి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

February 26, 2026 / 02:16 PM IST

రైతు ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి: ఏవో

SRD: కంగ్టి మండలంలోని రైతులు పీఎం కిసాన్ పథకాన్ని లబ్ధి పొందడానికి ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని ఏవో హరీష్ పవార్ అన్నారు. 22వ విడత పీఎం కిసాన్ పథకానికి ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులకు మాత్రమే వస్తాయని చెప్పారు. ఈనెల 28వ తేదీ వరకు అవకాశం ఉందని పేర్కొన్నారు. తమ క్లస్టర్ పరిధిలో ఏఈవోల దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు.

February 26, 2026 / 02:16 PM IST

పదిమంది విద్యార్థులు పరీక్షకు దూరం

MNCL: జన్నారంలో నిర్వహించిన ఇంటర్ పరీక్షను 4 విద్యార్థులు రాయలేదని అధికారులు తెలిపారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 142 మంది విద్యార్థులకు గాను 138 మంది పరీక్ష రాశారు. నలుగురు పరీక్ష రాయలేదు. దండేపల్లి జూనియర్ కళాశాలలో 155 మంది విద్యార్థులకు గాను 153 మంది పరీక్ష రాయగా, ఇద్దరు రాయలేదు. లక్షెటిపేట కళాశాలలో 211 మంది విద్యార్థులకు గాను నలుగురు పరీక్ష రాయలేదు.

February 26, 2026 / 02:16 PM IST

ఎమ్మెల్యేను కలిసిన నూతన మున్సిపల్ పాలకవర్గం

NGKL: మున్సిపల్ కార్యాలయంలో నూతన పాలకవర్గం హిందూ, మైనారిటీ, క్రిస్టియన్ మత పెద్దల ఆశీర్వాదంతో భాధ్యతలు స్వీకార కార్యక్రమం గురువారం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే కుచ్చుకుళ్ల రాజేష్ రెడ్డి గారి సమక్షంలో మున్సిపల్ ఛైర్మన్‌గా తీగల సునేంద్ర కుమార్, వైస్ ఛైర్మన్‌గా బాదం రమేష్ గారు బాధ్యతల స్వీకారం చేశారు.

February 26, 2026 / 02:15 PM IST

గురుకులాల పాఠశాల ప్రవేశ పరీక్ష వాయిదా

NLR: గురుకులాల్లో 6 నుంచి 10వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి మార్చి 2న ప్రవేశ పరీక్ష నిర్వహించాల్సి ఉంది. అయితే పరీక్షను అదే నెల 8వ తేదీకి వాయిదా వేసినట్లు ఆ సంస్థ నెల్లూరు జిల్లా సమన్వయకర్త ప్రభావతమ్మ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. 9వ తరగతి విద్యార్థులకు ఎస్ఏ 2 పరీక్షలను నిర్వహిస్తున్న నేపథ్యంలో వారి సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

February 26, 2026 / 02:15 PM IST

జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమం

VZM: గజపతినగరంలో జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం గురువారం మాజీ మంత్రి పడాల అరుణ ఆధ్వర్యంలో జరిగింది. సభ్యత్వంతో జనసేన కుటుంబాలకు అండగా ఉంటూ బీమా చెల్లించడం జరుగుతుందన్నారు. ఇందులో నియోజకవర్గ ఇంఛార్జ్ మర్రపు సురేష్, మండల పార్టీ అధ్యక్షులు మునకాల జగన్నాధరావు, నీటి సంఘం నాయకులు తాళ్లపూడి సౌమిత్రి త్రివేది, కృష్ణ పాల్గొన్నారు.

February 26, 2026 / 02:14 PM IST

షీటీం మద్దతుతో కుటుంబ సమస్యలు పరిష్కారం

NRML: ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ జానకి షర్మిల పర్యవేక్షణలో షీటీం గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు. కుటుంబ వివాదాలతో బాధపడుతున్న వారికి షీటీం సిబ్బంది ప్రత్యేక కౌన్సిలింగ్ అందించి విడిపోయిన వారిని మళ్లీ కలిపారు. నిర్మల్ వరకు వెళ్లాల్సిన భారం లేకుండా భైంసాలోనే సౌకర్యం కల్పించడంపై బాధితులు హర్షం వ్యక్తం చేశారు.

February 26, 2026 / 02:13 PM IST

బ్రాహ్మణచెరువులో NCD సర్వే

W.G: పెనుమంట్ర(మం) బ్రాహ్మణచెరువులో గురువారం ఏఎన్ఎం లక్ష్మి, ఆశా కార్యకర్తలు ముమ్మరంగా NCD సర్వే నిర్వహించారు. ఇంటింటికీ తిరుగుతూ.. గ్రామస్థులకు బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల పరీక్షలు నిర్వహించి వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అవగాహన కల్పించారు.

February 26, 2026 / 02:13 PM IST

APRCETలో చిలుకూరికి 14వ ర్యాంక్

E.G: ఏపీ విద్యాశాఖ నిర్వహించిన APRCETలో కడియంకి చెందిన ఉపాధ్యాయుడు చిలుకూరి శ్రీనివాసరావు రాష్ట్ర వ్యాప్తంగా 14వ ర్యాంక్ సాధించాడు. రాష్ట్రంలో 17 విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న పీహెచ్డీ సీట్లు భర్తీ చేసేందుకు 2025 నవంబర్‌లో APRCET పరీక్షలు జరిగాయి. పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం పరీక్షలు నిర్వహించి గురువారం ఫలితాలు వెల్లడించింది.

February 26, 2026 / 02:13 PM IST