• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

దూది వెంకటాపురంలో స్వపరిపాలన దినోత్సవ వేడుకలు..!

BHNG: మండలలోని కేంద్రమైన దూది వెంకటాపురంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్వపరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయురాలు విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఉపాధ్యాయులు సమన్వయంతో విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించే ఉద్దేశంతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

March 2, 2026 / 08:06 PM IST

‘మహిళల భాగ్యస్వామ్యంతోనే మెరుగైన సమాజం’

WNP: అంతర్జాతీయ మహిళా దినోత్సవం వారోత్సవాల్లో భాగంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. సోమవారం వనపర్తి జిల్లాలో మహిళా సంఘాల సభ్యులతో సమీక్షించారు. న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రజని మాట్లాడుతూ సర్పంచులు, వార్డు మెంబర్లు గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలని సూచించారు.

March 2, 2026 / 08:05 PM IST

డ్రంక్ అండ్ డ్రైవ్.. 9 మందికి రూ.90 వేల జరిమానా

CTR: మద్యం సేవించి వాహనాలు నడిపిన 9 మందిని పోలీసులు పట్టుకుని 1st స్పెషల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున మొత్తం రూ.90,000 జరిమానా విధించారు. జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు ట్రాఫిక్ తనిఖీలు నిర్వహించారు. మద్యం సేవించి వాహనం నడపడం ప్రమాదకరమని పోలీసులు హెచ్చరించారు.

March 2, 2026 / 08:05 PM IST

మెట్‌పల్లి కమిషనర్‌గా స్పందనకు అదనపు బాధ్యతలు

JGL: మెట్‌పల్లి మున్సిపల్ కమిషనర్ మోహన్ పదవీ విరమణతో, జగిత్యాల మున్సిపల్ కమిషనర్‌గా ఉన్న స్పందనకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ కమిషనర్ & డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, హైదరాబాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా హెచ్ఎం స్పందన మెట్‌పల్లి మున్సిపల్ కమిషనర్‌గా సోమవారం బాధ్యతలు స్వీకరించారు.

March 2, 2026 / 08:05 PM IST

మహిళ దినోత్సవ సదస్సు గోడపత్రిక ఆవిష్కరణ

TPT: మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని, అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కే.ఆర్. సూర్యనారాయణ భారీ సదస్సుకు సంబంధించిన గోడపత్రికను కాళహస్తిలోని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగాలలో మహిళల పాత్ర కీలకమని, మహిళా ఉద్యోగుల సమస్యలు, వారి హక్కులను వివరించారు.

March 2, 2026 / 08:05 PM IST

అంతరాష్ట్ర ఎర్రచందన స్మగ్లర్లు అరెస్ట్

TPT: తిరుపతి అదనపు ఎస్పీ కులశేఖర్ ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ సిబ్బంది దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఎర్రచందన స్మగ్లింగ్ చేస్తున్న 8 మంది ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి 195 ఎర్రచందనం దుంగలు, వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు రూ.5 కోట్లు ఉంటుందని తెలిపారు. బృందాన్ని అభినందిస్తూ అధికారులకు రివార్డులు ప్రకటించారు. 

March 2, 2026 / 08:04 PM IST

‘మహనీయుల ఆశయ సాధనకు కృషి చేయాలి’

MNCL: మహనీయుల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్లు పి. చంద్రయ్య, శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. కలెక్టరేట్‌లో సోమవారం మాజీ స్పీకర్ దుద్దిళ్ళ శ్రీపాదరావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. శ్రీపాదరావు మంథని ఎమ్మెల్యేగా ప్రజలకు ఎనలేని సేవలు చేశారని తెలిపారు.

March 2, 2026 / 08:04 PM IST

‘మైనర్లకు వాహనాలు ఇస్తే చర్యలు తప్పవు’

SRPT: మైనర్లు వాహనాలు నడపడం వారి ప్రాణాలకే కాకుండా, ఇతరుల ప్రాణాలకు కూడా అత్యంత ప్రమాదకరమని, తల్లిదండ్రులు తమ పిల్లలకు వాహనాలు ఇచ్చి వారి భవిష్యత్తును ప్రమాదంలో పడేయవద్దని సూర్యాపేట పట్టణ ట్రాఫిక్ ఎస్సై సాయిరాం హెచ్చరించారు. జిల్లా కేంద్రంలోని 60 ఫీట్ల రోడ్డులో ఇవాళ సాయంత్రం నిర్వహించిన మైనర్ డ్రైవింగ్ స్పెషల్ డ్రైవ్‌లో ఆయన మాట్లాడారు.

March 2, 2026 / 08:03 PM IST

నాచగిరి ఉత్సవాలకు ఎంపీకి ఆహ్వానం

SDPT: వర్గల్ మండలం నాచారం గుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలను ఈ నెల 8 నుంచి 19 వరకు నిర్వహిస్తున్నారు. బ్రహ్మోత్సవాలలో పాల్గొనాలని మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావుకు ఆలయ ఈవో రంగాచారి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఉత్సవాలలో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో గోపాలకృష్ణ శర్మ, కృష్ణమాచార్యులు, సుధాకర్ పాల్గొన్నారు.

March 2, 2026 / 08:02 PM IST

‘1976 ఓటర్ లిస్ట్ ప్రకారం క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వాలి’

ADB: లంబాడీలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 5న నిర్వహించే మహా ధర్నాను విజయవంతం చేయాలని గంగాధర్ కోరారు. సిరికొండలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 1976 ఓటర్ లిస్టు ప్రకారం లంబాడీలకు క్యాస్ట్ సర్టిఫికెట్ ఇవ్వాలన్నారు. అలాగే టీటీడీని లంబాడీలకు అప్పగించి బతుకమ్మ చీరల స్థానంలో ఘూగ్రో కచోళి ఇవ్వాలన్నారు.

March 2, 2026 / 08:02 PM IST

గుంటూరు అభివృద్ధిపై పెమ్మసాని సమీక్ష

GNTR: కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అధ్యక్షతన సోమవారం జరిగిన జీఎంసీ సమీక్షలో ఎమ్మెల్యే గళ్ళా మాధవి పాల్గొన్నారు. నార్ల ఆడిటోరియం పనులు మార్చి 16న ప్రారంభమవుతాయని, డ్రెయిన్లలో పూడికతీత పనులు మే నెలాఖరుకల్లా పూర్తి చేయాలని ఆమె ఆదేశించారు. ముస్లింల కోసం ఖబరస్థాన్‌ స్థల కేటాయింపు, వీధి కుక్కల నియంత్రణ, వేసవిలో నీటి ఎద్దడి లేకుండా చూడాలని ఆదేశించారు.

March 2, 2026 / 08:00 PM IST

రాహుల్ గాంధీని కలిసిన ఎమ్మెల్యే

NGKL: జిల్లా అచ్చంపేట ఎమ్మెల్యే, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ వంశీకృష్ణ ఇవాళ కుటుంబ సభ్యులతో కలిసి వికారాబాద్లో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీని కలిశారు. అనంతరం ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో గత ముప్పై ఏళ్లుగా పని చేస్తూ, పార్టీ బలోపేతం కోసం చేసిన కృషిని, పలు అంశాల గురించి వివరించినట్లు తెలిపారు.

March 2, 2026 / 08:00 PM IST

ఉపాధి హామీ గోడపత్రికలను ఆవిష్కరించిన కలెక్టర్

కృష్ణా: మచిలీపట్నం కలెక్టరేట్లో జిల్లా నీటి యాజమాన్య సంస్థ రూపొందించిన వికసిత్ భారత్ జీరాంజీ ఉపాధి హామీ గోడ పత్రికలను కలెక్టర్ బాలాజీ సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీరాంజీ పథకం 2026-2027 ఆర్థిక సంవత్సరం నుండి అమలులోకి వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ నవీన్, అధికారులు పాల్గొన్నారు.

March 2, 2026 / 08:00 PM IST

తాగునీటి పనులు వేగవంతం చేయండి: ఎమ్మెల్యే

అనంతపురం రూరల్, ఆత్మకూరు మండలాల్లో జల జీవన్ మిషన్ పనులను వెంటనే ప్రారంభించాలని ఎమ్మెల్యే పరిటాల సునీత ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. పెండింగ్ నిధుల మంజూరుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించారని తెలిపారు. రూ.90 కోట్లకు పైగా వ్యయంతో జరుగుతున్న ఈ పనుల ద్వారా 50 గ్రామాలకు తాగునీరు అందుతుందని వివరించారు.

March 2, 2026 / 08:00 PM IST

మహిళల భద్రతకు ప్రాధాన్యం: ఎస్పీ

అంతర్జాతీయ మహిళా దినోత్సవం వారోత్సవాల సందర్భంగా కడపలో భారీ ర్యాలీ నిర్వహించారు. కోటిరెడ్డి సర్కిల్ నుంచి సెవెన్ రోడ్స్ వరకు జరిగిన ర్యాలీని SP షెల్కే నచికేత్ విశ్వనాథ్ సోమవారం జెండా ఊపి ప్రారంభించారు. మహిళలు, బాలికల భద్రతకు పోలీస్ శాఖ అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని ఆయన తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 112కు కాల్ చేయాలని సూచించారు.

March 2, 2026 / 08:00 PM IST