నల్గొండలో మైనర్లకు పొగాకు ఉత్పత్తుల విక్రయంపై పోలీసులు కఠిన చర్యలు ప్రారంభించారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు టూ టౌన్ ఎస్సై సైదులు స్థానిక పాన్ షాపుల యాజమాన్యాలకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. మైనర్లకు పొగాకు విక్రయిస్తే కేసులు నమోదు చేసి, లైసెన్సులు రద్దు చేస్తామని స్పష్టం చేశారు. అలాగే పాఠశాలలు, కళాశాలల 100 మీటర్ల పరిధిలో ఉన్న దుకాణాలను మూసివేయాలని సూచించారు.
BDK: గ్రామ అభివృద్ధికి ఆటంకంగా ఉన్న అంశాలను, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఎమ్మెల్యేకు నాయకులు వివరించారు. మణుగూరు మండలంలోని గుట్ట మల్లారం గ్రామ పంచాయతీలో నెలకొన్న పలు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గ్రామ ప్రతినిధులు సోమవారం ఎమ్మెల్యే వెంకటేశ్వర్లును కలిశారు. మణుగూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయనకు వినతిపత్రం సమర్పించారు.
ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ జానీ బెయిర్‌స్టో కుటుంబంతో సహా దుబాయ్‌లో చిక్కుకున్నాడు. బెయిర్‌స్టో కొద్ది రోజుల కిందట కుటుంబంతో కలిసి దుబాయ్ పర్యటనకు వెళ్లాడు. వారు తిరిగి స్వదేశానికి బయల్దేరాల్సిన సమయంలో యుద్ధం ప్రారంభం కావడంతో విమానాశ్రయాలు మూసివేయబడ్డాయి. దీంతో అక్కడే చిక్కుకుని పోయామని బెయిర్‌స్టో స్వయంగా పేర్కొన్నాడు.
BPT: పర్చూరు నియోజకవర్గంలో రహదారుల మరమ్మతుల కోసం కూటమి ప్రభుత్వం రూ. 5.40 కోట్లు మంజూరు చేసినట్లు సోమవారం ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు తెలిపారు. దీనికి సంబంధించి జీవో ఆర్టీ నం. 115 కూడా విడుదలయిందని పేర్కొన్నారు. తిక్కరాజుపాలెం-చెరుకూరు సహా పలు కీలక రోడ్ల పునరుద్ధరణ వల్ల రైతులు, విద్యార్థుల రవాణా కష్టాలు తీరుతాయని ఆయన హర్షం వ్యక్తం చేశారు.
NLR: ఇఫ్కో కిసాన్ సెజ్ కి భూములు ఇచ్చిన రైతులు ఆనందంగా లేరని సీపీఎం నాయకులు గోని దయాకర్ తెలిపారు. కొడవలూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. రైతులు సంతోషంగా ఉన్నారని ప్రజాప్రతినిధులు మాట్లాడడం దారుణం అన్నారు. ఎరువులు కర్మాగారం ఏర్పాటు చేస్తామని రైతులు సాగు చేసుకుంటున్న భూములను స్వాధీనం చేసుకుని సహాయం చేసి చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు.
SRCL: పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న అంగన్వాడీ, గ్రామపంచాయతీ, హెల్త్ సబ్ సెంటర్స్ తుది దశ భవన నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ, 15 ఆర్థిక సంఘం నిధులు, ఎన్ హెచ్ ఎం, డీఎంఎఫ్టీ ఇతర నిధులతో పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో మహిళా సమాఖ్య, గ్రామ పంచాయతీ, అంగన్వాడీ భవనాలు, పూర్తిచేయాలన్నారు.
KKD: PGRS అర్జీల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఎస్పీ బిందుమాధవ్ అధికారులకు సూచించారు. సోమవారం కాకినాడ ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన PGRS కార్యక్రమంలో 44 మంది ఫిర్యాదుదారుల నుంచి అర్జీలు స్వీకరించారు. అర్జీలను సంబంధిత అధికారులకు అందజేసి సకాలంలో పరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
KMR: జిల్లావ్యాప్తంగా నేడు జరిగిన ఇంటర్ పబ్లిక్ పరీక్ష ముగిసింది. మొత్తం 37 పరీక్షా కేంద్రాల్లో 10,581 మంది విద్యార్థులకు గాను 10,173 మంది హాజరయ్యారు. 408 మంది విద్యార్థులు గైర్హాజరు కాగా, జిల్లాలో సగటు హాజరు శాతం 96.14గా నమోదైందని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. అన్ని కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన నిఘా, మౌలిక వసతులు కల్పించినట్లు వారు తెలిపారు.
PDPL: 2026-27 విద్యా సంవత్సరానికి తెలంగాణ మోడల్ స్కూల్ ప్రవేశాలకు దరఖాస్తు గడువును ఈనెల 10 వరకు పొడిగించినట్లు ధర్మారం మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ రాజ్కుమార్ ఇవాళ తెలిపారు. 6వ తరగతిలో పూర్తి సీట్లు, 7 నుంచి 10 తరగతులకు మిగిలిన సీట్లకు ఏప్రిల్ 19న ప్రవేశ పరీక్ష ఉంటుందని ఆయన పేర్కొన్నారు. కావున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులను కోరారు.
TPT: గూడూరు, తిప్పవరపాడు పరిసర ప్రాంతాలలో హిజ్రాల నిలువు దోపిడీ చేస్తున్నారు. పరువు భయంతో సామాన్యులు అల్లాడిపోతున్నారు. జేబుల్లో చేతులు బట్టలు విప్పేసి బరి తెగిస్తున్నారు. ఓ మహిళ నా దగ్గర లేవు అంటున్నా బ్యాగ్ చూపించు అంటూ దౌర్జన్యం చేస్తున్నారు. దీనిపై స్పందించాల్సిన పోలీసులు తమకు ఫిర్యాదులు రాలేదంటూ మిన్నకుంటుండడంతో హిజ్రాలు ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి.
ప్రకాశం: మార్కాపురం మండలం పెద్దనాగులవరం గ్రామంలో సెంటు వాగు పోరంబోకు స్థలాన్ని ఆక్రమించి పశువుల షెడ్డు నిర్మించడానికి ప్రయత్నిస్తున్నట్లు సోమవారం ఎమ్మార్వో కార్యాలయానికి ఫిర్యాదు వచ్చింది. ఈ క్రమంలో ఎమ్మార్వో చిరంజీవి ఆ ప్రాంతాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా షెడ్డు నిర్మించిన వారిని షెడ్డు నిర్మించడానికి గుర్తించి, నోటీసులు ఇచ్చారు.
AP: కల్తీ పాల ఘటనలో మృతుల సంఖ్య ఆరుకు చేరింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చౌడేశ్వరి నగర్‌కు చెందిన సత్యనారాయణ అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. అయితే, కల్తీపాల ఘటనలో ఇది వరకే ఆరుగురు ప్రాణాలు కోల్పోగా పలువురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
విజయనగరం నియోజకవర్గం గోసంరక్షణ సమితిలో మార్వాడి కమ్యూనిటి వారు ముందుస్తుగా ఏర్పాటుచేసిన హోలీ సంబరాలలో సోమవారం ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు పాల్గొన్నారు. ఈసందర్బంగా చిన్నా, పెద్దా అంతా ఒక దగ్గర చేరి రంగులు చల్లుకుంటూ ఆనందోత్సవాల్లో మునిగిపోయారు. రసాయనాలు కలిపిన రంగులు కాకుండా సహజ రంగులు వాడాలని సూచించారు.
VSP: జనసేన పార్టీ ‘ఉద్యమి’ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై సోమవారం సీతంపేట పార్టీ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ.. సభ్యత్వం పార్టీ బలోపేతానికి కీలకమని, బూత్ స్థాయి నుంచి పటిష్టం చేయాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా ఇది ముఖ్యమని తెలిపారు.
KNR: క్రీడాకారులు గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలని హుజురాబాద్ ఏసీపీ వి.మాధవి సూచించారు. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ పట్టణంలోని స్థానిక హైస్కూల్ క్రీడా మైదానంలో సోమవారం పీఎం సంసద్ క్రీడా మహోత్సవంలో భాగంగా హుజురాబాద్ నియోజకవర్గ స్థాయి క్రీడలను స్థానిక బీజేపీ నాయకులతో కలిసి ప్రారంభించారు. రాష్ట్రస్థాయి, జాతీయస్థాయి క్రీడలో రాణించాలని ACP కోరారు.