GDWL: గద్వాల ఎస్పీ ఆదేశాల మేరకు శుక్రవారం రాత్రి అయిజ పట్టణంలోని గాంధీ చౌక్ ఏరియాలో 50 మంది సిబ్బందితో డీఎస్పీ వై. మొగిలయ్య భారీ కార్డెన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో సరైన ధ్రువపత్రాలు లేని 76 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అనుమానిత వ్యక్తుల వివరాలు సేకరించిన డీఎస్పీ, కాలనీల్లో భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
MDCL: అందాన్ని డబులు చేస్తామని ఉప్పల్ పరిధి గణేష్ నగర్ కాలనీకి చెందిన రమ్యకు మెసేజ్ వచ్చింది. నమ్మిన రమ్య కాల్ చేసి అడగగా డైరెక్ట్ ఆన్ లైన్ ద్వారా రూ.4,500 పేమెంట్ చేస్తే, వెంటనే ఇంటికి వస్తామని పేర్కొన్నారు. పేమెంట్ చేసి దాదాపు 15 రోజులు గడుస్తున్నప్పటికీ స్పందన లేదని, ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారని రమ్య వాపోయారు.
వీరాసనం మోకాళ్లు చీలమండలు, తొడలను బలోపేతం చేస్తూ జీర్ణక్రియను మెరుగుపరిచి వెన్నుముకను నిటారుగా ఉంచడంలో సహాయపడుతుంది. జీర్ణ అవయవాలకు రక్తప్రసరణను పెంచి అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గిస్తుంది. నడుము దిగువ భాగంలో నొప్పిని తగ్గిస్తుంది. ఇది ధ్యానానికి అనుకూలమైన భంగిమ కాబట్టి ఏకాగ్రతను పెంచి ఆందోళనను తగ్గిస్తుంది. దిగువ శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.
BPT: రేపల్లె మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం శనివారం ఉదయం 11 గంటలకు కౌన్సిల్ హాల్‌లో జరగనుంది. ఛైర్మన్ కట్ట మంగ అధ్యక్షతన నిర్వహించనున్న ఈ భేటీలో తాగునీరు, శానిటేషన్, అభివృద్ధి పనులతో సహా మొత్తం 14 అంశాలపై చర్చించనున్నట్లు కమిషనర్ సాంబశివరావు తెలిపారు. ఈ సమావేశానికి కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు పాల్గొనాలని తెలిపారు.
BHPL: జిల్లా ఐడిఓసీ కార్యాలయంలో 10వ తరగతి ఉత్తమ ఫలితాల సాధన పై విద్యాశాఖ ఆధ్వర్యంలో అధికారులు, ప్రధానోపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, DEO రాజేందర్ పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాను ఉత్తమ ఫలితాల్లో ముందంజలో నిలిపేందుకు సమిష్టి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
TG: రాష్ట్రంలోని ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్ల ఫీజుల దందాకు చెక్ పెట్టేందుకు ఎట్టకేలకు సర్కారు సిద్ధమైంది. ఇష్టారాజ్యంగా ఫీజులు పెంచే ఆనవాయితీకి బ్రేక్ వేస్తూ.. శాస్త్రీయంగా ఫీజులను నిర్ణయించే ప్రక్రియను స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు వేగవంతం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 11వేల ప్రైవేటు స్కూళ్లలో ప్రస్తుతం వసూలు చేస్తున్న ఫీజులు, గత ఆదాయ, వ్యయాలను సేకరించాలని నిర్ణయించారు.
E.G: కొవ్వూరు మండల విద్యాశాఖ అధికారి (ఎంఈవో-1)గా ఉందుర్తి శాంసన్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ నాయకులు ఎండీ ఇమ్రాన్ భాషా, కె. శ్రీనివాసన్, పీవీ రవికుమార్, డి. మహేష్ తదితరులు ఆయనను కలిసి శాలువాతో ఘనంగా సత్కరించారు. నూతన ఎంఈవోకు శుభాకాంక్షలు తెలిపి స్వాగతం పలికారు. మండలంలోని పలువురు ఉపాధ్యాయులు, సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు.
GNTR: తెనాలి 36వ వార్డులో శుక్రవారం రాత్రి జరిగిన జనసేన ‘ఉద్యమి’ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ప్రతి కార్యకర్త ఒక ఉద్యమంలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రతీ ఒకరు సభ్యత్వం తీసుకుని రాబోవు రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేయాలని కోరారు.
SDPT: ఆయిల్ ఫామ్ సాగుపై శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్లో ఉద్యానశాఖ, ఆయిల్ ఫామ్ అధికారులతో కలెక్టర్ హైమావతి సమీక్ష నిర్వహించారు. ఆయిల్ ఫ్రైడ్ అధికారుల పనితీరు మందకోడిగా ఉందని అసహనం వ్యక్తం చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు.
AP: విజయనగరం జిల్లాలో ఇవాళ CM చంద్రబాబు పర్యటించనున్నారు. రావివలస గ్రామంలో NTR భరోసా పింఛన్లను సీఎం పంపిణీ చేయనున్నారు. రావివలసలో HPV వ్యాక్సినేషన్ కార్యక్రమంలో బాలికలతో మాట్లాడనున్నారు. ప్రధాని మోదీ ఢిల్లీ నుంచి నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొననున్నారు. సాయంత్రం TDP కార్యకర్తలతో సమావేశం కానున్నారు. రాత్రికి అమరావతికి చేరుకోనున్నారు.
తిరుమల అన్నమయ్య భవన్‌లో నేడు TTD బోర్డు మీటింగ్ జరగనుంది. వార్షిక బడ్జెట్ రూ.5,400 కోట్లు ప్రతిపాదనపై చర్చ జరగనుంది. విద్యా ప్రమాణాలు పెంపు, వకుళామాత ఆలయంలో అక్షరాభ్యాసం, భద్రతా సిబ్బంది నియామకం, లగేజీ తనిఖీ కోసం ఎక్స్ రే బ్యాగేజీ, 51 మంది అర్చకుల ప్రమోషన్ తదితర 87 అంశాలతో మీటింగ్ జరగనుంది. వీటిపై కీలక నిర్ణయం తీసుకోనుంది.
HYD: మార్చి నెలలో ఎండలు ప్రారంభమై, 38 డిగ్రీల ఉష్ణోగ్రత వరకు పెరిగే అవకాశం ఉన్నట్లుగా HYD అధికారులు తెలిపారు. దీని ద్వారా నీటి అవసరాలు సైతం పెరుగుతాయని వివరించారు. ఎండలో బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని, వీలుంటే గొడుగు తీసుకుని వెళ్లటం మంచిదని సూచించారు. నగరంలో వడగాలులు సైతం వీచే అవకాశం ఉందన్నారు.
ప్రకాశం: సింగరాయకొండ నరసింహస్వామి దేవస్థానంలో ఇవాళ బహిరంగ వేలం పాటలు జరుగుతాయని ఈవో కృష్ణవేణి తెలిపారు. కొబ్బరికాయలు, పూజా ద్రవ్యాలు, కొబ్బరి చిప్పులు, సప్లై సామాను, తలనీలాలు వేలంలో ఉంటాయని చెప్పారు. ఉదయం 10 గంటలకు కార్యాలయం వద్ద పాల్గొనవచ్చని వెల్లడించారు. ఇవాళ స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పిస్తారన్నారు.
HNK: వేలేరు మండల కేంద్రంలో నాబార్డ్, డీఆర్‌డీఏ సహకారంతో మండల మహిళా సమైక్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్రామ దుకాణాన్ని నాబార్డ్ డీడీఎం చంద్రశేఖర్ శుక్రవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. మహిళలు స్వయంగా తయారు చేసిన హస్తకళలు, చేనేత బ్యాగులు, దుస్తులు వంటి గ్రామీణ ఉత్పత్తులను విక్రయించేందుకు ఈ దుకాణం దోహదపడుతుందని తెలిపారు. ఇది ఆర్థికంగా ప్రోత్సాహం అన్నారు.
నిర్మల్‌లోని వెంకటాపూర్ కాలనీలో ఓ ఇంటి ఆవరణలోని వలలో చిక్కుకున్న కోతి సుమారు ఆరు గంటల పాటు విలవిలలాడింది. ఈ విషయాన్ని గమనించిన ఇంటి యజమాని శాంతినగర్‌కు చెందిన వన్యప్రాణి ప్రేమికుడు గరిగంటి అనిల్‌కు సమాచారం అందించారు. ఆయన తన మిత్రబృందంతో కలిసి 45 నిమిషాల పాటు శ్రమించి వలను కత్తిరించి కోతిని సురక్షితంగా విడిపించారు.