• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

విద్యుత్ షాక్‌తో కాంట్రాక్ట్ కార్మికుడికి తీవ్ర గాయాలు

MDK: రామాయంపేట పట్టణంలో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ జంపర్ మారుస్తుండగా బచ్చు రాజు పల్లి తండాకు చెందిన కాంట్రాక్ట్ కార్మికుడు బాబు లాల్ ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురయ్యారు. ఈ ప్రమాదంలో ఆయనకు తీవ్ర గాయాలు కావడంతో తోటి సిబ్బంది వెంటనే స్పందించి రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

February 27, 2026 / 06:21 PM IST

రాజాపూర్ మండల నూతన వార్డు సభ్యులకు శిక్షణ పూర్తి

MBNR: రాజాపూర్ మండలంలో మొదటి విడతగా 13 గ్రామపంచాయతీలకు చెందిన నూతన వార్డు సభ్యులకు గత 5 రోజులుగా మండలంలోని రైతు వేదికలో శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణ శిబిరం ఈరోజు ముగిసింది. వార్డు సభ్యులకు ఎంపీడీవో విజయలక్ష్మి సర్టిఫికెట్స్ అందజేశారు. వార్డు సభ్యులు మాట్లాడుతూ.. గ్రామాలలో వార్డు సభ్యుల విధులు, అభివృద్ధిపై అధికారుల శిక్షణ తమకు చాలా ఉపయోగపడుతుందన్నారు.

February 27, 2026 / 06:21 PM IST

జిల్లా ప్రధాన కార్యదర్శి నియమాకం..!

NDL: బీజేపీ యువమోర్చా నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎస్. విజయ భాస్కర్ శుక్రవారం ఎన్నికయ్యారు. 2014 నుంచి డోన్ పట్టణంలో విద్యార్థి హక్కుల కోసం ఉద్యమం చేశారు. యువత శక్తిని జాతీయ నిర్మాణంలో భాగం చేయడం, కేంద్ర సంక్షేమ పథకాలను గ్రామస్థాయికి తీసుకెళ్లడం, పార్టీ బలోపేతం చేయడం లక్ష్యంగా ముందుకు సాగాలని ఆయన వెల్లడించారు.

February 27, 2026 / 06:19 PM IST

కోడిపందాల స్థావరంపై దాడులు నిర్వహించిన పోలీసులు

NLR: కావలి మండలం పెద్ద రాముడు పాలెం గ్రామంలో కోడిపందాలు ఆడుతున్నారని సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 9 మంది వ్యక్తులను పట్టుకుని వారి వద్ద నుండి 32,350 రూపాయలు, రెండు కోడిపుంజులను స్వాధీనం చేసుకున్నామని రూరల్ ఎస్సై తిరుమలరెడ్డి తెలిపారు. మండలంలో ఎక్కడైనా పేకాట, కోడిపందాలు, గంజాయి అమ్మితే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు.

February 27, 2026 / 06:19 PM IST

B.Ed ఫలితాలు విడుదల

TPT: తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో గతేడాది డిసెంబర్‌లో బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (B.Ed) మూడో(3వ) సెమిస్టర్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. ఫలితాలను అధికారిక వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవాలని నిర్వాహకులు తెలిపారు.

February 27, 2026 / 06:18 PM IST

నిధుల కేటాయింపునకు డిమాండ్

కడప: జిల్లాలోని చేనేత సహకార సిల్క్, కాటన్ నిధులు కేటాయించే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదని చేనేత ఐక్యవేదిక జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున స్పష్టం చేశారు. కడప కలెక్టరేట్ ఎదుట శుక్రవారం చేనేత సహకార సంఘాలు,ప్రజా సంఘాల నేతలతో కలిసి ఆందోళన చేపట్టారు. సంఘాలను తిరిగి పునరుద్దించేలా RRR నిధులను విడుదల చేసేలా చూడాలన్నారు.

February 27, 2026 / 06:17 PM IST

‘అభివృద్ధిని మరింత బలోపేతం చేయడమే లక్ష్యం’

MNCL: బెల్లంపల్లి మండలం కన్నాల రైతు వేదికలో వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం BFAC సమావేశం నిర్వహించారు. BFAC ఛైర్మన్ రౌతు సత్తయ్య, ADA రాజ నరేందర్ హాజరయ్యారు. సమావేశంలో రైతులకు నూతన సాంకేతిక పరిజ్ఞానం, ప్రభుత్వ పథకాలపై అవగాహన పెంచి, వ్యవసాయ అభివృద్ధిని మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా నిర్ణయాలు తీసుకున్నామని పేర్కొన్నారు.

February 27, 2026 / 06:16 PM IST

ఆస్పత్రి నుంచి భారతీరాజా డిశ్చార్జ్

దిగ్గజ దర్శకుడు భారతీరాజా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. ఆయన తీవ్ర అస్వస్థతకు గురవడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. తాజాగా ఆయన ఆరోగ్యం కుదటపడటంతో వైద్యులు డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం భారతీరాజా తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆయనకు ఇన్ఫెక్షన్లు సోకకుండా ఉండేందుకు కుటుంబ సభ్యులు ఎవరినీ కలవనివ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

February 27, 2026 / 06:16 PM IST

రేపు ఖమ్మం జిల్లాకు ఈటల రాజేందర్

KMM: వెలుగుమట్ల భూబాధితులకు భరోసా కల్పించేందుకు భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మల్కాజిగిరి లోకసభసభ్యుడు ఈటల రాజేందర్ శనివారం ఖమ్మం విచ్చేస్తున్నారు. ఈ మేరకు పార్టీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరు కోటేశ్వరరావు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ పర్యటనలో భాగంగా ఈటల రాజేందర్ బాధితులతో ముఖాముఖి సమావేశం కానున్నారు.

February 27, 2026 / 06:15 PM IST

ఏరియా ఆసుపత్రిని తనిఖీ చేసిన ఎంపీ

ELR: జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రిని శుక్రవారం ఏలూరు ఎంపీ మహేష్ సందర్శించారు. పేషంట్ల వద్దకు వెళ్లి ఆస్పత్రిలో అందుతున్న వైద్య సేవలు గురించి అడిగి తెలుసుకున్నారు.ఆసుపత్రి విషయంలో ఎవరు నిర్లక్ష్యం వహించద్దని ఆసుపత్రికి కావలసిన వివిధ సేవల గురించి ప్రభుత్వంతో మాట్లాడతానని తెలిపారు.ఆస్పత్రి అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

February 27, 2026 / 06:13 PM IST

‘విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేయాలి’

కర్నూలు: యూనైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఇవాళ ఎస్ఈ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ  జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. డి అంజిబాబు మాట్లాడుతూ.. కాంట్రాక్ట్ విద్యుత్ కార్మికులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. కోటి రూపాయల ఇన్సూరెన్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్, సమాన వేతనం కల్పించాలని కోరారు.

February 27, 2026 / 06:13 PM IST

మార్చి 3 నుంచి ‘జనగణన-2027’ శిక్షణ కార్యక్రమం

ATP: జిల్లాలో మార్చి 3 నుంచి 5 వరకు ‘జనగణన-2027’ మొదటి దశ శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి ఏ. మలోల తెలిపారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జేఎన్టీయూ విశ్వవిద్యాలయంలో సుమారు 200 మంది అధికారులకు ఈ శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. ఇళ్ల జాబితా, గృహ గణన అంశాలపై అవగాహన కల్పిస్తామన్నారు.

February 27, 2026 / 06:13 PM IST

వైసీపీకి షాక్.. టీడీపీలోకి ఇద్దరు కార్పరేటర్లు..!

కడప: వైసీపీకి భారీ షాక్ తగిలింది. ఇద్దరు కార్పొరేటర్లు టీడీపీ కండువా కప్పుకున్నారు. ఎమ్మెల్యే మాధవి రెడ్డి, పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో రామలక్షణ రెడ్డి, శివకోటి రెడ్డి సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. ఇప్పటికే పలువురు కార్పొరేటర్ టీడీపీలో చేరగా.. మరో ఇద్దరు నూతనంగా చేరారు.

February 27, 2026 / 06:12 PM IST

మహిళా దినోత్సవం పోస్టర్ ఆవిష్కరించిన కలెక్టర్

W.G:  మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని తణుకులో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరు కావాలని జిల్లా కలెక్టర్‌ చదలవాడ నాగరాణికు శుక్రవారం నిర్వాహకులు ఆహ్వానం అందజేశారు. ఆదరణ సేవా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమం పోస్టర్‌ కలెక్టర్‌ నాగరాణి భీమవరం కలెక్టరేట్‌లో ఆవిష్కరించారు. ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు ఆశాజ్యోతి పాల్గొన్నారు.

February 27, 2026 / 06:11 PM IST

జిల్లాలో ఎంత మంది ఓటర్లు ఉన్నారంటే..?

CTR: ఓటర్ల క్లెయిమ్‌లు వేగవంతంగా పరిష్కారించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులతో ఎన్నికల సంబంధించిన అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో 15,77,743 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. జిల్లా 2002-2025 ఎన్నికల జాబితాతో SIR మ్యాపింగ్‌లో 74.45% పురోగతిని సాధించడం జరిగిందని తెలిపారు.

February 27, 2026 / 06:10 PM IST