• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

కలెక్టరేట్లో నేడు PGRS కార్యక్రమం

విజయనగరం జిల్లా ప్రజల సమస్యల పరిష్కారానికి సోమవారం ఉదయం విజయనగరం కలెక్టరేట్లో PGRS నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాంసుందర్ రెడ్డి తెలిపారు. ఉదయం 10 గంటలు నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరిగే ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొని అర్జీలు స్వీకరిస్తారన్నారు. మండల కేంద్రాలు, మున్సిపాలిటీల్లోనూ అర్జీల స్వీకరణ ఉంటుందన్నారు.

March 2, 2026 / 08:03 AM IST

టీడీపీ కార్యకర్తకు అండగా ఎమ్మెల్యే

సత్యసాయి: మడకశిర మండలం ఛత్రం గ్రామ పంచాయతీకి చెందిన టీడీపీ కార్యకర్త విజయకుమార్ పక్షవాతంతో మంచాన పడటంపై ఎమ్మెల్యే ఎంఎస్ రాజు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుడి భార్య సమస్యను వివరించగానే స్పందించిన ఎమ్మెల్యే, ఆ కుటుంబానికి భరోసా కల్పిస్తూ రూ. 1 లక్ష నగదు చెక్కును తక్షణ ఆర్థిక సాయంగా అందజేశారు. అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.

March 2, 2026 / 08:02 AM IST

లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయం: MLA

JN: జిల్లా కేంద్రంలోని భ్రమరాంబ కన్వెన్షన్ హాల్‌లో ఆదివారం రాత్రి లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ జిల్లా 320F, 7వ రీజియన్ చంద్రగిరి సేవా సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా వర్ధన్నపేట MLA KR నాగరాజు హాజరై, పద్మశ్రీ గడ్డం సమ్మయ్యను, లయన్స్ సభ్యులను సత్కరించారు. కరోనా సమయంలో లయన్స్ చేసిన సేవలు అనేక ప్రాణాలను కాపాడాయని MLA నాగరాజు కొనియాడారు.

March 2, 2026 / 08:02 AM IST

చంద్రగ్రహణం.. ఆలయం మూసివేత

WGL: చంద్రగ్రహణం సందర్భంగా 3వ తేదీన నల్లబెల్లి మండల కేంద్రంలోని శ్రీ రాజరాజేశ్వరి స్వామి దేవాలయం మూసివేస్తున్నట్లు ఆలయ గౌరవ అధ్యక్షుడు గందె శ్రీనివాస్ గుప్తా తెలిపారు. గ్రహణ సమయం ముగిసిన అనంతరం ఆలయాన్ని శుద్ధి కార్యక్రమాలు నిర్వహించి తిరిగి దర్శనార్థం తెరవనున్నట్లు వెల్లడించారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.

March 2, 2026 / 08:02 AM IST

వాలీబాల్ తగిలి ఇరువర్గాల మధ్య ఘర్షణ

నిజామాబాద్ రూరల్ లోని మల్కాపూర్ తండాలో వాలీబాల్ కారణంగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్నట్లు రూరల్ SHO శ్రీనివాస్ తెలిపారు. FEB 27న తండాకు చెందిన యువకులు వాలీబాల్ ఆడుతుండగా విక్రమ్ వాలీబాల్‌ను కొట్టగా అక్కడే ఉన్న బుజ్జి బాయి అనే వృద్ధురాలికి తగిలింది. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. ఆదివారం ఇరువర్గాల వారు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.

March 2, 2026 / 08:02 AM IST

సీఏ ఫైనల్ పరీక్షల్లో కస్తాల యువకుడి సత్తా

NLG: చండూరు మండలం కస్తాలకి చెందిన కట్టా చరణ్ తేజ చార్టర్డ్ అకౌంటెన్సీ ఫలితాల్లో సత్తా చాటాడు. ఇటీవల విడుదలైన సీఏ ఫైనల్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి తన ప్రతిభను నిరూపించుకున్నాడు. కష్టపడి చదివి ఈ ఘనత సాధించిన చరణ్‌ను తల్లిదండ్రులు, మిత్రులు అభినందనలతో ముంచెత్తుతున్నారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని వారు ఆకాంక్షించారు.

March 2, 2026 / 08:01 AM IST

విదుర నీతి: వీటికి ఎన్నటికీ తృప్తి ఉండదు

లోకంలో ఆరు అంశాలకు ఎప్పుడూ తృప్తి ఉండదని విదురుడు ధృతరాష్ట్రుడికి చెప్పాడు. అగ్ని ఎన్ని కట్టెలు వేసినా ఆరదు, సముద్రం ఎన్ని నదులు కలిసినా నిండదు. మృత్యువుకు ఎన్ని ప్రాణాలు తీసినా చాలు అనిపించదు. అలాగే లోభికి ధనంపై ఆశ, జ్ఞానికి విద్యపై జిజ్ఞాస, అందమైన స్త్రీకి అలంకరణపై మోజు ఎప్పటికీ తీరవు. వీటి సహజ స్వభావాన్ని గ్రహించి మెలగడమే ఉత్తమమని విదుర నీతి సారాంశం.

March 2, 2026 / 08:00 AM IST

ఉద్యోగుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి: మంత్రి

ప్రకాశం: అంగన్వాడీ కార్యకర్తలు, చిరుద్యోగుల సంక్షేమంపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి స్వామి ఆదివారం తెలిపారు. చరిత్రలో తొలిసారిగా అంగన్వాడీ వేతనాలను రెండుసార్లు పెంచిన ఘనత CM చంద్రబాబుకే దక్కుతుందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని స్పష్టం చేశారు.

March 2, 2026 / 07:58 AM IST

‘ప్రతి గ్రామంలో CPI పార్టీని బలోపేతం చేయాలి’

BHPL: మండలం గొల్లబుద్ధారం గ్రామంలో ఆదివారం సాయంత్రం CPI మండల కమిటీ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి రాజ్ కుమార్ మాట్లాడుతూ, అటవీ ప్రాంతంలోని ప్రతి గ్రామంలో సీపీఐ కమిటీలను పటిష్ఠం చేసి పార్టీ బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో CPI పార్టీ నేతలు, గ్రామస్తులు ఉన్నారు.

March 2, 2026 / 07:56 AM IST

కుమ్మెర ఘటనపై నిరసన.. పజ్జూరులో ర్యాలీ

NLG: జిల్లా కుమ్మెరలో అగ్రవర్ణాల దురహంకారానికి బలైపోయిన రెండు నెలల రజక పసిపాప మృతికి నిరసనగా పజ్జూర్లో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. పాప ఆత్మకు శాంతి చేకూరాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో లింగస్వామి, రవితేజ, శ్రవణ్, సైదులు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

March 2, 2026 / 07:56 AM IST

మాచర్ల రైల్వే స్టేషన్‌కు మహర్దశ..!

PLD: దశాబ్దాల కాలంగా అభివృద్ధికి నోచుకోని మాచర్ల రైల్వే స్టేషన్‌కు మంచి రోజులు వచ్చాయి. కూటమి ప్రభుత్వం గతి శక్తి పథకం ద్వారా రైల్వే స్టేషన్‌కు మహర్దశ తీసుకువచ్చింది.ఈ పథకం ద్వారా రైల్వే స్టేషన్‌లో స్టేషన్ మాస్టర్ రూమ్‌‌తో పాటు అత్యాధునిక వెయిటింగ్ హాల్స్, వీఐపీ లాంజ్ కూడా ఏర్పాటు చేయనున్నారు. త్వరలోనే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రైల్వే స్టేషన్ మారనుంది.

March 2, 2026 / 07:56 AM IST

తాళం వేసిన ఇంట్లో చోరీ

NGKL: కల్వకుర్తి నియోజకవర్గంలోని వెల్దండ మండలం అజిలాపూర్ గ్రామ పరిధిలోని అంతిరెడ్డిపల్లిలో ఆదివారం తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగింది. గోరటి అలివేలు అనే మహిళ ఫిబ్రవరి 27న ఇంటికి తాళం వేసి హైదరాబాద్ వెళ్లారు. ఆదివారం తిరిగి వచ్చి చూడగా, ఇంటి తాళం పగులగొట్టి, బీరువాలోని అర్ధ తులం బంగారం, రెండు వెండి మొలతాడులు, రూ. 10 వేల నగదును అపహరించారని తెలిపారు.

March 2, 2026 / 07:55 AM IST

రూ. 60 వేల LOC చెక్కు అందజేత

MDK: ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు సహకారంతో రామాయంపేట మండలం రాయలపూర్ గ్రామానికి చెందిన రాగి సందీప్‌కు రూ.60 వేల ఎల్ఓసి చెక్కును అందజేశారు. ఆపదలో ఉన్నవారికి అండగా ఉంటామని, నియోజకవర్గ ప్రజల సంక్షేమమే ఎమ్మెల్యే ధ్యేయమని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ గజవాడ లావణ్య నాగరాజు, పట్టణ అధ్యక్షుడు చింతల స్వామి తదితరులు పాల్గొన్నారు.

March 2, 2026 / 07:53 AM IST

రెండు ఇసుక ట్రాక్టర్లు పట్టివేత

KMR: నాగిరెడ్డిపేట మండలం జప్తిజానకంపల్లి గేటు సమీపంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను ఎస్సై భార్గవ్ గౌడ్ పట్టుకుని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులను గమనించిన రెండు ట్రాక్టర్ల డ్రైవర్లు వాటిని అక్కడే వదిలేసి పారిపోయినట్లు తండావాసులు తెలిపారు. అనంతరం ఎస్సై ట్రాక్టర్లను పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

March 2, 2026 / 07:49 AM IST

50 ఏళ్ల తర్వాత కలిసిన మిత్రులు

MBNR: జిల్లాలోని ఓ జూనియర్ కళాశాల 1974-76 బ్యాచ్ విద్యార్థులు ఆదివారం అపూర్వంగా కలిశారు. అర్థ శతాబ్దం తర్వాత ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో ఒకరినొకరు ఆలింగనం చేసుకుని పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. తమ కళాశాల అభివృద్ధికి ఆర్థిక సహాయం అందిస్తామని ఈ సందర్భంగా వారు ప్రకటించారు.

March 2, 2026 / 07:48 AM IST